వంద పద్యాలు అంతకన్నా ఎక్కువగా పద్యములు ఉంటే, ఆ పద్యముల సమూహమును శతకముగా చెబుతారు. పూర్వులు రచించిన పద్యములు మనకు శతకములుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా సామాజిక పరిస్థితులు, నీతి, ఆచరణ, సంప్రదాయములు, భక్తి, ఆరాధన, వ్యక్తి పరివర్తన తదితర అంశములను స్పృశిస్తూ ఉంటాయి. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లో శతాదిక పద్యములతో కూడి ఉంటాయి.
భక్తి పారవశ్యంతో కొందరు తమ భావనలను పద్యరూపంలో తెలియజేస్తే, కొందరు సమాజంలో వివిధ వ్యక్తిత్వాలపై తమ భావనలను వెల్లడి చేయడం మనకు శతకాలు తెలుగు పద్యాలలో కనబడుతుంది. ఎక్కువగా భక్తితో కూడిన భావనలను తెలియజేస్తూ, వివిధ దేవతల అద్భుత గుణముల విశిష్టతను భక్తి శతకాలు వెల్లడి చేస్తాయి. ఏభావనతో వెల్లడి చేసినా, తద్భావన ఎంతో లోతైన భావం కలిగి ఉంటాయి. ఇంకా శతక పద్యములు చిన్న పద్యములుగానే ఉన్నా గుణాత్మక మార్పును సూచిస్తూ ఉంటాయి అంటారు.
తెలుగులో శతకముల తెలుగుబుక్స్
శతకములు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి వేమన శతకం, సమతీ శతకం, దాశరధి శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం. కానీ పూర్తిగా మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలలో ఉండవు, బాగా ప్రసిద్ది చెందిన పద్యాలే ఉంటాయి. కవులు భక్తి పారవశ్యంతో చేసిన శతకాలు మనలోను భక్తిని పెంపొందిస్తాయి. అలాగే ఇంకా మనకు మరిన్ని శతకాలు కూడా ఉన్నాయి. తెలుగు కవులు రచించిన శతకాలు మనకు మరిన్ని ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ తెలుగుబుక్స్ రూపంలో లభిస్తున్నాయి. మారుతి శతకం, మూకపంచశతి కటాక్ష శతకం, నరసింహ శతకం, భర్త్రుహరి శతకం, కుమారి శతకం, కమార శతకం, కృష్ణ శతకం, ఆంధ్ర నాయక శతకం ఇలాంటి శతకాలు మరిన్ని అందుబాటులో ఉన్నాయి. భక్తిని, ఆలోచనను రేకెత్తించే ఈ శతకమాధుర్యాలు ఉచితంగా చదవాలంటే