తెలుగులో మంచి మాటలు కోట్స్

ఒక్క అలవాటుని జయించినా మనసులో గొప్ప మార్పుకు పునాది అంటారు.

ప్రకృతిలో పంచభూతాలకు మంచివానికి ఉపయోగపడతాయి, చెడ్డవానికి ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమేనని అంటారు.

వితండ వాదన వ్యక్తి అహంకారం నిరూపించుకోవడానికి ప్రయత్నంగా కనబడితే, సంవాదన మంచి ప్రయోజనాల కొరకు చర్చగా మారుతుందని అంటారు. రోజూ అద్దంలో ముఖం చూసుకున్నట్టుగానే, అప్పుడప్పుడూ మనసుని కూడా పరిశీలించుకోవడం వలన మనసు మరో కోణం కనబడుతుందని అంటారు.

నీ పనితనం నీకో గుర్తింపు తెచ్చి పెడితే, నీ నిర్లక్ష్యం నీ అభివృద్దికి అడ్డంకి అవుతుందని అంటారు.

అందమైన శరీరం భగవంతుడిచ్చింది అయితే, అందమైన మనసు మాత్రం నీ ప్రయత్నం వలననే ఏర్పడుతుంది. మనసును బట్టి పెరిగే బంధాలు, ఆ వ్యక్తిని చిరకాలం గుర్తు పెట్టుకుంటాయని అంటారు.

తల్లిదండ్రులు భగవంతుడిచ్చే గురువులు అయితే, వ్యక్తి ఆసక్తిని బట్టి మరొక గురువుపై, అతని దృష్టి నిలబడుతుంది… ఈ ముగ్గురి ఆశయాలకు బట్టి వ్యక్తి భవిష్యత్తు ఆధారపడవచ్చని అంటారు.

తెలుగులో మంచి మాటలు కోట్స్

లోకం అద్దంవంటిది? అద్దంలో మన ముఖ కవళికలను మనకు చూపినట్టు, లోకం మన ప్రవర్తనకు ప్రతి ఫలం అందిస్తుందని అంటారు.

నీ మనసును అందం కట్టిపడేయలేదు కానీ సుగుణాల స్వభావం నీ మనసుపై మంచి ప్రభావం చూపుతుందని అంటారు.

కోపం కలిగినప్పుడు ఆవేశపడితే వచ్చే ఫలితం కన్నా కోపం కలిగినప్పుడు ఆలోచనలో పడితే, కోప గుణాన్ని కూడా మంచిగా మలచవచ్చని అంటారు.

కళాకారుడు అందమైన శిల్పాన్ని చేయగలడు… గుణవంతుడు తన చుట్టూ ఉండే వారిలో మంచిని పెంచగలడని అంటారు.

ముసలితనం బాలుని వలె ఉంటే, పిల్లవానిని లాలించినట్టే, ముసలివారిని లాలించడం చేత, వారు ఆ ఆప్యాయతలోనే ఉపశాంతి పొందగలరని అంటారు.

అసలైన సంపద అంటే నిత్యం సంతోషిగా, తృప్తిగా జీవించగలగడం అని అంటారు.

ఇతరుల వలన బాధ కలుగుతుందని భావించడం కన్నా కాలం వలన బాధలు వస్తూ పోతున్నాయనే భావన వలన మనసుకు శాంతి కలుగుతుందని అంటారు.

విధి రాసిన రాతను సైతం మార్చుకోగలరని పురాణ పురుషులు జీవితాలు నిరూపిస్తాయని అంటారు, పురాణ పఠనం మనోబలం పెంచుతుందని అంటారు.

తెలుగులో మంచి మాటలు కోట్స్

మనసుతో ఏర్పడే విషయానుబంధమే, మనసును నడిపిస్తాయి. ఎటువంటి విషయాలు ఎక్కువగా చేరితే, అటువంటి మార్గములో మనసు నడుస్తుందని అంటారు.

ఆకర్షణీయమైన కాయము ఆకట్టుకోవచ్చును కానీ సుగుణాల కారణంగా వ్యక్తి ప్రేమించబడతాడని అంటారు.

సమూహం ఏర్పడేది సామాజిక ప్రయోజనాల కోసమే కానీ స్వప్రయోజనాల కోసం కాదని అంటారు.

విజయం సంతోషాన్ని తెస్తే, ఓటమి దు:ఖాన్ని తెస్తే, గెలుపు-ఓటమి శాశ్వతం కాదని భావించే భావన మనసుకు బలాన్నిస్తుందని అంటారు.

మంచి గుణాలు ఉండడం ఒక ఎత్తయితే, వాటిని ఉపయోగించడం వ్యక్తి గొప్పతనం తెలియబడుతుందని అంటారు.

మూడు ముళ్ళతో బంధం పెద్దలవలన ఏర్పడితే, దానిని గౌరవిస్తూ, తమ భాగస్వామిని అర్ధం చేసుకుంటూ నడుచుకోవడమే దాంపత్యం యొక్క గొప్పతనం అంటారు.

సమస్య సృష్టించబడుతున్నప్పుడే సమస్యక పరిష్కారం కూడా ఉంటుంది, తాళంతో పాటు తాళం చెవి కూడా తయారైనట్టు…. అని అంటారు.

ఎదగడానికి చదువు ఉపయోగపడితే, ఒదిగిపోవడానికి వినయం ఉపయోగపడుతుంది. సంస్కారం బట్టి బంధాలు ఏర్పడతాయని అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అని అంటారు. దేవతల చుట్టూ మనిషి తిరిగినట్టుగా, ఓర్పు ఉన్నవారి చుట్టూ బంధాలు అల్లుకుంటూ ఉంటాయని అంటారు.

పుస్తకం చూసి వదిలేయకుండా, దానిని చదివి విషయావగాహన ఏర్పరచుకున్నట్టే, మనషుల స్వభావాలను కూడా చదివి అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటే, జీవితం కొత్త కొత్త పాఠాలు నేర్పుతుందని అంటారు.

వ్యక్తి గొప్పతనం ప్రదర్శించుకోవడానికి మరొకరిని చులకనగా చూపించడం సత్ప్రవర్తన కాదని అంటారు.

Puttina Roju Subhakankhalu Quotes Telugu

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్అండ్ వీడియో లింక్స్

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

పవన్ కళ్యాణ్ మూవీస్

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

అచ్చ తెలుగు పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ తెలుగులో

అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్