తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం

తింటే కానీ రుచి తెలియదు. చదివితే కానీ బుక్ లో ఉన్న విషయం తెలియదు. తెలుగు గొప్పతనం తెలియాలంటే, తెలుగు సాహిత్యం చదవాలి. కాబట్టి బుక్స్ తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం అంటారు.

ఏ ప్రాంతం వారికి, ఆ ప్రాంతంలో మాట్లాడే భాషపై సహజంగా పట్టు ఉంటుంది. ఆ ప్రాంత చరిత్ర కూడా ఆ ప్రాంతీయ భాషలో చక్కగా వివరించబడి ఉంటుంది.

ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించినవారే ఆ ప్రాంతం గురించి ఖచ్చితంగా వివరించగలరు. అప్పుడు వారి సొంత భాషలో చక్కగా వివరించగలరు.

అలా చరిత్రకెక్కిన సాహిత్యం లేకా ప్రాంతీయ విశిష్టతలు ఆయా ప్రాంతీయవాసులపై ప్రభావం చూపుతాయి.

పోతనగారు భాగవతం తెలుగులోకి అనువదించకుండా ఉంటే, మనకు భగవానుడి లీలలు గురించి పుస్తకరూపంలో తెలుగులో ఉండేది కాదు.

పోతనామాత్యడిలాగా చాలా మంది చాలా గ్రంధములను తెలుగులోకి అనువదించడం వలననే మనకు పురాణ గ్రంధములు తెలుగులో లభిస్తున్నాయి. జీవితపరమార్ధం మనకు తెలుసున్న తెలుగుభాషలో చక్కగా అర్ధం చేసుకోగలం.

వాడుక ప్రాంతీయభాష వలన, ఆభాష మాట్లాడేవారి మద్యలో పెరుగుతాం. మన శరీరం పెరగడంతో బాటు మన మనుసు పట్టుకునే వివిధ విషయాలపై ప్రాంతీయ భాష ప్రభావం ఉంటుంది. అటువంటి ప్రాంతీయ భాష వ్యాకరణంతో నేర్వడం మనిషి జీవనగమ్యానికి చాలా అవసరం అంటారు.

తెలుగు ప్రాంతంలో పుట్టిపెరిగినవారికి, తెలుగులోనే మాటలు నేర్వడం ఉంటుంది. తెలుగులోనే తొలిపలుకులు పలికి పలువురికి ఆనందం కలుగజేస్తాం.

కన్నవారికి ఆనందం, చుట్టూ ఉన్నవారికి సంతోషానికి కారణం, మనం మన మాతృభాషలో మాట్లడడమే. అది ఇచ్చిన తెలుగుభాషను తెలుసుకోవడం వలన ఇంకా పూర్వులు చెప్పిన సూక్తులు, శ్లోకాలు, గ్రంధాలు ఇవ్వన్ని అవగాహన తెచ్చుకోగలం.

దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారని పెద్దలు అంటారు.

ఆనాటి కాలంలో సంస్కృతము గొప్ప కానీ అటువంటి సంస్కృత పండితులు సమక్షంలో శ్రీకృష్ణదేవరాయలు ఈమాట అన్నారంటే, అది తెలుగుభాష విశిష్టతను తెలియజేస్తుంది.

పండితులు తెలుగులో అనువదించిన గ్రంధాలు, పండితులు తెలుగులో వ్రాసిన సాహిత్యం, పండితులు తెలుగులో వ్రాసిన హితములు చదవాలంటే తెలుగు తెలియాలి. తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం.

తెలుగు కవులు వ్రాసిన కవిత్వాలు, తెలుగు పద్యాలు ఎంతో అర్ధాన్నిస్తుంటాయి. అటువంటి జీవిత పరమార్ధం తెలియజెప్పే ఎన్నో తెలుగుబుక్స్ చదవడానికి తెలుగు నేర్వాలి.

తెలుగులో రీడ్ చేయడం వలన తెలుగు బుక్స్ లో ఉన్న విషయసారం మన మనసుకు చేరుతుంది. ఉత్తమ పుస్తకం పఠనం మనసును సంస్కరిస్తుంది అంటారు.

సత్సంగం చేయాలని పెద్దలు చెబుతారు. ఉత్తమ పుస్తకపఠనం కూడా సత్సంగంగానే చెబుతారు. కాబట్టి తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం.