తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా మన తెలుగుకు మనం దగ్గరగానే ఉన్నామా…. మన మాతృభాష అయిన తెలుగును మరిచి పోయావా?

ఎందుకు అంటున్నారంటే, నేటి పిల్లల్లో తెలుగు పుస్తకం చదవడానికి కష్టపడుతున్నారు. ఇంగ్లీషులో పుస్తకం ఈజీగా చదివేస్తున్నారు. అవును నేటి కాలంలో టాలెంటుతో బాటు ఇంగ్లీషు అవసరం అనర్ఘలంగా మాట్లాడగలిగితేనే కార్పోరేట్ రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది.

కానీ మాతృభాష అయిన తెలుగులో మాత్రం చదవడానికి ఇబ్బందులు పడే పిల్లలకు రేపు తత్వపరమైన పుస్తకం రీడ్ చేయాలంటే, ఎంతవరకు సాధ్యపడుతుంది. అశాంతితో వేగిపోయే మనసుకు తాత్విక చింతన స్వాంతన కలిగిస్తుందంటే, అందుకు తెలుగు సాహిత్యం చేయగలిగినంతగా మరే సాహిత్యము మన తెలుగువారికి చేయలేదని అంటారు.

ఇంకొక విషయమేమిటంటే, పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలో కూడా ఇంగ్లీషు పదాలు పలికినంత తేలికగా తెలుగు పదాలు పలకలేకపోవడం కూడా విచిత్రమైన విషయంగా పెద్దలు పరిగణిస్తారు.

తెలుగులో విశ్వక్షేణుడు, దత్తాత్రేయుడు, పరాత్పారరావు వంటి కొన్ని పేర్లు పలకడానికి ఇబ్బందిపడే పిల్లలకు కూడా కనబడడం తెలుగువారు హర్షించదగినది కాదని అంటారు.

పిల్లలు తెలుగుకు దూరమవుతున్నారు

కొన్ని సంవత్సరాల క్రితం పిల్లలకు ట్యూషన్ పెట్టించవలసి వస్తే, మాథ్స్ మరియు ఫిజిక్స్ వంటి సబ్జెక్టులలో మాత్రమే ట్యూషన్ చెప్పించేవారు మిగిలిన భాషపరమైన విషయాలలో పిల్లలే పరిణితిని సాధించేవారు.

కానీ ఇప్పుడు భాషపరమై సబ్జెక్టులకు కూడా పిల్లలు ప్రావీణ్యత కావాలంటే, ట్యూషన్ తప్పనిసరి అయిందంటే, మన వాడుక భాషలో తెలుగు పదాలు దూరం అవుతున్నాట్టేగా…. పిల్లలకు ఇంగ్లీషు బాగా రావాలని ఇంట్లోనూ ఇంగ్లీషు భాష మాట్లాడడం తప్పుకాదు. కానీ తెలుగును దూరం చేయడం మాత్రం పొరపాటని అంటారు.

వాడుక భాషలో ఇంగ్లీషు పదాలు చేరాకా చాలమందికి ఎదురయ్యే ప్రశ్న… తెలుగు మరిచి పోయావా? అని.

తెలుగు మాట్లాడే ప్రాంతంలో పుట్టి, తెలుగు భాషలో పట్టు లేకుండా ఉండడం హర్షణీయం కాదు. కనీసం వాడుక భాషలో కూడా తెలుగు పదాలు దూరం అవ్వడం మరింత విడ్డూరం.

మరొక ముఖ్య విషయం…. పుట్టినరోజు తేదీలు.

పిల్లల పుట్టిన తేదీలు ఇంగ్లీషు కేలండర్ డేట్స్ బట్టే ఉండడం…

ఒక బాలుడు రెండు వేల సంవత్సరంలో మే నెల 10 తేదీన పుట్టాడు అనుకుంటే, ఆ బాలుడి తల్లిదండ్రులు పేరు పెట్టడానికి బ్రాహ్మణుడి దగ్గరకు వెళతారు. ఆ బ్రాహ్మణుడు ఆ బాలుడుకి సూచించే పేరు ఏ ప్రాతిపదికన మొదటి అక్షరం సూచిస్తాడు. ఇంగ్లీషు తేదీ ప్రకారం కాదు. 2000 మే నెలలో 10 తేదీ బాలుడు పుట్టిన సమయంలో ఏ నక్షత్రం ఏ పాదమో చూసి, పేరు యొక్క మొదటి అక్షరం సూచిస్తాడు. కాబట్టి మనకు ఎప్నటికీ జాతకాలు నమ్మేవారికి ప్రధానమైన పుట్టినరోజు తేదీ ఇంగ్లీషు కేలండర్ బట్టి కాదని స్పష్టం అవుతుంది. కానీ మనకు ఇంగ్లీషు కేలండర్ బట్టి పుట్టిన రోజులు నిర్వహించుకంటూ, ఆ తేదీలలోనే పిల్లవానికి ఆశీర్వాదములు ఇప్పిస్తాము…

కానీ మన తెలుగు పంచాంగం ప్రకారం బాలుడి పుట్టిన తేదీ గుర్తు పెట్టుకుని, ప్రతి ఏడాది పిల్లవానికి పెద్దలు ఆశీస్సులు అందించడం శ్రేయష్కరం అంటారు. ప్రకారం 2000 సంవత్సరం మే నెల 10వ తేదీ తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల సప్తమి తిది అవుతుంది. ప్రతి ఏడాది ఆ తిధి రోజున దైవదర్శనం చేయడం పిల్లవానికి శ్రేయష్కరమని పెద్దలంటే, ఎంతమంది తెలుగు వారు తెలుగు పంచాంగం ప్రకారం పిల్లవానికి ఆశీర్వాదం చేస్తునారు?

ఇంగ్లీషు కేలండర్ చూసి చూసి ఇంగ్లీసు తేదీలు అలవాటు

మనకు అలవాటు అయిన ఇంగ్లీషు నేటి సమాజంలో మనకు చాలా అవసరం. దానిని మరింతగా పెంచుకోవాలి. అదే సమయంలో తెలుగు కూడా మనకు చాలా అవసరం. వ్యక్తి జీవనమ్ముక్తికి కావాల్సిన సాహిత్యం తెలుగులోనే ఉంటుంది.

తెలుగు మనకు జీర్ణమయిన భాషగా ఉండాలి కానీ తెలుగు పదాలు పలకడానికే కష్టపడాల్సిన ఆగత్యంలో మనముండరాదు అని అంటారు.

మరిన్ని తెలుగు పోస్టులు

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?

డిసెంబర్ 31 జనవరి 1

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

ఫేస్ బుక్ తెలుగురీడ్స్ పేజి

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

తెలుగురాశి ఫలాలు 2020 టు 2021

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….