ప్రసిద్ద తెలుగు చలనచిత్ర దర్శకులు

Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu ఎందరో తెలుగు దర్శకులు మనకి మంచి చిత్రాలను అందించి అందరిని అలరించారు, ఎన్నోన్నో చిత్రాలలో మనోల్లాసం కలిగించే కధలను వెండితెరపై చూపించారు. మరెన్నో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. సామజిక అంశాలలో సాంఘిక సూచనలు కలిగిన చిత్రాలను అందించారు. కుటుంబ విలువలను తెలిపే చిత్రాలు, కొందరు అందిస్తే ప్రేమ కావ్యాలు కొందరు తెరకెక్కించారు. ఇలా వివిధములైన విషయలలో అంశాలలో తెలుగు చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి బుల్లి తెరలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. వారిలో కొంతమంది దర్శకులు కె విశ్వనాధ్, దాసరి నారాయణరావు, ఏ కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, కే రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టి, జంద్యాల, ముత్యాల సుబ్బయ్య, ఇవివి సత్యనారాయణ, ముప్పలనేని శివ, విజయ బాపినీడు, వంశీ, టి కృష్ణ, సింగీతం శ్రీనివాసరావు, బాపు, బి గోపాల్, సాగర్, రేలంగి నరశింహారావు, ఎస్వి కృష్ణారెడ్డి, శరత్, క్రాంతి కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, ఏ మోహన్ గాంధీ, విజయభాస్కర్ మొదలైనవారు Telugu ChalanaChitra prasidda uttama darshakulu.

కె విశ్వనాధ్ – Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu, K Vishwanath

కె విశ్వనాధ్ గారి పేరు చెబితే ఉత్తమ చిత్రాలకు దర్శకులుగా చెబుతారు. కళాతపస్వి అనే బిరుదనామం కూడా ఆయనికి చెబుతారు. మూగమనసులు చిత్రంకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కె విశ్వనాధ్ గారు ఆత్మగౌరవం చిత్రానికి దర్శకత్వం వహించారు, ఆ చిత్రం ఒక నంది అవార్డు గెలుచుకుంది. ప్రైవేటు మాస్టర్, కలోసిచ్చిన అదృష్టం, ఉండమ్మాబొట్టుపెడతా, ఓ సీతకధ, చెల్లెలి కాపురం, నిండు దంపతులు,  జీవనజ్యోతి, సిరి సిరి మువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, సూత్రదారులు, స్వాతికిరణం, శుభసంకల్పం, ఇంకా పలు తెలుగు చిత్రాలతో బాటు తమిళ్ హిందీ భాషలలో దర్శకత్వం వహించారు.

యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహిస్తే, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు, ఇంటర్నేషనల్ హానర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ఇంకా ఫిలిం ఫేర్ అవార్డ్స్ మొదలైన పలు అవార్డ్స్ గెలుచుకున్నారు. మానవ సంభందాలు – సామజిక అంశాలుపై మేలుకొల్పు చిత్రాలుగా తీసారు. క్లాసికల్ హిట్ చిత్రాల దర్శకులుగా ప్రఖ్యాతి గాంచిన మహనీయ దర్శకులు. అనవసరపు హంగులు లేకుండా అవసరమైన్ కధలను సామజిక అంశాలు మానవతా విలువలపై సందేశాత్మక చిత్రాలుగా మలచడం కె విశ్వనాధ్ గారి గొప్పతనం.

భారతీయ సాంప్రదాయ సంగీత గొప్పతనం కె విశ్వనాధ్ గారి చిత్రాల వలన ఇంకా ఎక్కువమందికి తెలిసేలా జరిగింది. సంగీతం ప్రధాన అంశంగా శంకరాభరణం, శ్రుతిలయలు, సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణ కమలం స్వాతి కిరణం చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా కొన్నిచిత్రాలు నటించారు.

దాసరి నారాయణరావు, Dasari Narayanarao

1972 సంవత్సరంలో తాతామనవడుకి దర్శకత్వం ప్రారంభించిన దాసరి నారాయణరావుగారు 2014 సంవత్సరంలో ఎర్రబసు చిత్రంతో కలిపి 140 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా చాలా చిత్రాలలో కనిపించి అలరించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, కొన్ని చిత్రాలను నిర్మించారు. ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. మొదటి చిత్రం తాతమనవడు చిత్రానికి అవార్డు అందుకోగా తరువాత స్వరం-నరకం, మేఘసందేశం లాంటి చిత్రాలకుకూడా అవార్డ్ అందుకున్నారు. ఇంకా మామగారు తెలుగుచలనచిత్రంలో దాసరి గారి నటన అంటే ఇష్టపడిన తెలుగు వారుండరు.

కన్న తల్లిదండ్రులను విడిచి, తన విలాసాల కోసం డబ్బుకి అంతస్తులకి లొంగిన కొడుకుని కన్నందుకు సిగ్గుపడి, బాధపడి అఖిరికి కోర్టులో కొడుకుని నిలబెట్టిన సూరిగాడు చిత్రంలో దాసరి నటన ప్రశంసనీయం. అడవి పల్లెల అడపడుచులపై చేసే ఆకృత్యాలని చిత్రంలో దర్శకుడుగా తెరకెక్కించి తానూ ఒక పాత్రను పోషించిన ఒసేయ్ రాములమ్మ చిత్రం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇంకా తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, మాటలు-పాటలు ఇలా ఒకే వ్యక్తి ఎక్కువ చిత్రరంగాల్లో రాణించిన వ్యక్తి దాసరిగారే ఉంటారు. 2017 మే 30 న సికింద్రాబాద్లో కిమ్స్లో కన్నుమూసారు.

కోడి రామక్రిష్ణ, Kodi Ramakrishna

100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు, చిరంజీవి హీరోగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో దర్శకుడు పరిచయమయ్యారు. అయితే కోడిరామకృష్ణ ముందుగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వ శాఖలో పనిచేసారు. చిరంజీవితో ఇంకా ఆలయశిఖరం, సింహపురి సింహం, గూడచారి నెం1, రిక్షావోడు, అంజి చిత్రాలకు దర్శకులుగా వ్యవహరించారు. నందమూరి తారక రామరావుగారి బాలకృష్ణకు సోలో హీరోగా విజయంతమైన చిత్రం మంగమ్మగారి మనవడు చిత్రానికి కోడి రామకృష్ణే దర్శకులు. తరువాత బాలకృష్ణతో పలు తెలుగుచిత్రాలు ముద్దులకృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమేనల్ల్దుడు, బాలగోపాలుడు దర్శకత్వం వహించారు.

తెలుగులో గ్రాఫిక్స్ కలిగిన చిత్రాలు ఎక్కువగా దర్శకత్వం వహించడంతో భారి చిత్ర నిర్మాణ వైభవం కోడి రామకృష్ణగారి దర్శకత్వంలోనే ఎక్కువ ఉండేవి. అమ్మోరు, దేవిపుత్రుడు, అంజి, దేవి, అరుందతి వంటి చిత్రాలతో గ్రాఫిక్స్ ఎక్కువగా వాడి తెలుగువారికి అద్బుత చిత్రాలను అందించారు. కోడి రామకృష్ణగారి చిత్రాలు మద్యతరగతి సంసార ఇతిభాదలు, కుటుంబ బంధాలు ప్రధాన అంశంగా కొన్ని చిత్రాలు ఉంటాయి. ఆవిడే శ్యామల, ఆస్తిమూరెడు ఆశబారెడు, ఆలయశిఖరం, పెళ్లి, పెళ్ళాం చెబితే వినాలి, పెళ్లిపందిరి, పుట్టింటికి రా చెల్లి, ముక్కుపుడక, పంచదార చిలక మొదలైన చిత్రాలు ఉంటే కోడి రామకృష్ణ కొన్ని చిత్రాలలో నటించారు. చిన్నపిల్లలతో భక్తి యాత్ర చేయించి దేవుళ్ళ గురించి మహిమల గురించి తెలియజెప్పారు.

కె రాఘవేంద్ర రావు – Telugu ChalanaChitra Prasidda Uttama Darshakulu, K Raghavendrarao

దర్శకేంద్రుడు అని శతచిత్ర దర్శకులైన రాఘవేంద్రరావు గారిని అంటారు. తెలుగు చిత్ర సీమలో NT రామారావు గారి నుండి మంచు మనోజ్ వరకు చాల మంది హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిన్న మొన్నటి తెలుగు అగ్రతారలు రామారావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విక్టరి వెంకటేష్ తొలిచిత్రం కలియుగ పాండవులు రాఘవేంద్రుడి దర్శకత్వంలోనే వచ్చింది. మహేష్ బాబుని రాజకుమారుడు చిత్రంతో, అల్లుఅర్జున్ని గంగోత్రి చిత్రంతో హీరోలుగా నేటి తరం అగ్రహీరోలను తొలిపరిచయం చేసింది రాఘవేంద్రరావు గారే.

తెలుగు అగ్రహీరోలకు బిగ్గెస్ట్ హిట్ చిత్రాలను అందించింది కె రాఘవేంద్రరావు గారే, పదహారేళ్ళ వయసు, వేటగాడు, గజదొంగ, కొండవీటిసింహం, త్రిశూలం, దేవత, అడవిదొంగ, అగ్నిపర్వతం, పట్టాభిషేకం, జానకిరాముడు, కొండవీటిదొంగ, ఆఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, సుందరకాండ, అల్లుడుగారు, ఘరానామొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరిప్రియుడు, పెళ్లిసందడి, ముద్దులప్రియుడు, రాజకుమారుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు దర్శకత్వం వహించారు. పాటలచిత్రీకరణలో పళ్ళుపూవులు నటుల అందాలతో అందంగా తీయడం రాఘవేంద్రరావుగారి తరువాతే.

సాంఘిక చిత్రాలలో అనేక విజయాలను అందుకున్న రాఘవేంద్రరావుగారు భక్తిరస చిత్రాలలోనూ మంచి విజయాలు సాధించారు. అన్నమయ్య చిత్రంతో నాగార్జునని ఓకే భక్తుడిగా సుమన్ వేంకటేశ్వరస్వామిగా చూపించి అందరి ప్రశంశలు అందుకున్నారు. తరువాత చిరంజీవిని శివుడిని చేసి అర్జున్ని భక్తుడిగా శ్రీమంజునాధ చిత్రంతో మళ్ళి ఒకసారి భక్తుల మన్ననలను అందుకున్నారు. మరలా భక్తిచిత్రాలతోనే నాగార్జున హీరోగా శ్రీరామదాసు కధని, షిర్డీ సాయిబాబా కధని వెండితెరపై ప్రసరింపచేసారు. సాంఘిక చిత్రమైన భక్తిచిత్రమైన ప్రేక్షకులకు అర్ధం అయ్యేరీతిలో తీయడం, ప్రేక్షక హృదయాలని రంజింప చేయడంలో దిట్ట. ఈతరం ప్రసిద్ద దర్శకులలో జక్కన రాజమౌళి రాఘవేంద్రరావు గారి శిష్యుడే.

కెఎస్ఆర్ దాస్, KSR Das

యాక్షన్ తరహాలో నేరవిభాగంలో సాగే అంశాల చిత్రాలు తీయడంలో సిద్దహస్తులు. నేరస్తులను వెంటాడే పోలీసులు, నేరస్తులను పట్టుకోవడంలో ప్రత్యేక ఏజెంట్స్ నిర్వహించే ఆపరేషన్స్ వంటి చిత్రాలను తెరకేక్కించడంలో ఘనాపాటిగా చెబుతారు. తెలుగుతో బాటు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తం మీద 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో కెఎస్ఆర్ దాస్ ఒకరు.

శోభన్ బాబు కధానాయకుడుగా నేరగాళ్ళను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో లోగుట్టుపెరుమాళ్ళకెరుక చిత్రం దర్శకత్వం వహించారు. తరువాత కృష్ణతో అనేక సాహాస చిత్రాలు తీసారు, టక్కరిదొంగ చక్కనిచుక్క, మోసగాళ్ళకు మోసగాడు, అన్నదమ్ముల సవాల్, ఏజెంట్ గోపి, దొంగలవేట, మాయదారి అల్లుడు, రహస్యగూడచారి, దొంగలు బాబోయ్ దొంగలు, దొంగలకుసవాల్ వంటివి ఉన్నాయి. కృష్ణంరాజు – చిరంజీవి హీరోలుగా పులి బెబ్బులి, కృష్ణ-రజనికాంత్ హీరోలుగా ఇద్దరూ అసాధ్యులే  వంటి మల్టీస్టారర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా కృష్ణతో చిత్రాలకు దర్శకత్వం వహించారు.

తెలుగురీడ్స్