తెలుగు బుక్స్ చదివే అలవాటు

మనకు మేలు చేసే విషయాలలో తెలుగు బుక్స్ అని అంటారు. తెలుగు బుక్స్ చదివే అలవాటు ఉంటే, అవీ ఉత్తమ రచయితల బుక్స్ అయితే మరీ మేలు అంటారు.

ఎందుకు అంటే స్వామి వివేకానంద లాంటి మహానుభావుల మాటలు బుక్స్ ద్వారా ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంటాయి.

మహానుభావుల మాటలు మనసుకు బలమైన మందు అంటారు. ఏనుగు మావటివాని అంకుశానికి భయపడ్డట్టు, మనిషి మనసు సజ్జనుల మాటలకు భయపడుతుందని అంటారు.

అందుకని తెలుగులో అందుబాటులో ఉన్న ప్రసిద్ధ రచనలు లేక పండితుల రచనలను చదవాలని అంటారు.

ముఖ్యంగా యువతకు ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం చేరుకోవడంలో యువతకు గట్టి పట్టుదల ఉండాలి. ఆ లక్ష్యసిద్దికై యువతలో తపన పెరగాలి. కొండంత లక్ష్యమునకు కూడా సాధించగలననే విశ్వాసం ఉండాలని అంటారు. అలా యువతకు స్పూర్తినిచ్చేవిగా స్వామి వివేకానంద మాటలు ఉంటాయి.

తెలుగు బుక్స్ చదివే అలవాటు
తెలుగు బుక్స్ చదివే అలవాటు
ఈ క్రింది కోట్ చదవండి….

బ్రతికినా చచ్చినా మీ సొంత శక్తి మీదనే ఆధారపడండి. ఈ ప్రపంచంలో పాపం అనేది ఏదైనా ఉంటే అది బలహీనతే. బలహీనతను అన్ని విధాలా విడిచిపెట్టండి. ఎందుకంటే బలహీనతే పాపం, బలహీనతే మరణం.

—– స్వామి వివేకానంద

ఏదైనా సొంత ప్రయత్నం మనకొక అనుభవం తీసుకువస్తుంది. ఒకరు చెప్పింది చేయడమే అలవాటు అయితే, ఎప్పుడూ వెనకాల చెప్పడానికి మరొక మనిషి ఉంటూనే ఉండాలి.

మనకంటూ ఒక మంచి లక్ష్యం ఉండాలి అంటారు. అయితే ఎటువంటి లక్ష్యం ఉండాలి? జీవితానికి అసలు లక్ష్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు ఎవరి జీవితాన్ని వారు స్టడీ చేసుకుని లక్ష్యం నిర్ధేశించుకోవాలని అంటారు.

లక్ష్య సాధనలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సిన మానసిక స్థైర్యం తెలుగువారికి తెలుగు బుక్స్ చదవడవం వలన వస్తుందని అంటారు.

లక్ష్యానికి చేరువయ్యే కొలది ప్రకృతి పరీక్ష కఠినంగానే ఉంటుందని అంటారు. కాలంలో వచ్చే కష్టం మనసును రాటుదేలుస్తాయి. అయితే మనసు చలించకుండా ఉండడం ప్రధానమని అంటారు.

యువతకు వచ్చే ఆలోచనలకు సరైన దిశానిర్ధేశం పెద్దలు చేస్తూ ఉంటారు. ఇంకా బుక్స్ కూడా ఒక మిత్రునిలాగా పని చేస్తాయి. ఏదైనా వ్యక్తి జీవిత అనుభవాల పుస్తకం, కష్టకాలంలో మనోనియంత్రణను సూచిస్తాయి. అటువంటి బుక్స్ చదవడం వలన మనకొచ్చిన కష్టం తేలికపడుతుందంటారు.

అలాగే సమాజంలో వ్యక్తుల గుణగణాలను అంచనా వేయడానికి కూడా మనకు మన బంధుమిత్రుల ద్వారా తెలిసే ఉంటుంది. అయితే ఇంకా లోతైనా పరిశీలనకు అయితే మనకు తెలుగుబుక్స్ మరింత ప్రయోజనకరం అంటారు.

ఎదుటివారి వ్యక్తిత్వాలను అంచనా వేయగలగడం వలన సమాజంలో మనం మెసలగలిగే వెసులుబాటును మనం క్రియేట్ చేసుకోగలం. వ్యక్తిత్వ పరిశీలన కూడా మనకు బంధు మిత్రుల ద్వారా తెలియవస్తుంది.

వ్యక్తిత్వ వికాసం లాంటి తెలుగుబుక్స్ చదవడం వలన మన వ్యక్తిత్వం యొక్క లక్షణం తెలియవస్తుంది. స్వామి వివేకానంద రచనలు యువతకు ఉపయుక్తంగా ఉంటాయి. అటువంటి తెలుగు బుక్స్ లో యువతా! లెండి!మేల్కోండి!మీ శక్తిని తెలుసుకోండి! ఫ్రీపిడిఎఫ్ బుక్ లింకు ఈ క్రింది బటన్ కు ఎటాచ్ చేయబడి ఉంది. క్లిక్ చేసి ఉచితంగా చదవవచ్చును.