సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను

కొత్త 4జి స్మార్ట్ ఫోను కొనాలనుకంటే సామ్సంగ్ నుండి గాలాక్షీ సిరీస్ లో సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను వచ్చింది. ఈ ఫోను మార్చి5, 2020 నుండి అమ్మకాలకు అమెజాన్ సైటులో అందుబాటులో ఉంటుంది. దీని ధర 14999/-.

న్యూ గాలాక్షీ ఎం31 ఫోను నాలుగు బ్యాక్ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ కెమెరా క్వాలిటీ 5ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మార్కో కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమరా లు ఉన్నాయి.

32ఎంపి ఫ్రంట్ కెమెరా 4కె వీడియో రికార్డింగుకు చేయవచ్చట. టైప్ సి చార్జింగ్ ద్వారా ఫాస్ట్ చార్జింగుకు అనుకూలం.
6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ద్యం కలిగి ఉండడం వలన బ్యాకప్ బాగుండవచ్చు.
6.4 అంగుళాల ఇనిఫినిటి డిస్ల్పే గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది.
6జిబి ర్యామ్ డిడిఆర్4 టెక్నాలజీతో ఫాస్ట్ పెర్పార్మెన్స్ కలిగి ఉంటుంది.

128/64 జిబి ఫోన్ మెమోరి, 512జిబి ఎక్స్ టర్నల్ మెమోరి కార్డు స్లాట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్, ఆండ్రాయిడ్ 10, వర్చువల్ లైట్ సెన్సింగ్, జియోమెట్రిక్ సెన్సార్, గైరో సెన్సార్, ఏక్సలరోమీటర్, ప్రొక్సిమిటి తదితర ఫీచర్లు కలిగి ఉంది.

ఈ ఫోను ఓసన్ బ్లూ మరియు బ్లాక్ కలర్లలో లభిస్తుంది.