భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు.

సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో పురాణ ప్రవచనం జరుగుతున్నప్పుడు భక్తిశ్రద్ధలతో వినాలని చెబుతారు. ఇంకా అక్షరజ్ఙానం ఉన్నవారు అయితే పురాణ పఠనం చేస్తూ ఉంటారు. భక్తిశ్రద్ధలతో పురాణపఠనం చేయడం వలన లక్ష్యసిద్ది ఉంటుంది అని ఫలశ్రుతులు కూడా చెబుతారు.

చిన్నతనంలో పిల్లలు అమ్మ పెట్టే అన్నం తినాలంటే, ఆపిల్లాడి మనసు ఆకర్శించే ఏదో ఒక పనిచేయాల్సి వస్తుంది. కొందరు పిల్లలు కథ చెబితే, అన్నం తింటే, కొందరు పిల్లలు పాట పాడితే అన్నం తింటారు. కొందరు పిల్లలు ఏదైనా ఆట వస్తువు ఇస్తే ఆడుకుంటూ అన్నంతింటారు. అంటే ఏమి తెలియని వయసులో కూడా కొంతమంది అన్నం తినడానికి వారి మనసు ఏదో ఒక అధిక ప్రయోజనం కూడా కోరుతుంది అంటారు.

మనసుకు సహజంగా అలవాటు అయిన వ్యాపార లక్షణం చేత, మనసు ప్రయోజనం ఉండే విషయాలతో ఎక్కువగా మమేకం అయ్యిం ఉంటుంది అంటారు. అందువలన మనసుకు మేలు చేసే విషయాలే అయినా వాటిని పట్టుకోవడంలో ఆసక్తి చూపించదు అంటారు. ఎందుకంటే మనసుకు మేలు చేసే విషయాలు దీర్ఘకాలిక విధానాలను సూచిస్తూ ఉంటాయి. అటువంటి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ ఉంటేనే సాద్యమంటారు. ఎందుకంటే పురాణములు చదవడంలో లేక వినడంలో ముందుగా పుణ్యప్రయోజనం చెబుతారు.

భక్తిశ్రద్దలతో వినడం చేయడం లేక చదవడం వలన పురాణములలోను భగవతత్వమును గ్రహించే అవకాశం ఉంటుంది. భగవానుడినే చేరడమే జీవన పరమావధి అని గ్రహించినవారికి ఈవిధంగా ఉంటే, ఏదైనా కోరికతో చేసేవారికి, ప్రకృతిని శాసించే భగవతత్వం ఏదో ఒకరూపంలో సహాయకారిగా ఉంటుంది అంటారు.

ఏ పురాణం చూసినా అందులో వివిధ దేవతా స్వరూపములు, ఆయా స్వరూప గుణాలను తెలుపుతూ ఉంటారు. ఆయా దేవతా మూర్తులను ఆరాధించడంలో విధి విధానాలను, భక్తి శ్రద్ధలను తెలియజేస్తూ ఉంటారు. దేవతలను ఆరాధించే విధానమునే పూజగా చెబుతూ ఉంటారు. ఒక్కో పురాణములోనూ ఒక్కో దేవతా మూర్తిని ఆరాధించే ప్రక్రియను, ఆ దేవత గుణగణములను తెలియజేస్తారు.

సమస్యలతో సతమతమయ్యే మనిషికి పురాణం అనగానే కాలక్షేపంగా భావిస్తారు. కానీ సంసారంలో ఉన్నవారికే ఎక్కువగా పురాణ విషయాలు తెలిసి ఉండాలి అని పెద్దలు అంటారు. కారణం పురాణంలోని సారంశం బోధపడి ఉంటే, సంసారం సమస్యలతో సాగితే, సమస్యను పరిష్కరించుకునే శక్తి మనసుకు ఉంటుంది అంటారు.

రామాయణం మనిషి ధర్మములను తెలియజేస్తూ ఉంటే, మహాభారతం సామాజికంగా కూడా ధర్మ సూక్ష్మములను తెలియజేస్తూ ఉంటుంది అంటారు. భాగవతం భక్తితో ఉండడం చేత అలౌకికానందం పొందడంతో మనసుకు శాంతిని ఏర్పరచుకోవచ్చును అని చెబుతూ ఉంటారు. భక్తిపారవశ్యం చేత శాంతి పొందిన మనసు సమస్యను శాంతియుత మార్గంలో చూడగలుగుతుంది. తద్వారా పరిష్కారం కష్టమైన ఆచరణలోకి మనసు వెళుతుంది అంటారు.

మనిషకి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ ఉండడం చేత పురాణములలోని విషయాలు అవగతం అవుతాయని అంటారు. పురాణములు విని ఉండడం వలన ఆయా గాధలలోని విశేషములు మనసుకు హత్తుకుని ఉంటాయని అంటారు. తెలుగులో రచించబడిన పురాణములు చదివే ముందు పెద్దల మాటలలో వాటిని విని చదవడం మరింత ప్రయోజనంగా చెబుతారు.

తెలుగులోనే ఉన్నా తెలుగుసాహిత్యంలో అన్ని భావాలు తెలియబడి ఉండవు అంటారు. అందువలన తెలుగులోనే ఉండే తెలుగుబుక్స్ రీడ్ చేయలంటే, ముందుగా పండితుల నోట ఆయా బుక్స్ గురించిన ప్రవచనాలు విని ఉండడం మేలు అంటారు. తెలుగు శ్రేష్ఠమైన భావాలతో ఉత్తమమైన విధానాలను తెలియజేస్తూ మనిషిలో మంచిని పెంచుతు మనిషి మనసులో శాంతిని పెంచేవిధంగా ఉంటుందని అంటారు. తెలుగువెలుగులు మనిషి మనసుకు వెలుగులమేడ అంటారు.

తెలుగులో ఉచితంగా తెలుగు రచనలు పురాణముల గురించిన తెలుగు బుక్స్ ఆన్ లైన్లో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్