ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది, తనకు తిండి పెట్టిన ఇంటి యజమాని ఇంటిని రక్షణ చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. మరి పురుషుడైనా, స్త్రీ అయినా భూమిమీదకు రావాలంటే స్త్రీ గర్భం ధరిస్తేనే. స్త్రీ ప్రసవవేదన మరణవేదనతో సమానం అటువంటి స్త్రీకి చేతులు జోడించి నమస్కారం చేసిన మన సమాజంలో మగాడు మృగాడు అవ్వడం విశ్వాసఘాతుకమే అవుతుంది. ప్రియాంక రెడ్డి మరణం టివిలో చూస్తుంటే, మనిషికి జన్మినిచ్చే స్త్రీ ఎంత వేదనను పొంది ఉంటుంది?

స్త్రీ సహజంగానే పెద్ద పెద్ద త్యాగాలనే చేస్తుంది. ఒకటి వివాహం చేసుకుని తనకు అంతగా పరిచయం లేని అత్తవారింటికి వచ్చి, అందరిలో కలుస్తుంది. తనకు తాళి కట్టిన భర్తకు అన్ని సేవలు చేస్తుంది. తన అత్తవారింటి వంశం పెరగడానికి స్త్రీ తనకు మరణసదృశ్యమైన వేదనను పొందడానికి సిద్దపడుతుంది. అటువంటి స్త్రీపై ప్రియాంకరెడ్డి లాంటి దారుణ హత్యాచారాలు జరగడం, సమాజం ఏస్థితిక పోతుంది?

భారతీయ స్త్రిని గౌరవించడ మన సంప్రదాయం అని ఆర్ టి సి బస్సులలో వ్రాసుకోవడం జరిగిందంటే, అంతకుముందు మన పెద్దలు స్త్రీని ఎంతగా గౌరవించి ఉంటారు. అలాంటి మన సమాజం నుండి నేటి సమాజంలో స్త్రీపై దారుణాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం, భయంకరం. ఇంక స్త్రీ ఎలా సమాజంలో తిరుగుతుంది. ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే… చూసిన స్త్రీ ఎటువంటి వేదన గురి అవుతుంది.

నిర్భయచట్టం ప్రభుత్వం తీసుకువచ్చినా ఇలాంటి దారుణాలు స్త్రీపై జరగడం అమానుషం, ఇలాంటి అమానుషాలు జరిగిప్పుడు అందరం కఠినంగా శిక్షించాలి అని రోదించడం ఒక్కటే ఉంటుంది. కఠిన శిక్షలు ఉంటే, ఇలాంటి మృగాళ్ళకు భయం పెరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలకు పండితులు రివ్యూలు చదవడం ఉంటుంది. కానీ సమాజంలో మాత్రం మృగాళ్లకు ప్రియాంకరెడ్డి లాంటి స్త్రీలు బలి అవుతున్నారు. దారుణంగా సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

అసలు స్త్రీపై ఇలాంటి హత్యాచారాలు జరపడానికి, వారికి ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది. ఆ మృగాళ్ళకు తల్లిదండ్రులు చెప్పే నీతి ఏమైనా ఉందా? నీతి చెప్పలేక తల్లిదండ్రులు వదిలేస్తున్నారా? ఇలా మృగాళ్ల తల్లిదండ్రుల విషయంలో కొన్ని ప్రశ్నలు ఉంటే, వారి వారి స్నేహితులకు ఉండే అలవాట్లు ఏమిటి? మృగాళ్లు మరియు వారి స్నేహితులకు చోటిచ్చిన సమాజం, ఎలాంటిది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? అనే భయంకర ప్రశ్న ఉదయిస్తుంది. ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే… వచ్చే సహజమైన ప్రశ్నలు ఇలా ఉంటే, ఇంతకుముందు టివిలలో వచ్చిన, స్త్రీలపై జరిగిన దారుణాలు గుర్తుకు వస్తుంటే మన సమాజం ఎటువైపు వెళుతుంది?

వంద మంది నేరస్తులకు శిక్షపడకపోయినా సరే ఒక నేరం చేయని వ్యక్తి శిక్ష పడకూడదనే న్యాయవ్యవస్థ వలననే మృగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారా? దారుణాలు చేయడానికి కారణం? కఠినశిక్షలు వెంటనే అమలు కావనే ధైర్యం మృగాళ్ళల్లో పెరుగుతుందనే భావన, ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే… బలపడుతుంది. దారుణం, అమానుషం, అన్యాయం అంటూ నినాదాలు చేసే ప్రజలు ప్రియాంకరెడ్డి లాంటి స్త్రీలపై జరిగినప్పుడు పెరుగుతున్నాయి. కానీ ఇటువంటి సంఘటనలు జరగడం సమాజికంగా భయంకరమైనది.

ప్రియాంకరెడ్డి మరణం లాంటి దారుణ మరణాలు మరలా జరగకుండా ఉండాలి. సమాజంలో యువతకు ధర్మం, న్యాయం, నీతి, స్త్రీ అంటే గౌరవభావం లేకుండా వలన ఇలాంటి దారుణాలు జరగడానికి ప్రేరణ మృగాళ్లకు పెరుగవచ్చును. యువతలో స్త్రీ గురించి చెడుభావన కాకుండా సద్భావన పెరగాలి. స్త్రీ ఒక జీవికి జన్మినిచ్చి సృష్టికర్తగా మారుతుంది. అటువంటి స్త్రీపై గౌరవభావన మరింత పెరగాలి.

ప్రియాంకరెడ్డి ఆత్మశాంతిని పొందాలని ఆశిస్తూ, ఇటువంటి మరణాలు మరే ఇతరస్త్రీకి జరగకూడదు అని కోరకుంటూ….ప్రభుత్వం సరైన రీతిలో మృగాళ్లకు ముచ్చెమటలు పట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ…తెలుగురీడ్స్….. సారీ టు స్త్రీ….