నోకియా6.2 స్మార్ట్ ఫోను బడ్జెట్ ఫోను

నోకియా ఫోను ప్రియులకు నోకియా6.2 స్మార్ట్ ఫోను నచ్చే విధంగా బడ్జెట్ ధరలో ఆన్ లైన్లో లభిస్తుంది. నోకియా వెబ్ సైటు నుండి ఈ ఫోను కొనవచ్చును. ఇంకా అమెజాన్ ఈకామర్స్ వెబ్ సైటు నుండి కూడా మీరు నోకియా6.2 స్మార్ట్ ఫోనును కొనుగోలు చేయవచ్చును. అయితే ఈ ఫోను ఫీచర్స్ చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. బ్రాండెడ్ బడ్జెట్ ఫోన్లలో నోకియా6.2 ఒకటిగా చెబుతున్నారు.

నోకియా6.2 స్మార్ట్ ఫోను 6.3అంగుళాల స్క్రీను FHD, HDR ఫీచర్స్ కలిగి ఉంటుంది. మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. సిరామిక్ బ్లాక్, ఐస్ కలర్లలో నోకియా6.2 స్మార్ట్ ఫోను లభిస్తుంది. స్నాప్ డ్రాగన్ 636 సి.పి.యు కలిగి, 4జి.బి. ర్యామ్, 64జి.బి. ఇంటర్నల్ మెమోరి కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ కార్డు స్లాటుతో వస్తున్న ఈ ఫోను నానో సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది.

నోకియా6.2 స్మార్ట్ ఫోను గురించి రివ్యూ వెబ్ సైటులు ఏమి చెబుతున్నాయో చూస్తే…. ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ప్రముఖ ఆన్ లైన్ రివ్యూ వెబ్ సైటు అయిన 91మొబైల్స్ వారు ఈ స్మార్ట్ ఫోనుకు స్పెక్ స్కోర్ 80% వరకు ఇచ్చారు. స్మార్ట్ ఫోను కెమెరా, డివైస్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ విభాగాలలో రేటింగ్ శాతం ఎక్కువగా ఉంది.

మరొక ఆన్ లైన్ రివ్యూ వెబ్ సైటు అయిన స్మార్ట్ ఫిక్స్ 8.1/10 రేటింగ్ ఇచ్చారు.

ఇంకా టైప్-సి చార్జర్ తో బాటు, 4జి, వైఫై, బ్లూటూత్, జిపిఎస్, ఎఫ్.ఎం రేడియో, 3.5 ఆడియో జాక్ రెండు మైక్రోఫోన్లు కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 వెర్షన్ కలిగిన ఈ నోకియా6.2 స్మార్ట్ ఫోన్ ధర 15999/- లుగా నోకియా వెబ్ సైటులో ఉంది. మీరు నోకియా సైటును సందర్శించి ఆన్ లైన్ ద్వారా ఈ ఫోనును కొనుగోలు చేయవచ్చును.ఇన్ బాక్స్ లో డివైస్, గైడ్, చార్జర్, హెడ్ సెట్, సిమ్ ట్రే టూల్ ఉంటాయి.

గమనిక: ఆన్ లైన్ సమాచారం అనుసరించి, తెలుగు వీక్షకుల సౌకర్యార్ధం ఈపోస్టు చేయడం జరిగింది. నాణ్యతా పరమైన విషయాలలో ఆయా వెబ్ సైటులో సరిచూసుకుని కొనుగోలు చేయగలరు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్