న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు

న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు ప్రజలకు సమాజంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకిత్తిస్తూ, అవగాహనను ఏర్పరుస్తాయి. జరుగుతున్న పరిణామాలపై ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది. గతంలోని నాయకులు ప్రభావం వలన ఏ పరిణామలు సంభవించాయి? ఇప్పటి పరిణామలు సామాజిక స్థితిని ఎలా ప్రభావితం చేయబోతాయో? అవగాహన చర్చాకార్యక్రమములు చూడడం ద్వారా ఏర్పడవచ్చును.

2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, ప్రజావేదిక కూల్చివేతతో సంచలనానికి తెరదీసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు రీటెండర్ అంటూ మరో సంచలనం సృష్టించింది. ఆపై రాజధాని మార్పుపై ఏపి మంత్రులు మాట్లాడడంతో అమరావతి రాజధానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిపై జిఎన్ రావు కమెటీ ఏర్పాటు చేయడం, ఆ కమెటీ మూడు రాజధానులు ప్రతిపాదనను వస్తే, 2019 శీతకాలపు శాసనసభలో చివరిరోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు వెల్లడి చేయడం జరిగింది. ఆ ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళనలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి రాజధాని వ్యవహారం సంచలనంగా మారింది.

ఇక 2020 జనవరిలో మూడు రాజధానుల బిల్లు, సి.ఆర్.డి.ఏ రద్దు బిల్లు శాసనసభలో పాస్ అయ్యాయి. అయితే వాటికి శాసనమండలిలో బ్రేక్ పడింది. శాసనమండలిలో టిడిపికి మెజార్టి ఎక్కువ ఉండడం చేత, ఆసభలో ఈ రెండు బిల్లులు పాస్ కాలేదు. ఇంకా ఈ రెండు బిల్లులను ప్రజాభిప్రాయ సేకరణ కొరకు సెలక్టు కమిటీకి మండలి చైర్మన్ సిఫారసు చేయడం మరొ సంచలనం అయ్యింది. ఇలా ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెల రాజకీయ ప్రకంపనలతో నడుస్తుంది.

చర్చాకార్యక్రమమలలో విశ్లేషణలు

రాజకీయ నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయి. తాజా ఏపి రాజకీయాలు అందరిలోనూ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అయితే ఈ సంఘటనలు జగన్మోహన్ రెడ్డిగారి నిర్ణయాలు టిడిపి అభిమానులకు నచ్చకపోవచ్చును. అలాగే చంద్రబాబునాయుడు గారి నిర్ణయాలు కూడా జగన్మోహన్ రెడ్డిగారి అభిమానులకు నచ్చకపోవచ్చును. అయితే ఈ రాజకీయాలు ప్రజలకు గందరగోళంగా అనిపిస్తే, వారు వీక్షించేది మాత్రం న్యూస్ చానల్లో చర్చా కార్యక్రమములు. ఈ చర్చాకార్యక్రమముల వలన రాజకీయ పార్టీల నాయకుల ప్రశ్నలు, సమాధానలతో బాటు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుల విశ్లేషణలు ఉంటాయి.

చర్చా కార్యక్రమముల వలన రాజకీయ, సామాజిక అంశాలలో ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది. ఇటువంటి చర్చాకార్యక్రమములు రాజకీయ ఆసక్తి కలిగినవారు చాలామంది వీక్షిస్తూ ఉంటారు. అలాంటి చర్చా కార్యక్రమములలో ఏపి24×7 న్యూస్ చానల్లో వెంకటకృష్ణ గారి చర్చా కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ఎక్కువమంది వీక్షిస్తూ ఉంటారు. వెంకటకృష్ణగారి లేవనెత్తే పాయింట్లు, చర్చలో పాల్గొనే నాయకుల ద్వారా మాట్లాడించడం ఎక్కువమందిని ఆకర్షిస్తూ ఉంటాయి.

వెంకటకృష్ణ గారు ఏపి24×7 న్యూస్ చానల్లో ప్రతిరోజూ చర్చాకార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ చానల్లో వచ్చే రాజకీయ చర్చా కార్యక్రమమును అనేకమంది ప్రత్యక్షవీక్షణను యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపి రాజకీయాలు సంచనాలకు కేంద్రంగా మారుతున్నాయి. ప్రస్తుత రాజకీయ సమాజంలో నాయకుల మరియు పార్టీల అభిప్రాయం, ప్రభుత్వ పనితీరు వలన భవిష్యత్తుపై అవగాహన రాజకీయాసక్తి కలిగిన వారికి ఏర్పడుతుంది. అందరికీ తెలియని నిబంధనలు, అందరికీ తెలియని వ్యక్తులు కూడా రాజకీయ సంఘటనలతో తెరపైకి వస్తూ ఉంటారు.

ఇంకా టివి9 లో మురళీకృష్ణగారి చర్చాకార్యక్రమం కూడా ఎక్కువ మంది వీక్షిస్తూ ఉంటారు.

టివిలలో వచ్చే న్యూస్ చానల్స్ ద్వారా రాజకీయ అంశములపై, రాజకీయ నాయకుల నిర్ణయాలపై చర్చా కార్యక్రమములు జరుగుతూ అందరిలో రాజకీయ పరిస్థితులపై అవగాహన తెచ్చే విధంగా ఉంటాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితులతో పాటు గతంలో సమాజం ఎదుర్కొన్న సంక్షోభాలు, వాటి ప్రభావాలు కూడా ఈ న్యూస్ చానల్స్ నుండి చర్చాకార్యక్రమములు నందు చర్చకు వస్తాయి. వీటిని వీక్షించడం ద్వారా ఎన్నికల సమయానికి ఏపార్టీతీరు ఎలా సాగుతుందో? అవగాహన ఏర్పడుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్