నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన చేయడం మాత్రం కామన్. కానీ ఆలోచన పరిస్థితులకు అనుకూలంగా ఉంటే మనసు ప్రశాంతత. పరిస్థితులకు ప్రతికూలంగా ఉంటే, మనసులో ఆశాంతి.

ప్రశాంతతో ఉండే మనిషి మనసు, ఎదుటివారి ఆలోచనలో ఆంతర్యం గ్రహిస్తుంది. అశాంతితో ఉండే మనిషి మనసు ఎదుటివారి ఆలోచనలకు ప్రభావితం అవుతూ ఉంటుంది.

నీలో ఇద్దరు‘ ఫ్రీ తెలుగుబుక్ లోని పరిచయం పేజి ఇమేజ్ ఈ క్రింద జతచేయబడింది, చదవండి.

నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

పరిచయ పలుకులు వాడుక భాషలో చక్కగా ఉన్నాయి. ఇంకా పుస్తకం చదివితే మరింతగా మనసు పట్టుకుంటుంది.

ఎందుకు తెలుగు బుక్స్ చదవాలి?

ఒక తెలుగుబుక్ చదవగానే అందులో అంశం అర్ధం కాదు. ఆ బుక్ లో ఉన్న అంశంతో మనసు మమేకం కావాలి.

తెలుగుబుక్ లో ఉన్న అంశంపై ఆలోచన కలగాలి. ఆ ఆలోచన సవ్యదిశలో సాగాలి. అవగాహన ఏర్పరచుకున్న విషయంపైనే మనసుకు స్పష్టత వస్తుంది.

ఏదైనా ఒక తెలుగుబుక్ చదువుతుంటే, అందులో ఉన్న అంశం మనసుకు ఇష్టమా ? కాదా? అని సరిచూసుకోవాలి.

ఎందుకంటే మనసు ఇష్టపడితే, అందులోని అర్ధాన్ని తేలికగా గ్రహించగలదు. అందుకే మనసుకు ఇష్టమైన అంశం కలిగి ఉన్న తెలుగుబుక్ చదవాలి అంటారు.

ధర్మం గురించే తెలిపే బుక్స్, మనస్తత్తాన్ని గురించి విశ్లేషించే తెలుగుబుక్స్, సామాజిక స్పృహను కలిగించే తెలుగుబుక్స్ చదవడం వలన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, అంటారు.

ఎంతమందితో మనకు పరిచయం ఉంటే, అన్ని రకాల విషయాలు మన మనసులోకి చేరతాయి. ఎన్ని విషయాలు తెలిసి ఉంటే, అన్ని ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఎంత ఆలోచన ఎక్కువగా ఉంటే, అంతలా మనసు అలసటకు గురవుతుంది.

ఆలోచనలు ఎక్కువగా ఉంటే, ఆ ఆలోచనలు నియంత్రించడం మనసుకు అసాధ్యం కాదు, కానీ చాలా కష్టమంటారు. ఎందుకంటే అలవాటు పడిన మనసు, అలవాటును మార్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది.

ఎప్పటికప్పుడు మనసు తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే, దానికి సమాజం నుండి వచ్చే ప్రతిస్పందన వలన మనసు మరలా ప్రభావితం అవుతూ ఉంటుంది.

అందుకే మనిషి మనసు ఏవిధంగా ప్రభావితం అవుతుంది. దాని బలహీనత ఏమిటి? దాని బలమేమిటి? అనే విషయంలో అందరికీ వారి మనసు గురించి వారికి తెలుసుండాలి అంటారు.

మనస్తత్వాల గురించి విశ్లేషణలు కలిగి ఉన్న తెలుగుబుక్స్ చదవడం వలన కొంతవరకు మనసుపై మనసు పరిశీలన చేసే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్