మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?

మీ చానెల్లో యొక్క యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేయడం ఎలా? ఈ బ్లాగు పోస్టులో….

అప్ లోడ్ చేయబడిన మీ యూట్యూబ్ వీడియో మరల మీ డెస్క్ టాప్ కంప్యూటర్ నందు డౌన్ లోడ్ చేయాలంటే, కొన్ని వెబ్ సైట్స్ ఉంటాయి. మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ నందు మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేసుకోవడం సులభమే.

కంప్యూటర్ బ్రౌజర్లో వీక్షిస్తున్న వీడియో url ఈ క్రింది విధంగా ఉంది అనుకోండి. క్రింది యుఆర్ఎల్ గమనించండి….

https://www.youtube.com/watch?v=3wnG9k3VbVE

పై యుఆర్ఎల్ నందు https://www. ఆంగ్ల అక్షరాల తరువాత youtube.com/watch?v=3wnG9k3VbVE ఈ ఆంగ్ల అక్షరాలకు ముందు ss అను రెండు అక్షరాల ఈ క్రింది యుఆర్ఎల్ మాదిరిగా జత చేసి ఎంటర్ చేయగానే… యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ లింక్ అందించే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.


https://www.ssyoutube.com/watch?v=3wnG9k3VbVE

చుడండి పై యుఆర్ఎల్ నందు బోల్డ్ చేయబడిన ఆంగ్ల అక్షరాలు ఎక్కడ టైపు చేయబడి ఉన్నాయో… అలాగే ఏదైనా యూట్యూబ్ వీడియో లింకులో ss అను ఆంగ్ల అక్షరాలు లింక్ మద్యలో యాడ్ చేసి, సదరు వీడియోను డౌన్ లోడ్ చేయవచ్చు.

మరొక వెబ్ సైట్ ద్వారా కూడా మీ చానెల్ నందు గల యూట్యూబ్ వీడియోలను సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు.

మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?

గూగల్ నందు ఈ క్రింది విధంగా y2mate అను ఆంగ్ల అక్షరాలు టైపు చేయండి. ఆ తరువాత గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఉంటుంది.

పై చిత్రంలో చూపిన విధంగా మొదట్లోనె కనబడుతున్న యుఆర్ఎల్ ఈ క్రింది విధంగా ఉంది. దాని పై క్లిక్ చేయగానే, సదరు వై2మేట్ వెబ్ సైట్ మీ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది.

https://www.y2mate.com

ఈ క్రింది చిత్రం గమనించండి…. వై2మేట్.కాం ఓపెన్ అయితే ఈ క్రింది ఇమేజ్ మాదిరిగా ఉంటుంది.

మీరు ఈ వెబ్ సైట్ నుండి మీయొక్క యూట్యూబ్ చానెల్ లోని వీడియోలు లేదా ఆ వీడియోకి సంబందించిన ఆడియో ఫైల్ సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రింది చిత్రం గమనించండి.

పై చిత్రంలో ఒక యూట్యూబ్ వీడియో మీ యూట్యూబ్ వీడియో అయితే, దాని వీడియోలో కూడా పై చిత్రంలో చూపినట్టుగానె లైక్, అన్ లైక్ బట్టన్స్ మరియు షేర్ బట్టన్ ఉంటుంది. షేర్ బటన్ పై క్లిక్ చేస్తే, ఈ క్రింది చిత్రంలో మాదిరిగా ఒక పోప్ అప్ విండో వస్తుంది. క్రింది ఇమేజ్ చుడండి.

మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?

పైన గల ఇమేజ్ లో వీడియో లింక్ ఎదురుగా copy అను ఆంగ్ల అక్షరాలు బ్లూ కలర్లో కనబడుతున్నాయి… కదా ఆ ఆంగ్ల అక్షరాలపై క్లిక్ చేయగానే, వీడియో యొక్క లింక్ copy అవుతుంది.

అలా మీ చానెల్ యూట్యూబ్ వీడియో లింక్ copy చేసి, దానిని అప్పటికే ఓపెన్ చేసి ఉన్న వై2మేట్.కాం బ్రౌజర్లో ఈ క్రింది చిత్రంలో మాదిరిగా పేస్ట్ చేయగానే, ఆడియో వీడియో డౌన్ లోడ్ బట్టన్లు కనబడతాయి.

మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?

పైచిత్రంలో చూపిన విధంగా వీడియో లింక్ బట్టన్ పై క్లిక్ చేయగానే, క్రింది చిత్రంలో మాదిరి మరొక పోప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ గ్రీన్ కలర్లో ఉన్న డౌన్ లోడ్ బట్టన్ పై క్లిక్ చేయగానే, మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ కావడం మొదలు అవుతుంది.

కొన్ని బ్రౌజర్ సెట్టింగ్స్ బట్టి ఈ క్రింది చిత్రంలో మాదిరిగా, డౌన్ లోడ్ ఫైల్ ను సేవ్ చేయవలసిన పోప్ అప్ విండో ఓపెన్ అవ్వవచ్చు… అప్పుడు ఒకే బట్టన్ క్లిక్ చేస్తే, మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ అవుతుంది.

మీ నెట్ వర్క్ ఇంటర్నెట్ వేగం బట్టి, వీడియో డౌన్ లోడ్ సమయం ఉంటుంది.

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

యోగ సాధన తెలుగు బుక్స్

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం