లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?

ఏవైనా కొన్ని వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సర్వీసులు…. ఇలా ఏవైనా ఒకే చోట చూపడానికి జాబితా తయారు చేస్తాము. అలాగే మొబైల్ యాప్ ఒకే స్క్రీనులో కొన్ని విషయాలను చూపడానికి లిస్ట్ చేయాలి. అలా లిస్ట్ చేయడానికి లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగపడుతుంది. సింపుల్ లిస్టువ్యూ ద్వారా ఏవైనా కొన్ని వస్తువుల లేదా వ్యక్తుల లేదా సర్వీసు వివరాలను ఒక స్క్రీనులో చూపవచ్చును.

లిస్టువ్యూ ఉపయోగించి, ఒక బేసిక్ ఆండ్రాయిడ్ యాప్ ఎలా చేయాలో ఈ పోస్టులో చూద్దాం.
కొత్త ఆండ్రాయిడ్ ప్రొజెక్టు ఆండ్రాయిడ్ స్టూడియో స్టార్ట్ చేయగానే ముందుగా మెయిన్ ఏక్టివిటి ఎక్స్.ఎం.ఎల్ ఫైల్, దానికి సంబంధించిన జావా ఫైల్ ఓపెన్ అవుతాయి.

ఈ క్రింది ఇమేజ్ చూడండి… మీరు కొత్త ప్రాజెక్టు ఓపెన్ చేస్తే, ఈ విధంగా మెయిన్ లేఅవుట్ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ఓపెన్ అవుతంది.

టాప్ రైటులో మూడు వర్డ్స్ ఉన్నాయి. కోడ్(Code), స్ల్పిట్(Split),డిజైన్(Design). వీటిలో మీరు కోడ్(Code) పైక్లిక్ చేస్తే, కేవలం కోడ్ మాత్రమే స్క్రీనుపై కనబడుతుంది.

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?

స్ల్పిట్(Split)పై క్లిక్ చేస్తే కోడ్ మరియు డిజైనింగ్ పార్ట్ రెండూ కనబడతాయి. ఎక్కువమంది ఈ Split పద్దతిలోనే వర్కు స్పేస్ ఉండేలా చూసుకుంటారు.

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?

డిజైన్(Design)పై క్లిక్ చేస్తే, కేవలం డిజైన్ మోడ్ మాత్రమే కనబడుతుంది. ఇది డ్రాప్ అండ్ డ్రాగ్ పద్దతిలో యాప్ డిజైన్ చేసేవారికి సులువుగా ఉంటుంది.

ఏ కొత్త ఏక్టివిటీ తీసుకున్న, దానికి ఒక ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ మరియు జావా ఫైల్… రెండూ క్రియేట్ అవుతాయి.

ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ లేఅవుట్ డిజైన్ చేయడానికి ఉపయోగిస్తాం. జావా ఫైల్ బ్యాక్ గ్రౌండులో జరిగే కోడింగ్ వ్రాయడానికి ఉపయోగిస్తాం.

ఇప్పుడు మెయిన్ ఏక్టివిటీ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్లో లిస్టువ్యూ విడ్జెట్ ఉపయోగించడానికి ఈ క్రింది కోడ్ గమనించండి.

ఈక్రింది ఇమేజ్ చూడండి. ఇది జావా ఫైల్. మెయిన్ లేఅవుట్ కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో కోడ్ వ్రాస్తే, ఎక్స్.ఎం.ఎల్ లేఅవుట్లో యాక్షన్ చేయగలుగుతాం.

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?
లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ మెయిన్ ఏక్టివిటీలో లిస్టువ్యూ

దిగువ చిత్రంలో చూడండి…. స్ప్లిట్ మోడ్లో ఉన్న ఏక్టివిటీ మెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ఒక్కటి ఉంది. అందులో రైట్ సైడులో లిస్టువ్యూ కనబడుతుంటే, మిడిల్ నందు కోడ్ కనబడుతుంది.

ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ లిస్టువ్యూ

పై ఇమేజ్ లో ఒక లైనర్ లేఅవుట్ ఫైల్ నందు ఒక టెక్ట్స్ వ్యూ తీసుకోబడింది. అందులో లిస్టువ్యూ అనే టైటిల్ టెక్ట్స్ వ్రాయబడింది. అలాగే ఆ టైటిల్ టెక్ట్స్ క్రిందగా ఒక లిస్టువ్యూ కోడ్ వ్రాయబడి ఉంది.

ఎగువన గల చిత్రంలో మూడు విడ్జెట్లు కోడ్ రూపంలో వ్రాయబడి ఉన్నాయి. మూడింటికి ప్రొపర్టీస్ ఆయా ట్యాగులనుందు వ్రాయబడి ఉన్నాయి. ఈ ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ ద్వారా లిస్టువ్యూ డిజైన్ పూర్తి అయ్యింది.

ఇక ఈ లిస్టువ్యూకు బ్యాక్ గ్రౌండ్ జావా కోడ్ ఫైల్ ఈ క్రింది చిత్రంలో చూడండి.

మీకు మెయిన్ ఏక్టివిటి.జావా ఫైల్ ముందుగా ఈక్రిందివిధంగా డిఫాల్ట్ కోడ్ కలిగి ఉంటుంది.

package add.to.list;
import androidx.appcompat.app.AppCompatActivity;
import android.os.Bundle;

public class MainActivity extends AppCompatActivity {

  @Override
  protected void onCreate(Bundle savedInstanceState) {
    super.onCreate(savedInstanceState);
    setContentView(R.layout.activity_main);


  }
}

పై కోడ్ నందు onCreate మెధడ్ ద్వారా ఎక్స్.ఎం.ఎల్ కోడ్ లింక్ చేయబడి ఉంది. ఇప్పుడు ఆ మెధడ్ లోనే లిస్టువ్యూకు సంబంధించిన జావా కోడ్ పై ఇమేజులో చూపిన విధంగా వ్రాయాలి.

క్రింది బ్లాకులో గల కోడ్ ను మెయిన్ ఏక్టివిటీ.జావా ఫైల్లో ఆన్ క్రియేట్ మెధడులో పేస్ట్ చేస్తే సరిపోతుంది.

ArrayList<String> myList = new ArrayList<>();
    myList.add("వినాయకరావు");
    myList.add("రంగారావు");
    myList.add("వెంకట్రావు");
    myList.add("రామారావు");
    myList.add("విశ్వేశ్వరరావు");
    myList.add("నారాయణరావు");
    myList.add("భుజంగరావు");
    myList.add("జగదీశ్వరరావు");
    myList.add("శ్రీనివాసరావు");
    myList.add("పాపారావు");
    myList.add("మోహనరావు");
    myList.add("హరనాధరావు");
    myList.add("చంద్రరావు");
    myList.add("సూర్యరావు");
    myList.add("శ్యామలరావు");
    myList.add("సోమేశ్వరరావు");
    myList.add("కాంతారావు");
    myList.add("కృష్ణారావు");
    myList.add("శంకరరావు");
    myList.add("విద్యాధరరావు");
    myList.add("కనకారావు");
    myList.add("సీతారావు");
    myList.add("శాంతారావు");
    myList.add("మాధవరావు");

    ListView listView = findViewById(R.id.listView);

    ArrayAdapter<String> arrayAdapter = new ArrayAdapter<>(this, android.R.layout.simple_list_item_1,myList);
    listView.setAdapter(arrayAdapter);

ఆ తర్వాత ప్రొజెక్ట్ రన్ చేస్తే ఈక్రింది విధంగా ఎమ్యులేటర్ నందు లిస్టువ్యూ మొబైల్ యాప్ కనబడుతుంది.

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ ఎలా చేయాలి?

ఒకే వేళ మీరు ఓపెన్ చేసినా కొత్త ప్రొజెక్టులో మెయిన్ ఏక్టివిటిలోనే లిస్టువ్యూ చేయాలంటే, ఈ క్రిందిగా పూర్తి కోడ్ కాఫీ, పేస్ట్ చేయండి.

ఏక్టివిటిమెయిన్.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ పుల్ కోడ్… లిస్టువ్యూ ఆండ్రాయిడ్ యాప్

<?xml version="1.0" encoding="utf-8"?>
<LinearLayout xmlns:android="http://schemas.android.com/apk/res/android"
  xmlns:app="http://schemas.android.com/apk/res-auto"
  xmlns:tools="http://schemas.android.com/tools"
  android:layout_width="match_parent"
  android:layout_height="match_parent"
  android:orientation="vertical"
  tools:context=".MainActivity">

  <TextView
    android:layout_width="match_parent"
    android:layout_height="wrap_content"
    android:gravity="center"
    android:text="List View"
    android:textSize="18sp"
    android:padding="10dp"/>

  <ListView
    android:id="@+id/listView"
    android:layout_width="match_parent"
    android:layout_height="match_parent"
    android:divider="@color/black"
    android:dividerHeight="1dp"/>

</LinearLayout>

మెయిన్ ఏక్టివిటి.ఎక్స్.ఎం.ఎల్ ఫైల్ పుల్ కోడ్… ఈ క్రింది కోడులో పేకేజ్ పేరు మాత్రం కాఫీ చేయకండి. మీ ప్రాజెక్టులో ప్యాకేజి నేమ్… ఇది తేడా ఉంటుంది… కాబట్టి.

package add.to.list;

import androidx.appcompat.app.AppCompatActivity;

import android.os.Bundle;
import android.widget.ArrayAdapter;
import android.widget.ListView;

import java.util.ArrayList;

public class MainActivity extends AppCompatActivity {
  @Override
  protected void onCreate(Bundle savedInstanceState) {
    super.onCreate(savedInstanceState);
    setContentView(R.layout.activity_main);

ArrayList<String> myList = new ArrayList<>();
    myList.add("వినాయకరావు");
    myList.add("రంగారావు");
    myList.add("వెంకట్రావు");
    myList.add("రామారావు");
    myList.add("విశ్వేశ్వరరావు");
    myList.add("నారాయణరావు");
    myList.add("భుజంగరావు");
    myList.add("జగదీశ్వరరావు");
    myList.add("శ్రీనివాసరావు");
    myList.add("పాపారావు");
    myList.add("మోహనరావు");
    myList.add("హరనాధరావు");
    myList.add("చంద్రరావు");
    myList.add("సూర్యరావు");
    myList.add("శ్యామలరావు");
    myList.add("సోమేశ్వరరావు");
    myList.add("కాంతారావు");
    myList.add("కృష్ణారావు");
    myList.add("శంకరరావు");
    myList.add("విద్యాధరరావు");
    myList.add("కనకారావు");
    myList.add("సీతారావు");
    myList.add("శాంతారావు");
    myList.add("మాధవరావు");

    ListView listView = findViewById(R.id.listView);

    ArrayAdapter<String> arrayAdapter = new ArrayAdapter<>(this, android.R.layout.simple_list_item_1,myList);
    listView.setAdapter(arrayAdapter);
 }
}    

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

చిన్నపిల్లల పేర్లు తెలుగులో ఆచ్చ తెలుగు బాలబాలికల పేర్లు తెలుగురీడ్స్ మొబైల్ యాప్