గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్

గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్
గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్

ఐకమత్యమే మహాబలము అంటారు. అటువంటి ఐకమత్యము ఒక కుటుంబంలోని నలుగురి అన్నదమ్ములలో ఉంటే, ఆకుటుంబమును శత్రుభయం తక్కువగా ఉంటుంది. ఆ కుటుంబం వృద్దిలోకి వస్తుంది అంటారు. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ లో గ్రామములో సంఘం ఐకమత్యం గురించి తెలిపారు.

అలాంటి ఐకమత్యము ఒక ఊరికి ఉంటే, ఆఊరిలో తప్పులు జరగడం చాలా తక్కువగా ఉంటుందని అంటారు. కలసి ఉన్నప్పుడు తోటివారికి సమాధానం చెప్పాలన్న భావన బలంగా ఉండడం చేత, వ్యక్తి తప్పుదోవ తొక్కడంటారు.

తెలుగు రాష్ట్రములలో ఉండే అనేక గ్రామాలలో ప్రతి గ్రామమునకు ఒక గ్రామదేవత తప్పనిసరిగా ఉంటుంది. గ్రామదేవతకు సంబంధించిన పూజలను నిర్వహించుటకు ప్రత్యేకంగా వ్యక్తులు ఉంటారు. ఇంకా నిర్ణీత కాలంలో జరిపే గ్రామదేవత జాతరలకు ఊరంతా ఏకమై పెద్ద ఉత్సవంలాగా జరుపుకుంటారు.

ఒక గ్రామంలో ఆ గ్రామమునకు చెందని దేవత పండుగ చేసుకుంటూ ఉంటే, ఆ గ్రామనివాసులు ఇతర గ్రామాలలో నివసించే తమ బంధువులను ఆహ్వానించి, వారితో తమ ఆనందం పంచుకుంటారు. ఇలా మన తెలుగురాష్ట్రాలలో ఉండే వివిధ గ్రామములకు వివిధ పేర్లతో గ్రామదేవతలు ఉంటారు. కొన్ని గ్రామాలలో ఊరిజాతర ఒక సంవత్సరమునకు జరిపితే, కొన్ని గ్రామాలలో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరములకు ఒక్కసారి గ్రామదేవతకు జాతర చేస్తూ ఉంటారు.

గ్రామ ప్రజలనందరిని ఏకం చేసే జాతర అంటే, ఆగ్రామ ప్రజలకే కాకుండా, ఆగ్రామం చుట్టుప్రక్కల ఉండే ప్రజలకు ఆనందదాయకముగా ఉంటుంది. గ్రామదేవతలు గురించి తెలియజేసే తెలుగుబుక్ ఒక్కటి ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తుంది. ఈ తెలుగుబుక్ రీడ్ చేయడానికి లేక ఫ్రీగా డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి లేదా ఇవే అక్షరాలను నొక్కండి.

గ్రామదేవతలు తెలుగుబుక్

తెలుగుబుక్ గ్రామదేవతలు అను నామధేయంతో ఉంది. ఈ గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ నందు గ్రామదేవతలు గురించి ఈ విధంగా చెప్పారు. సంఘము అంటే ప్రజలందరిలో ఉండే ఐకమత్యమునకు ప్రతీక. దేవత సంఘమునకు సంబంధించినది అయితే ఆ సంఘమనుందు ఐకమత్యమును సాధించుటకు కనిపించని దేవతను ఆలంబనముగా చేసుకుని తమ జాతి యందు అభివృద్దిని సాధించే మానవ ప్రయత్నములో ఒక భాగమే గ్రామదేవత ఆవిర్భావము అని చెప్పబడింది.

తెలుగు ప్రాంతాలలో గ్రామదేవతలుగా పోలేరమ్మ, పోచమ్మ, పైడమ్మ, అంకాళమ్మ, మరిడమ్మ, వనువులమ్మ, మాచలమ్మ, నూకాలమ్మ, మావుళ్ళమ్మ, సుంకులమ్మ, నేరేళ్ళమ్మ, అంకమ్మ, కోటమ్మ, ఎల్లమ్మ, పల్లాలమ్మ, గజ్జాలమ్మ, కడియాలమ్మ, గంగానమ్మ, మారెమ్మ, తోటలమ్మ, తలుపులమ్మ, ఆటలమ్మ, నోమాలమ్మ, చెరువులమ్మ, కాగితమ్మ, గండాలమ్మ, మైశమ్మ, చింతాలమ్మ, కోర్లమ్మ, పెద్దింట్లమ్మ, బాపనమ్మ, దుర్గమ్మ, గంటెమ్మ తదితర గ్రామదేవతా పేర్లతో ఉంటారు. ఈ పుస్తకంలో వివిధ గ్రామదేవతా పేర్లను తెలుపుతూ గ్రామముల నామాలను కూడా తెలియజేశారు.

ఇంకా గ్రామములందు గ్రామదేవత సంప్రదాయం తదితర విషయాలు తెలియజేశారు. అలాగే పోతురాజు గురించిన కధలను కూడా తెలియజేశారు. గ్రామదేవతలు తెలుగుబుక్ నందు జానపదుల గురించి, జానపదుల సామెతలను తెలియజేశారు.

ఎక్కువగా గ్రామదేవతల పూజలు భయకంపితంగానే ఉంటాయి. ఎందుకంటే గ్రామాలలో జరిగే కొన్ని జాతరలకు విశేషంగా జంతుబలులు ఇవ్వడం సంప్రదాయంగా ఉంటుంది. వీటిలో పూనకాలు రావడం కూడా ఉంటుంది. పూనకం వచ్చిన వ్యక్తి ఊగుతూ గ్రామదేవత తరపున కోరికలు కోరడం కూడా కొన్ని గ్రామాలలో ఉంటుంది. గ్రామ దేవతలు తెలుగు ఫ్రీబుక్ ఫ్రీగురుకుల్ వెబ్ సైటు నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును లేదా బుక్ రీడ్ చేయవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్