ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్?

ఆన్ లైన్లో ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్ ఎంత వరకు మేలు? ఏదో ప్రయోజనం లేకుండా బిజినెస్ ఉండదంటారు. ఇప్పుడు కొన్ని సర్వీసులు కూడా ప్రత్యక్ష ప్రయోజనం కాకపోతే పరోక్షప్రయోజనంతో కూడి ఉంటాయి. అంటే ఫ్రీ వెబ్ సైటు హోస్టింగ్? అది అందించేవారికే ఫస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఉపయోగించేవారి బెనిఫిట్ సెకండరీ కానీ ఫ్రీగా లభిస్తుంది.

ఏదైనా ఫ్రీ అనేది ప్రాధమిక దశలో తెలుసుకోవడం వరకు మేలు అంటారు. ఇక వెబ్ సైటు హోస్టింగ్ విషయానికొస్తే మాత్రం వ్యక్తిగత బ్లాగింగ్ చేసే హాబీ ఉన్నవారికి ఫ్రీబ్లాగింగ్ బాగానే ఉంటుందని అంటారు. కానీ ప్రొఫెషనల్ డిజైనింగ్, బిజినెస్ వ్యవహారంలో మాత్రం ఫ్రీ హోస్టింగ్ కంటే పెయిడ్ హోస్టింగ్ మేలని అంటారు.

ఫ్రీ బ్లాగింగ్ చేయడం వలన లాభాలు ఏమిటి?

 

 • మొదటి ప్రయోజనం ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్ వలన ఒక వెబ్ సైటును ఫ్రీగా ప్రారంభం చేయవచ్చును.
 • మనకు తెలిసిన విషయమును ఫ్రీహోస్టింగ్ సైటు ద్వారా ఖర్చులేకుండా అందరికీ షేర్ చేయవచ్చును. కాలం ఖర్చు, ఇంటర్నెట్ ఖర్చు, కంప్యూటర్ ఖర్చు వంటి సాదారణ ఖర్చులతో వెబ్ సైట్ నిర్వహించవచ్చును.
 • సబ్ డొమైన్ మరియు హోస్టింగ్ స్పేస్ ను ఉపయోగించుకుని, వెబ్ సైటును ప్రారంభించవచ్చును.
 • సెక్యురిటీ విషయంలో ఫ్రీ హోస్టింగ్ ప్రొవైడర్స్ వలన ప్రధాన ప్రయోజనంగా ఉంటుంది.
 • సపోర్టు విషయంలో అనేక వీడియో ట్యూటోరియల్స్ లభిస్తాయి. ఫ్రీ వెబ్ సైటును డిజైన్ చేయడంలోనూ, పోస్టింగ్ చేయడంలో, వెబ్ సైట్ సెట్టింగ్స్ గురించి వివరించే వీడియోలు ఉంటాయి.
 • ప్రధానంగా దీని వలన ఆన్ లైన్ వ్యవహారాలలో ఖర్చులేకుండా ఎక్స్ పీరియన్స్ వస్తుంది.
 • ఒక వేళ వెబ్ సైట పాపులారిటీ పెరిగితే, సబ్ డొమైన్ బదులు మెయిన్ డొమైన్ కు అప్ గ్రేడ్ కావచ్చును.

ఇక ఫ్రీబ్లాగింగ్ నిర్వహణ వలన నష్టాలు ఏమిటి?

 • వ్యక్తిగతం అయినా ప్రొఫెషనల్ అయినా ఓన్ బ్రాండింగ్ ఉండదు. ప్రొవెడర్ డొమైన్ మీ వెబ్ సైట పేరుకు వెనుక తోకలాగా ఉంటుంది. ఉదా: yourdomain.wordpress.com, yourdomain.blogspot.com, yourdomain.wix.com, yourdomain.telugureads.com
 • పరిమితమైన డిస్క్ స్పేస్ ఉంటుంది.
 • వెబ్ సైట్ డిజైనింగ్ ఫీచర్లు పరిమితంగానే ఉంటాయి.
 • యాడ్ మానిటరింగ్ విషయంలో పరిమితులు ఎక్కువగా ఉంటాయి.
 • ఎప్పుడైనా ప్రొవైడర్ నియమ నిబంధనల ప్రకారం హోస్టింగ్ నిలుపుదల అయ్యే అవకాశం ఉంటుంది.

ఉచితంగా వెబ్ సైట్ హోస్టింగ్ మరియు సర్వీసులు అందించే బ్లాగు సర్వీసు ప్రొవైడర్స్

ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్?

గూగుల్ బ్లాగ్ స్పాట్ ప్రసిద్ది చెందిన ఫ్రీ బ్లాగింగ్ ప్రొవైడర్… అంతగా టెక్నికల్ నాలెడ్జ్ అంటే వెబ్ సైటు డిజైనింగ్ లో కోడ్ నాలెడ్జ్ ఏమి తెలియనివారికి మేలైన ప్రీ వెబ్ సైట్ ప్రొవైడర్ గా చెబుతారు. దీనిద్వారా బ్లాగింగ్ లుక్ మాత్రమే ఉన్నా చాలా పవర్ పుల్. హోస్టింగ్ స్పేస్, సెక్యురిటీ, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వంటి విషయంలో గూగుల్ బ్లాగ్ స్పాట్ మేలంటారు.

ఇది ఎక్కువగా కేవలం కంటెంటును ప్రజెంట్ చేయడానికి, బ్లాగు మాదిరిగా ఉపయోగించుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎంపిక చేసుకున్న వెబ్ సైటు పేరుకు తోడుగా బ్లాగ్ స్పాట్ కూడా జతచేయబడుతుంది.

ఒక వేళ మీరు డొమైన్ కొనుగోలు చేస్తే, ఆడొమైన్ సెట్టింగ్స్ చేసుకోవాలి. దీనికి కొంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ విధానం తెలుసుకోవచ్చును.

ఉచితంగా తెలుగులో బ్లాగును ఎలా క్రియేట్ చేయాలి? వీడియో వాచ్ చేయండి.

ఫ్రీ వెబ్ సైట్ హోస్టింగ్?

ఇది మరొక బెస్ట్ ఫ్రీ వెబ్ సైట్ సర్వీస్ ప్రొవైడర్… వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ లేదా ప్రొఫెషనల్ వెబ్ సైటు డిజైనింగులో ప్రసిద్దిగాంచిన బ్లాగ్ సర్వీస్ ప్రొవైడర్… వర్డ్ ప్రెస్.కామ్(wordpress.com) ద్వారా ఉచితంగానూ వెబ్ సైట్ క్రియేట్ చేయవచ్చును. ఆపై ప్రీమియంకు అప్ గ్రేడ్ కావచ్చును. కానీ పరిమితమైన ఫీచర్లు ఉంటాయి.

దీనిలోనే వర్డ్ ప్రెస్.ఆర్గ్(wordpress.org) అని మరొక సైటు ఉంది. దీని నుండి మీరు మీ బ్రాండ్ కు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చును. ఇతరుల చేత చేయించవచ్చును. ఒక్కసారి డిజైన్ చేశాక మీరు పోస్టింగ్ చేసుకోవచ్చును. ప్రధానంగా హోస్టింగ్ మరియు డొమైన్ కొనుగోలు చేసి, వర్డ్ ప్రెస్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా సర్వరులో ఇన్ స్టాల్ చేయాలి. ఈవిధానం గురించి కూడా వీడియోలు ఉచితంగానే ఆన్ లైన్లో లభిస్తాయి. చాలామంది బ్లాగర్లు, చిన్న వ్యాపారులు ఈ విధానమునే ఫాలో అవుతారు.

ఈజి అండ్ ప్రొఫెషనల్ లుక్ అంటే వర్డ్ ప్రెస్ అని అంటారు. ఉచితంగా వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ క్రియేట్ వీడియో వాచ్ చేయండి.

పైన చెప్పబడినవి రెండూ ఎక్కుమంది బ్లాగర్స్ వాడుతారు. ఇంకా ఎక్కువమంది రిఫర్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా… ఇంకా మరికొన్ని ప్రొవైడర్స్ నుండి ఉచితంగా ఒక వెబ్ సైట్ తేలికగా సృష్టించవచ్చునో ఆ వీడియోలు క్రిందగా జతచేయడం జరిగింది గమనించండి.

https://www.youtube.com/watch?v=YQ3aYQ0ZuHA
https://www.youtube.com/watch?v=QPc4IvUlY6U
https://www.youtube.com/watch?v=f8Jgp45wu2s
https://www.youtube.com/watch?v=haDEcslcZRQ
https://www.youtube.com/watch?v=hrErq63AmoE