తెలుగు జాతకమును అందించే వెబ్సైటు

పుట్టిన సమయం, తేదిని అనుసరించి తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ఆన్ లైన్లో ఉచితంగా ఉంది. ఈ వైబ్ సైటు వివరములను ఇంకా చదవండి….

పుట్టిన ప్రతి ఒక్కరి జీవితో నవగ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అంటారు. అలాగే ఏ వ్యక్తి అయినా 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక పాదం క్రిందకు వస్తారని అంటారు. పుట్టిన నక్షత్ర పాదం, ఆ నక్షత్ర పాదం గుణగణాలు, పుట్టిన సమయంలో ఉన్న లగ్న ప్రభావం, నవగ్రహాల దృష్టి ప్రభావం లెక్కలు కట్టి ఇంకా పుట్టిన స్థలం ఇతరత్రా అంశాలు పరిశీలన చేసి, ఆ వ్యక్తి యొక్క జాతకం చెబుతూ ఉంటారు.

జాతకం చెప్పినప్పుడే కొన్ని ముఖ్యమైన పనులలో ప్రారంభించటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలను కూడా ఆ పిల్లవాని పెద్దలకు పండితులు తెలియజేసి ఉంటారు. గ్రహశాంతులు ఉంటే ఎప్పుడు చేపించుకోవాలి, ఎప్పుడు ఏ గ్రహ ప్రభావం చేత, ఆ పిల్లవాని భవిష్యత్తు ప్రభావితం అయ్యేది కూడా అంచనా వేసి చెబుతారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? స్వగృహం యోగం లాంటివి పరిశీలన చేసి, ఆ పిల్లల పెద్దలకు చెబుతారు.

ఇప్పుడు అలా పేరు, పుట్టిన తేది, సమయం, ప్రాంతము, టైం జోన్ వెబ్ సైటులో ఎంటర్ చేస్తే, ఆ వెబ్ సైటు మీ జాతకం ఆన్ లైన్లో ప్రాధమికంగా చూపుతుంది. అందులో పుట్టిన సమయం యొక్క పంచాంగ వివరాలు చూపుతుంది. ఇందులో పుట్టిన సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, తిది, వారం, నక్షత్ర పాదం, రాశి, యోగం, కరణం, జన్మనామం, దశలను చూపుతుంది. తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ..

ఇంకా వివాహ విషయంలో ఉపయోగపడే అవకహడ చక్రమును చూపుతుంది. మంచి చెడుల విషయంలో ఘాత చక్రమును చూపుతుంది. అలాగే అదృష్ట విషయములలో అనుకూల రోజు, తిది, గ్రహములు, రాశులు, లగ్నములు, రత్నం, దైవం, లోహం, వర్ణం, దిశ, సమయం, సంఖ్యలను చూపుతుంది.

గ్రహస్థితి పట్టికలను చూపుతుంది. ఇంకా గ్రహ వీక్షణలు, మైత్రి చక్రము కుండలిలు, షోడష వర్గ పట్టిక, గ్రహ భావములు తదితర విషయములతో బాటు జాతక దోశములు, పరిహారాలు, దశాంతర్దశా ఫలితములు, జాతక ఫలితాలను ప్రాదమికంగా మీకు ఈ వెబ్ సైటు చూపుతుంది. మీరు మీ ఫలితములను పి.డి.ఎఫ్ ఫార్మట్లో సేవ్ చేసుకోవచ్చును.

పూర్తి జాతకమును పొందాలంటే పెయిడ్ ఆష్ట్రాలజీలోకి వెళ్లి చూడవలసి ఉంటుంది. ఈ వెబ్ సైటులో మీరు ఎంటర్ చేయవలసిన డేటా పేజి ఈ క్రింది విధంగా ఉంటుంది.

తెలుగు జాతకమును అందించే వెబ్సైటు
తెలుగు జాతకమును అందించే వెబ్సైటు

మీరు పై చిత్రంపై టచ్ లేక క్లిక్ చేసి ఆ వెబ్ సైటు సందర్శించవచ్చును. లేక ఇక్కడ ఇవే అక్షరాలను తాకి మీరు ఆ వెబ్ సైటును సందర్శించవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్