ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్ తెలుగులో ఉచితంగా లభిస్తుంది. ఈ బుక్ గురించి తెలుసుకోవడానికి చదవండి….

ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్
ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదీ అందరికి తెలుసు, తెలిసిన దానిపై అంతగా ఆసక్తి ఉండదు. అదే పుట్టగానే పరిమళించని పువ్వు, కొన్నాళ్లకు పరిమళిస్తే ఆపువ్వుపై ఆసక్తి పెరుగుతుంది.

అలాగే ఎప్పుడూ చదివేవారు పాసవ్వడం కన్నా ఎప్పుడూ ఫెయిల్ అయ్యే విద్యార్ధి, కష్టపడి చదివి పాసయితే, ఆవిద్యార్ధిపై అందరి దృష్టిపడుతుంది.

పబ్లిక్ పరీక్షలు అంటే భయంతో విద్యార్ధులు సిద్దం అవుతూ ఉంటారు. ఆ భయమే వారి కొంపముంచుతుందని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. ఏదైనా పబ్లిక్ పరీక్షలకు సిద్దపడే విద్యార్ధులు తమను తామే సిద్దం చేసుకోవాలి.

తమకు తామే మనసులో స్థిర నిశ్చయం ఏర్పరచుకుంటే, ఆ నిశ్చయ బుద్ది అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తుందంటారు. ఏమీ రాదనే ముద్ర పడితే, తోటివారితో పోటీ పడలేక చదువుపై అశ్రద్ద చూపేవారు కూడా ఉండవచ్చు.

ఒకవేళ అటువంటివారు ఉంటే మాత్రం, వారు పట్టుదలతో చదివి పాస్ అయితే, వారిని హేళన చేసినవారే శభాష్ అంటారు. ఇలాంటి పట్టుదలే విద్యార్ధులకు కావాలంటారు. నేర్చుకునే వయస్సులోనే ఇంకా ఉత్తమమైన ఫలితాలకోసం కృషి చేయాలి.

ఎక్కువమార్లు ఫెయిల్ అయిన విద్యార్ధి, కష్టపడి తనకు చేతకాని పనిని సాధిస్తే, తమపై తమకు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కష్టం విలువ చదువుకునే సమయంలోనే తెలిసి వస్తుంది.

సామాన్యంగా చదివేవారికి, తమ తోటివారికన్నా మెరుగైన ఫలితాలు సాధించాలంటే, తాము చదువులో చేస్తున్న పొరపాట్లను గురించాలి. పరీక్షలు వ్రాయడంలో చేస్తున్న పొరపాట్లను గురించి, వాటిని సరిదిద్దుకోవాలి.

ఎక్కువగా పరీక్షలు ఫెయిల్ అవుతూ ఉండేవారు, తాము ఎందుకు ఫెయిల్ అవుతున్నామో? అని ప్రశ్నించుకోవాలి. పాస్ కావాలనే కోరిక బలంగా ఉండాలి.

తాము చదువుతున్న తీరును పరిశీలించుకోవడానికి, పరీక్షలలో తప్పులు ఎలా జరిగే అవకాశం ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలకు వివరణలతో కూడిన తెలుగు బుక్ ఫ్రీగా పిడిఎఫ్ బుక్ రూపంలో లభిస్తుంది.

ఈ తెలుగుబుక్ లో పిల్లలు పరీక్షలు తప్పడానికి కారణాలు ముందుగా వివరించారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పబ్లిక్ పరీక్షలు తప్పడానికి కారణాలు

  • కొందరు ఒక తరగతి నుండి మరొక తరగతికి జంపింగ్ చేస్తూ ఉంటారు. అంటే కేవలం అటెండన్స్ ఆధారంగా కొన్ని తరగతులు పాసయ్యే అవకాశం ఉండడం చేత, ఒక తరగతి నుండి మరొక తరగతికి మద్యతరగతిని వదిలేస్తారు. ఉదా: 8వ తరగతి నుండి డైరెక్టుగా 10వ తరగతిలోకి వెళ్ళడం.
  • సరైన లక్ష్యం నిర్ధేశించుకోక పోవడం
  • కొన్ని సబ్జెక్టులపై ఇష్టం, కొన్ని సబ్జెక్టులపై అయిష్టం ఉండడం.
  • నిర్లక్ష్యంగా ఉండడం
  • విజయకాంక్ష లేకపోవడం

ఇంకా విద్యార్ధికి ఎదురయ్యే ఇబ్బందుల గురించి చెబుతూ ఈ తెలుగుబుక్ లో హెడ్డింగ్స్ ఈ విధంగా ఉంటాయి.

  • చదివేటప్పుడు నిద్ర వచ్చుట
  • చదివినది గుర్తు ఉండకపోవడం
  • పరీక్షల హాలులో కంగారు పడడం

పై కారణాలను సమస్యలను వివరిస్తూ, వాటికి కారకాలు, పరిష్కారాలు సూచిస్తూ ఈ తెలుగు బుక్ ఉంటుంది. ఇంకా విద్యార్ధులు చదివినది గుర్తు ఉంచుకోవడానికి ఏంచేయాలి. విద్యార్ధులు పరీక్షల సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలు. తదితర విషయాలను ఈ తెలుగు బుక్ లో వివరించబడి ఉంది.

‘ఎలా చదవాలి’ అనే శీర్షికతో ఫ్రీగా పిడిఎఫ్ ఫార్మట్లో లభిస్తున్న తెలుగుబుక్ ఉచితంగా చదవడానికి ఈ క్రింది బటన్ పై టచ్ లేక క్లిక్ చేయండి. ఇంకా జ్ఙాపక శక్తికి సంబంధించిన మరికొన్ని బుక్ లింకులు ఈ క్రింది బటన్లకు లింకు చేయబడ్డాయి.

మరిన్ని తెలుగురీడ్స్.కామ్ పోస్టుల లింకులు ఈ క్రింది బటన్లతో…