సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ! ఈ శీర్షికతో ప్రపంచంపై సినిమాల ప్రభావం ఒక అవగాహన ప్రయత్నం చేస్తే….

ఈ ప్రపంచంలో ప్రతివారు ఏదో ఒక చోట ఉండడం సాదారణం. అలాగే సాదారణ వ్యక్తి చుట్టూ ఏర్పడి ఉన్న లోకం.. ఆ లోకమే అతని ప్రపంచం. ఆ ప్రపంచంలో అతని చుట్టూ ఉండే జనులు, ఆ జనులు తెలుసుకునే విషయాలు, ఆ జనుల ద్వారా అతను పొందుతున్న ప్రేరణ… సినిమాలు లోకంపై ప్రభావం చూపుటూ ఉంటాయి. అది ఎలా?

ఒక వ్యక్తికి ఒక కుటుంబంతో బాటు అతని సహచరులు, స్నేహితులు, బంధుగణం… ఇలా ఒక ప్రపంచం ఒక వ్యక్తి చుట్టూ ఉంటుంది. అదే అతని లోకం. అతను సాధించిన ఘనత, తన లోకంలో ఉన్నవారితో పంచుకుంటూ ఉంటాడు. బాధ పొందితే, ఉపశమనం కోసం అదే లోకం ఉన్నవారితో బాధను పంచుకుంటాడు. అలా ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉండేవారితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాడు. తాను చూసిన సినిమా గురించి చర్చించుకోవడం, తద్వారా తన చుట్టూ ఉన్నవారిని ఆ సినిమా చూసేవిధంగా ప్రేరేపించడం… లేదా తన స్నేహితుల చర్చ ద్వారా తాను సినిమా చూడాలన్న ఆసక్తిని పెంచుకోవడం…. చూసిన సినిమాలో ట్రెండును అనుసరించడం లేదా సినిమాలో నచ్చిన సన్నివేశంతో మమేకం కావడం. ఇలా సినిమా ద్వారా వినోదంతో బాటు ప్రవర్తనలో మార్పుకు కూడా నాంది కాగలదు.

భారతీయుడు సినిమా చూసిన ప్రతివారు కూడా దేశంలో అవినీతి నశించిపోవాలనే తలంపు తలుస్తాడు.

అపరిచితుడు, ఠాగూర్ సినిమాలు చూసినవారు కూడా అవినీతి, లంచగొండితనంపై ఆలోచన చేస్తారు. అంటే జెంటిల్మెన్, భారతీయుడు, ఠాగుర్, అపరిచితుడు, శివాజీ సినిమాలు వలన అవినీతిపరుల వలన దేశం అభివృద్దికి ఆటంకం అనే సందేశం తెలియబడుతుంది. అలా సమాజం మంచి నాయకత్వానికి పట్టం కట్టాలనే తలంపులను కలిగి ఉంటుంది.

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం

అలాంటి సినిమా లోకం పై పడుతున్న ప్రభావం ఆర్ధిక అంశాలతో ముడిపడి ఉంటుంది. రాజకీయ ఒత్తిడి కూడా ప్రభావం చూపవచ్చును. ఏదైనా కానీ సినిమాలు సమాజంపై మంచి చెడుల విషయంలో దీర్ఘకాలిక ప్రభావం చూపగలవని అంటారు. అటువంటి సినిమాల ద్వారా మంచి సందేశం సమాజం అంతటా పాకితే, ఆ సందేశం అనుసరించే జనులు తరువాతి నాయకత్వమును ఎంచుకుంటారు. కాబట్టి సినిమాలు సమాజంపై దీర్ఘకాలిక ప్రభావం చూపగలవు.

సన్నివేశాల ద్వారా మనిషి విజ్ఙానం పొందగలడు. అటువంటి సన్నివేశాలు సినిమాలలో అనేకంగా ఉంటాయి. అలాంటి సినిమాల ద్వారా ప్రేరణ పొందినవారు షార్ట్ వీడియోలలో కూడా అటువంటి దృశ్యాత్మక విజ్ఙానం అందిస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో విజ్ఙానం సమాజంలో లభిస్తుంది. మంచి విషయాలను తెలుసుకోవచ్చును. చెడు విషయాల వలన నష్టాలను తెలుసుకోవచ్చును.

ఆ విధంగా సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం ఎక్కువగానే ఉంటుంది…. అది దీర్ఘకాలంలో ప్రస్ఫుటం అవుతుందని అంటారు.

సినిమాలతో లోకంపై పడుతున్న ప్రభావం సినిమా లోకం పై పడుతున్న ప్రభావం సినిమాలు – సమాజం అవినాభావ సంబంధ మాదిరిగా ప్రభావితం అవుతూ చేస్తూ ఉంటాయి.

Puttina Roju Subhakankhalu Quotes Telugu

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు

పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుగు

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

తెలుగు ఓల్డ్ హిట్ పుల్ మూవీస్ లిస్ట్అండ్ వీడియో లింక్స్

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

పవన్ కళ్యాణ్ మూవీస్

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

అచ్చ తెలుగు పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ తెలుగులో

అచ్చ తెలుగులో గర్ల్ నేమ్స్