చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే

చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే

చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, శాస్త్ర ప్రకారం పెట్టుకున్న పేరు ప్రభావం ?
పిల్లలకు పేరు పెట్టేటప్పుడు పంతులుగారికి పుట్టుక సమయం, తేదీ అందించి, వివరాలు అడిగి పేరు ఎంపిక చేస్తాం.
కానీ పిల్లలకు మాత్రం చిట్టి చిట్టి పేర్లకు పలికే విధంగా అలవాటు చేయడం జరుగుతూ ఉంటుంది.
అలా చిట్టి పొట్టి పేర్లతో పిల్లలను పిలుచుకునేటప్పుడు శాస్త్రప్రకారం నామకరణం చేయడం ఎందుకు అనే ప్రశ్న ఉదయించకమానదు.
బాబుకు కానీ పాపకు కానీ పేరు పెట్టే సమయంలో మంచి చెడు ఆలోచించి పేరు పెట్టేవారు… వారిని పిలవడంలో మాత్రం ముద్దుపేరు అంటూ మరొక పేరుతో పిలవడం కొందరు చేస్తూ ఉంటారు.
చింటూ…, బంటూ… కిట్టు… అంటూ చిట్టి పొట్టి పేర్లకు చిన్నారి పలకడం అలవాటు అయితే, వారు ఆపేరుకే పలకడం అలవాటుపడతారు. ఇక ఎప్పటికీ ఆపేరుకే పలుకుతూ ఉంటారు.
అసలు పేరు ఎందుకు పెడతారు అంటే, చిన్నారికి ఒక గుర్తింపు అలవాటు చేయడంతో బాటు… చిన్నారి కర్మ ప్రభావం బట్టి ఏ దైవ నామంతో పిలిస్తే, చిన్నారి కర్మప్రభావం బాగుంటుందని పండితులు సూచిస్తారో అటువంటి దైవనామం పేరు ప్రారంభంలో ఉండేలాగా పేరు పెడతారు.
ఎక్కువగా నక్షత్ర పాదం బట్టి మొదటి అక్షరం ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ నక్షత్రం లేక ఆ నక్షత్ర అధిదేవత లేక ఆ రాశి అధిదేవతకు ప్రీతికరమైన అక్షరశబ్ధం ఉండవచ్చు.

పెద్దలు ఎప్పుడు పిల్లల శ్రేయస్సు కోరి పిల్లల యోగక్షేమాలు చూస్తూ ఉంటారు.
కాబట్టి చిట్టి పొట్టి పేర్లకు చిన్నారులను పలికే విధంగా కాకుండా వారి నక్షత్ర లేక గ్రహబలం బట్టి పెట్టే పేరుకు వారిని పలకడం అలవాటు చేయాలని అంటారు.

పిల్లల పేర్లు పెట్టేది వారి శ్రేయస్సు కొరకు అయినప్పుడు, వారి శ్రేయస్సు కోసం వారి నక్షత్ర బలం పెరిగే విధంగా పెద్దలు పెట్టిన పేరుతో పిలవడం శ్రేయస్కరం అంటారు.

ముద్దు పేరుతో పిలిచినా, అసలు పేరుకే పలకడం పిల్లలకు అలవాటు చేయాలి… కానీ ముద్దు పేరు అసలు పేరును మరిపించేలా ముద్దు పేరుతో పిలవడం వలన నామకరణ ప్రక్రియ అనవసరం అని అంటారు.

చిట్టి పొట్టి పేర్లతో పిలవకుండా సార్ధక నామముతో పిల్లలను పిలవడం మొదలు పెడితే, వారు ఆ పేరుకే పలకడం అలవాటుగా మారుతుంది.

భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ

పి‌వి నరసింహరావుగారి గురించి పత్రిక వ్యాసం రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

యోగ సాధన తెలుగు బుక్స్

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం