భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ

భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ అంటే తెలుగు వారందరికి గర్వ కారణమే. కరిగిపోతు కొవ్వొత్తి వెలుగు ఇస్తుంది…

అలా ఒక తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ దార్శనికత నేటి మన భారత ఆర్ధిక పురోగతి అని పెద్దలు ప్రశంసిస్తూ ఉంటారు.

ఇప్పుడు ప్రశంశలు అందుకుంటున్న అలనాటి తెలుగు బిడ్డ అప్పటి భారతదేశ ప్రధానమంత్రి.

ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన పాలనలో దేశం పురోగతికి పురుడు పోసుకుంటూ ఉంటే, ఆయన తెలివికి నిశ్చేష్టతో చరిత్ర తన పని మరిచి పోయి ఉండవచ్చు.

ఇప్పటికే ఆ మహానుభావుడు ఎవరో తెలుగువారికి అర్ధం అయ్యి ఉంటుంది…. ఆయనే పాములపర్తి వెంకట నరసింహరావు

ఆర్ధికంగా అప్పులపాలు అయ్యి, ప్రపంచంలో అధిక అప్పులు ఉన్న దేశాలలో మూడవ స్థానంలో ఉన్న భారత దేశానికి ప్రధానిగా బాద్యతలు స్వీకరించిన తెలుగుబిడ్డ.

సాధారణంగా ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే, మునుపటి పార్టీ అనుసరించిన విధానాలను మార్చివేయడం పరిపాటి… కానీ మన తెలుగుబిడ్డ పి‌వి నరసింహరావుగారి విధానాలను కొనసాగించడమే కాకుండా… ఆయనను అప్పటి ప్రతిపక్ష పార్టీ తరపు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రశంసించడం అంటే… పి‌వి ఘనత ఏమిటో తెలియబడుతుంది.

లోకం వినేవారికి వినిపిస్తూనే ఉంటుంది. విననివారిని విడుస్తూనే ఉంటుంది. చేసేవారితో చేయించుకుంటూనే ఉంటుంది…. అలా పి‌వి నరసింహరావుగారితో దేశం రక్షింపబడింది. అయితే ఆయనకు గుర్తింపు ఇవ్వడంలో వెనకబడింది అని వాపోయినవారు ఉంటారు.

ఘనుడు ఘనత కోసం ప్రాకులాడడు. తన కర్తవ్యం తాను చేసుకుపోతాడు… అలా ఆయన కర్తవ్యం నేటి దేశ వర్తమానంగా చెబుతారు.

వర్తమానంలో మంచిని అడ్డుకునేవారు చరిత్రను శాసించగలిగితే, మంచి చేసేవారికి గుర్తింపు ఆలస్యం అవుతుంది. అయితే ఆలస్యంగా వచ్చే గుర్తింపు చిరకాలం కొనసాగుతుంది…

అప్పుడు పాలించిన పి‌వి నరసింహరావుగారు, ఇప్పటికే వెలుగు విరజిమ్ముతున్నారు…

అందుకే ఇప్పుడు ఆయన గురించి మరింత మందికి ఓ మహానుభావుడుగా తెలియజేద్దాం… మన భవిష్యత్తు తరానికి ఓ గొప్ప వ్యక్తి గురించి తెలుపుతూ ఉందాం…

అప్పుడు తాను దర్శించిన భారతం కోసం, ఎంతో కృషి చేసిన ఆ తెలుగుబిడ్డ గురించి తెలుగుతరం అంతటా తెలిసేలా తెలియజేద్దాం. ముందుగా మనం గుర్తుకు తెచ్చుకుందాం… గుర్తుపెట్టుకుందాం… పిల్లలకు తెలియజేద్దాం!

భావి భారత దార్శనికుడు ఓ తెలుగు బిడ్డ, మన తెలుగు గడ్డలో పుట్టిన తెలుగుజాతి ముద్దు బిడ్డ పి‌వి నరసింహరావు గారు.

పి‌వి నరసింహరావుగారి గురించి పత్రిక వ్యాసం రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?

నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

లిబ్రెఆఫీసు రైటర్ ఫైల్ మెను

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

యోగ సాధన తెలుగు బుక్స్

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

వ్యాధులు భయాలు మనసుపై ప్రభావం