2020 అంతా స్టాప్ దేర్ 2021?

2020 అంతా స్టాప్ దేర్ 2021? గత ఏడాది పురుడు పోసుకున్న కరోనా ఈ ఏడాది రూపాంతరం చెందుతుంది… కొత్త ఏడాదిలోకి జర జాగ్రత్తతో అడుగు పెట్టడంతో బాటు జర జాగ్రత్త అవసరం.

గతేడాదిలోకి కరోనా జాగ్రత్తలతో ఆరంభం చేయడం జరిగింది. సంవత్సరమంతా జాగ్రత్తగా ఉన్నవారు కరోనా బారిన పడలేదు. జాగ్రత్తలేనివారికి వైరస్ సోకింది.

అందరికీ 2020సంవత్సరం ఇంత తొందరగా గడిచిందా? అనే ఆశ్చర్యంగానే 2020 ముగుస్తుంది. 2019 ఎండింగులో కరోనా వస్తుందేమో ఆలోచన…

2020అంతా కరోనా జాగ్రత్తలతో సాగింది. అయితే 2020ఎండింగ్ కూడా పాత కరోనా తగ్గుముఖం పట్టడంతో బాటు, టీకా అందుబాటులోకి రానుంది.

అంతలోనే కరోనా మరొక రూపం దాల్చింది… ఇక 2021 కూడా కరోనా నివారణ జాగ్రత్తలతోనే మెసులుకోవాలి.

ఆ ఆలోచనలే నిజమయ్యాయి… 2020లో కరోనా వైరస్ కోవిడ్-19 అను పేరు పొంది, ప్రపంచంపై పడింది.

కోవిడ్-19 విజృంభణ చాలామందిని బలిగొంది… చాలామందిని ఆసుపత్రిపాలు చేసింది… అనడం కన్నా చాలా దేశాలను ప్రభావితం చేసిందని అంటారు.

మనకు మార్చిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలియగానే, అందరం జనతా కర్ఫ్యూలోకి వెళ్లాం… ప్రధాని పిలుపు మేరకు.

నరేంద్రమోదిగారి పిలుపుకు దేశం మొత్తం స్వాగతించి, అంతా ఇంటికే పరిమితం అయ్యాం. ఆ విధంగా 2019లో పుట్టిన కరోనా వైరస్ అదే కోవిడ్-19 ఒక్కరోజు అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది.

అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుండడంతో లాక్ డౌన్ కేంద్రం విధించింది. లాక్ డౌన్ కాలంలో కొందరు అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు కష్టాలు అధికంగా అనుభవించారు.

కొందరు ఇంటికి తిరుగు ముఖ పట్టారు. అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఎక్కడివారు అక్కడే అంటూ 2020 స్టాప్ దేర్…

అందరినీ కదలకుండా కొన్నిరోజులపాటు ఒకే చోట కట్టిపడేసింది.

2020 అంతా స్టాప్ దేర్ 2021 లో కూడా స్టాప్…

2019 లో చైనాలో పురుడు పోసుకున్న కోవిడ్-19 కోరలు ప్రపంచమంతా పాకాయి. స్టాప్ దేర్.. స్టాప్ వర్క్, స్టాప్ ట్రావెల్, స్టాప్ స్టడీ ఇలా అన్నింటిలోనూ, అందరిని స్టాప్ చేసేసిందీ2020.

అనుమానం పెనుభూతం అన్నారు. అలా అనుమానం పొంది ఆందోళన చెందకుండా ఉండేందుకు… దేశవ్యాప్తంగా కరోనా గురించిన ప్రచారమే జరిగింది.

కరోనా గురించినా జాగ్రత్తలే ప్రచారం జరిగింది. అన్నింటిని ఆపింది… అంతటా పుల్ స్టాప్ పెట్టింది.

మీడియా, అత్యవసరాలు తప్పించి కొన్నిరోజులపాటు చాలా చోట్ల స్టాప్ వర్క్ నడిచింది… అలా అందరికీ ఆర్ధిక నష్టాన్ని తీసుకువచ్చింది.

స్టాప్ స్టడీ చాలాకాలం నడిచింది… కేవలం ఆన్ లైన్ క్లాసెస్ మాత్రమే నడుస్తున్నాయి… ఇప్పుడిప్పుడే కొన్ని విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి…

సినిమా ధియేటర్లలో స్టాప్ షో… షోలు లేవు.. ధియేటర్లు ఓపెన్ కాలేదు..

2019సంవత్సరంలోని కోవిడ్ సంవత్సరమంతా అందరిపై ప్రభావం ఏదోవిధంగా చూపింది. మరి 2020 ముగింపుకు వచ్చింది…

ఇప్పుడు 2020 చివరి రోజులలో కొత్త వైరస్ గా మారిన కరోనా వైరస్ వార్తలు వచ్చాయి. ఏడాది క్రిందట వచ్చిన కోవిడ్-19 వైరస్ 2020ని ఒక ఊపు ఊపింది… స్టాప్ వర్క్ చెప్పింది.

మరి ఇప్పుడు 2020లో కొత్తగా వస్తున్న వైరస్ బ్రిటన్ లో వ్యాప్తి చెందిందంటున్నారు.. ఇప్పుడు ఇది కోవిడ్-2020 గా రూపాంతరం చెందినట్టయితే, అది వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలే ముక్యం.

ఇది ప్రపంచవ్యాప్తంగా వృద్ది చెందకుండా ఉండాలంటే సోషల్ డిస్టేన్స్, సానిటైజేషన్, మాస్క్ వంటి జాగ్రత్తలే ప్రధానమని అంటున్నారు.

https://www.youtube.com/watch?v=KJri61TS5oQ
2020 స్టాప్ దేర్ 2021?

తగు జాగ్రత్తలు ఉంటే 2021 సజావుగా సాగుతుంది. లేకపోతే 2021 కూడా స్టాప్ వర్క్ అయితే….?

ఇప్పటికే మన దేశ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే యుకె నుండి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేశారు.

వైరస్ కంటికి కనబడదు… ఏవిధంగా వస్తుందో తెలియదు… కనుక జాగ్రత్త… అనేది మనకు ముఖ్యం… ఆందోళన చెందకుండా ఉండడం ఎంత ముఖ్యమో… జాగ్రత్త చాలా ముఖ్యం.

కోవిడ్-19 వలన ఏర్పడిన అనుభవం, కోవిడ్-20 ను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చును. అందుకు ముఖ్యమైన పని తగు జాగ్రత్తలు పాటించడమే…

మనకు ఇప్పటికే వ్యాక్సిన్ రాబోతుంది… కాబట్టి అంతగా ఆందోళన ఉండదు… కానీ జాగ్రత్త మాత్రం చాలా ముఖ్యం…

ఈసంవత్సరం 2020 స్టాప్ దేర్ 2021 సంవత్సరం కూడా స్టాప్ వర్క్ కాకుడదంటే, మన జాగ్రత్తలే మనకు రక్ష…

తెలుగురీడ్స్ బ్లాగ్

తెలుగురీడ్స్ హోమ్

చిన్నపిల్లల తెలుగు పేర్లతో కూడిన తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి…

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్