సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఫోను స్మార్ట్ ఫోన్ రిసెట్ చేయాల్సిందేనని అంటారు. సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి సర్వీసు సెంటరుకు వెళ్లనవసరం లేదు. మీ ఫోన్లో డేటా పోయినా ఫరవాలేదు. ఫోను అన్ లాక్ చేయాలి. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోనును బట్టి మీ ఫోనుని మీరే రిసెట్ చేసుకోవచ్చును.

గమనిక: ఏఫోను అయినా ఫ్యాక్టరీ రిసెట్ చేయడమంటే, ఫోనులో స్టోర్ అయిన డేటా డిలిట్ అయిపోతుంది. కొత్తగా ఫోను రిసెట్ కాబడుతుంది.

మీరు సామ్సంగ్ గాలాక్షీ స్మార్ట్ ఫోను అయితే, దానిని ఎలా రిసెట్ చేయాలి. పాస్ వర్డ్ మరిచిపోయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవచ్చును. కాబట్టి మీ సామ్సంగ్ గాలక్షీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి.

ఈ ఎడమ ప్రక్కగా గల చిత్రంలో మార్క్ చేసిన విధంగా పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక… గాలక్షీ ఫోను యొక్క పవర్ బటన్ మరియు వాల్యూమ్ డౌన్ బటన్ మరియు హోమ్ బటన్ మూడు ఒకేసారి పట్టుకుని ఉండండి. కొన్ని సెకన్లకు మీకు బ్లాంకు స్క్రీనులో టెక్స్ట్ లిస్టు వస్తుంది.

పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక… గాలక్షీ ఫోను యొక్క పవర్ బటన్ మరియు వాల్యూమ్ డౌన్ బటన్ మరియు హోమ్ బటన్ మూడు ఒకేసారి పట్టుకుని ఉండండి. కొన్ని సెకన్లకు మీకు బ్లాంకు స్క్రీనులో టెక్స్ట్ లిస్టు వస్తుంది. ఈ క్రింది చిత్రంలో గమనించండి.

సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

పై చిత్రంలో లిస్టులో wipe data / factory reset అనే ఆంగ్ల అక్షరములు గల లైను పైకి సెలక్షన్ కలర్ వాల్యూమ్ బటన్ ద్వారా వచ్చేలాగా చేసి, పవర్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మరొక స్క్రీనులో మరొక టెక్ట్సు లిస్టు వస్తుంది. అందులో yes… delete all user data ఆంగ్ల అక్షరములు గల లైనుపైకి మరలా వాల్యూమ్ బటన్ ద్వారా సెలక్షన్ కలరుని తీసుకువచ్చి, పవర్ బటన్ ప్రెస్ చేయండి.

ఆ పై మీ ఫోన్ రిసెట్ కావడం ప్రారంభిస్తుంది. మీ ఫోనులో ఆండ్రాయిడ్ లోగో వచ్చి, డేటా రిసెట్ కాబడుతుంది. ఫోన్ రిస్టార్ అయ్యాక, మరలా మీరు కొత్తగా మెయిల్ ఐడి, పాస్ వర్డ్ ఎంటర్ చేసి, ఫోనును వాడుకోవాలి.

మీ ఫోనులో ఉండే డేటా మొత్తం డిలిట్ అవుతుంది.

ధన్యవాదాలు.

తెలుగురీడ్స్