విషయములు ఆలోచన పుస్తకం

విషయములు ఆలోచన పుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి.

లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి?

విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి.

తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు. ఒకప్పుడు కష్టంలో తననితాను చూసుకుంటుంది. స్థితిని చూసుకుంటుంది. ఆలోచనలో పడుతుంది.

కష్టంలో ఓదార్పు అందుకునే మనసుకు మిత్రులు, బంధువులు, ఆత్మీయులు ఉంటారు. పుస్తకం పఠనం అలవాటు ఉన్నవారికైతే, పుస్తకం కూడా ఒక మిత్రుడు వంటివాడు.

పరిశోధనాత్మకమైన పుస్తకాలు చదివే అలవాటు అయితే, ఒక పరిశోదకుడు మనసుకు మిత్రుడుగా ఉంటాడు. భక్తిపరమైన బుక్స్ చదివే అలవాటు ఉంటే, ఓ భక్తపరాయణుడు మిత్రుడుగా మనసు లభిస్తాడు.

తాత్విక చింతనను ప్రబోదించే బుక్స్ అయితే ఓ తత్వవేత్త మనసుకు మిత్రుడుగా లభిస్తాడు. ఎటువంటి పుస్తకాలు చదువుతుంటే, అటువంటి మిత్రత్వం పుస్తకాల ద్వారా మనసుకు లభిస్తుంది.

పుస్తకపఠనం గొప్ప అలవాటుగా చెబుతారు. అంటే వ్యక్తికి ఉండవలసిన మంచి అలవాట్లలో పుస్తకం చదవడం అనే మంచి మంచి అలవాటు కూడా ఉండాలని చెబుతారు.

పుస్తకం చదవుతూ ఉన్నంతసేపూ మనసు ఒక విషయంపై ఏకాగ్రదృష్టితో దృష్టితో ఉంటుంది.

చదువుతున్న పుస్తకం ఇంకా భారతీయ సాహిత్యం అంటే మరీ మంచిదని అంటారు. పుస్తకం చదవడం అంటే అందులో వ్రాసి ఉన్న విషయంతో మనసు కాసేపు ప్రశాంతతో ప్రయాణం చేయడమే అవుతుందని అంటారు.

మనకు పుస్తకములు విశిష్టమైన విషయములను మనసుకు తెలియజేస్తాయి. చదివే పుస్తకంలోని విషయసారమును మనసులోకి చేరుస్తాయి. కొన్ని మనోవికాసం పుస్తకాలు మననుసు మందు వంటివి అంటారు. ఎలాంటి పుస్తక పఠనం ఉంటే, అలాంటి భావన పెరుగుతుంది.

భక్తి పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మనసు భక్తి భావనతో ఉంటుంది. కాసేపు ఏదైనా ఒక భక్తి పుస్తకం చదువుతూ ఉంటే, మనసు కాసేపు ఏకాగ్రతతో ఆ దైవంపై భక్తిభావంతో ఉంటుంది…


మనోవిజ్ఙానం కలిగిన పుస్తకాలు మనసులో వికాసమును తీసుకువస్తాయి. తెలుగు సాహిత్యంలో గల విశిష్టమైన పుస్తకాలు విశిష్టమైన ఫలితాలనే అందిస్తాయి.. అయితే దృష్టి సారించడమే కష్టం అంటారు. మనసుపై మనసే యుద్ధం చేయాలంటే మనసు ఎందుకు సిద్దపడుతుందని కూడా అంటారు.

పుస్తకం మనసును ఒక విషయంపై దృష్టి పెట్టేలాగా చేస్తుంది. పుస్తకంలో ఉండే ప్రధాన లక్షణం ఇదే… ఈ లక్షణం వలన మన మనసు ఏకాగ్రత పెరుగుతుంది.

ఏదైనా ఒక పుస్తకం చదువున్నంతసేపూ మనసు ఆ పుస్తకంలోని అంశంతో మమేకమై ఆలోచనలను కొనసాగిస్తుంది. అలా ఒక విషయంపై విచారణ మనసుకు అలవాటు పడుతుంది.

విజ్ఙానంతో కూడిన పుస్తకాలు విషయములపై వివరణలు, విధానములను తెలియజేస్తాయి. అలాగే మనో విజ్ఙానంతో కూడిన పుస్తకాలు మనసు గురించిన స్వభావమును, మనసు తీరు తెలియజేస్తాయి.

ఇటువంటి మనోవిజ్ఙానమయ పుస్తకాలు రీడ్ చేయడం వలన మనసుకు మనసుతోనే చెలిమి ఏర్పడుతుందని అంటారు.

ఎక్కడ ఏది ఉందో చూసి తెలుసుకుంటాం. ఎక్కడ ఏది వినబడుతుందో విని తెలుసుకుంటాం. ఎక్కడ ఎలాంటి వస్తువు ఉందో తాకి తెలుసుకుంటాం…

కానీ చూడడం,వినడం, తాకడం తదితర విషయాలను తెలుసుకునే మనసు మాత్రం కనబడదు. చిత్రమైన మనసు విచిత్రమైన మనసుకు మనసే మిత్రుడు అవుతుంది. కొన్నిసార్లు శత్రువు కూడా అవుతుందని అంటారు.

ఇలాంటి మనసును కట్టడి చేయాలంటే, మనోమయవికాస పుస్తకాలు రీడ్ చేయాలి….

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను ఉంటే…. పోస్టు చదవడానికి

తెలుగు ఫ్రీబుక్స్

వ్యక్తిత్వవికాసం గురించి వివిధ తెలుగు ఉచిత పుస్తకాలు