లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ఉబుంటుటోUbuntuto లో తెలుగులో వ్రాయడంలో, భాగంగా లిబ్రె ఆఫీసు రైటర్ గురించ గత పోస్టులో స్టార్ట్ చేశాను. ఈ పోస్టులో లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్ గురించి, నాకు తెలిసిన, తెలుసుకున్న విషయం క్లుప్తంగా వివరిస్తాను. ఏ డాక్యుమెంట్ అప్లికేషన్ కు అయినా మెను బార్ తప్పనిసరి. మెను బార్ లోని కమాండ్స్ ద్వారానే మనం ఆ అప్లికేషన్ ఉపయోగించగలుగుతాం.

తెలుగురీడ్స్ పోస్టులు రీడ్ చేసి, తెలుగురీడ్స్ ప్రోత్సహిస్తున్న వెబ్ వీక్షకులకు ధన్యవాదాలు… ఉబుంటు Ubuntuto లో లిబ్రె ఆఫీసు రైటర్ ముఖ్యంగా డాక్యుమెంట్ క్రియేషన్, డాక్యుమెంట్ ఎడిటింగ్ కు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ప్రధానమైన వాటిలో ముఖ్యం మెనుబార్.

ఈ మెనుబార్ లో Ubuntu లిబ్రె ఆఫీస్ రైటర్ అప్లికేషన్ కు సంబంధించిన కమాండ్స్ ఉంటాయి.ఈ క్రిందగా ఆ మెను ఐటమ్స్ తెలియజేస్తే, వాటి ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి… రీడ్ చేయగలరు.

File (ఫైల్) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ఈ ఫైల్ మెనులో ఉండే కమాండ్స్ అన్ని కూడా ప్రస్తుతం ఓపెన్ చేయబడి ఉన్న డాక్యుమెంట్ ను సేవ్ చేయడం, ప్రింట్ చేయడం, ఎక్స్ పోర్టు చేయడం, డూప్లికేట్ చేయడం, క్లోజ్ చేయడం,… గతంలో సేవ్ చేయబడి రీసెంట్ గా క్లోజ్ చేసిన డాక్యుమెంట్లు ఓపెన్ చేయడాకి, ఇంకా కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఫైల్ మెను ఉపయోగపడుతుంది.

Edit (ఎడిట్) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ఎడిట్ మెను బారులో రెండవది. దీనిలో ఉండే కమాండ్స్ ద్వారా లిబ్రె ఆఫీసు రైటర్ డాక్యుమెంటును ఎడిట్ చేయవచ్చును. అంటే రిడూ, అండూ, సెలెక్ట్ టెక్స్ట్, సెలెక్ట్ ఆల్, కాపీ, కట్, పేస్ట్, ఫైండ్, రిప్లేస్, డిలెట్, గోటు పేజ్, హైపర్ లింక్, కామెంట్ వంటి వర్కులు చేయవచ్చును.

View (వ్యూ) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

మెను బారులో మూడవది View వ్యూ… లిబ్రె ఆఫీసు రైటర్ డాక్యుమెంట్ స్క్రీను నియంత్రణ వ్యూ మెనులోని కమాండ్స్ ద్వారా నిర్వహించవచ్చును. మీకు లిబ్రె ఆఫీస్ రైటర్ అప్లికేషన్లో కనబడుతున్న టూల్ బార్స్ అన్నింటి వ్యూ కమాండ్ ద్వారా హైడ్ చేయడం, షో చేయడం చేయవచ్చును. స్క్రీను జూమ్ నియంత్రణ చేయవచ్చును. ఇంకా పుల్ స్ర్కీన్ మోడ్ వ్యూమెనులోనే ఉంటుంది.

Insert (ఇన్ సర్ట్) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ముఖ్యమైన మెనులలో ఇన్ సర్ట్ ఒక్కటి. ఇన్ సర్ట్ మెనులోని కమాండ్స్ ద్వారా వివిధ రకాల ఎలిమెంట్స్ లిబ్రె ఆఫీసు రైటర్ డాక్యుమెంటులో ఇన్ సర్ట్ చేయవచ్చును. ఫోటోలు, మీడియా ఫైల్స్, చార్ట్స్, ఆబ్జెక్టులు, హైపర్ లింకులు, కామెంట్స్, సింబల్స్, హెడర్ అండ్ ఫుటర్, షేప్స్, టేబిల్స్ తదితరమైనవి ఇన్ సర్ట్ చేయవచ్చును.

Format (ఫార్మట్) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

కటెంట్ ఫార్మట్ విషయంలో డాక్యుమెంటు అప్లికేషన్లలో ప్రధానమైనది ఫార్మట్ మెను. టైపింగ్ చేయబడిన క్యారెక్టర్, స్పేసింగ్, టెక్స్ట్ వ్రాపింగ్, రొటేట్, ప్లిప్, బుల్లెట్ అండ్ నెంబరింగ్, ఎరేంజ్, కటెంట్ లెటర్ స్టైల్, పేరాగ్రాఫ్ సెట్టింగ్స్, టెక్స్ట్ ఎలైన్ మెంట్, కాలమ్స్, పేజి టైటిల్ తదితర కటెంట్ రిలేటెడ్ వర్కు ఫార్మట్ మెనులోని కమాండ్స్ ద్వారా నిర్వహించవచ్చును.

Styles (స్టైల్) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

లిబ్రె ఆఫీసు రైటర్ లో స్టైల్ మెను కమాండ్స్ ద్వారా టైటిల్, సబ్ టైటిల్, హెడ్డింగ్ టైప్స్, అప్పర్ కేస్, లోయర్ కేస్ తదితర స్టైల్స్ క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, లోడ్ చేయడం, స్టైల్ మెనేజెమెంట్ వంటివి చేయవచ్చును.

 

Table (టేబిల్) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

టేబిల్ మెనులోని కమాండ్స్ టేబిల్ క్రియేట్ చేయడం, టేబిల్ ఎడిట్ చేయడం, టేబిల్ డిలెట్ చేయడం వంటివి చేయవచ్చును. ఇంకా టేబుల్స్ నందు రో అండ్ కాలమ్ సెట్టింగ్ కూడా ఈ టేబిల్ మెనులోని కమాండ్స్ ద్వారా నిర్వహించవచ్చును.

Form (ఫార్మ్) Ubuntu Libre Office Writer

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ఏదైనా వివరాలు సేకరించడానికి ఉపయోగించే ఇన్ పుట్ ఫార్మట్ ఫార్మ్. ఈ ఫార్మ్ ఏదైనా పేపర్ ప్రింట్ చేస్తే, ఆ ప్రింట్ చేయబడిన ఫార్మ్ వివరాల సేకరణకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫార్మ్ మెను చాలా ముఖ్యం. ఈ ఫార్మ్ మెనులోని కమాండ్స్ ద్వారా టెక్స్ట్ బాక్స్, లేబిల్ బాక్స్, చెక్ బాక్స్, లిస్ట్ బాక్స్, గ్రూప్ బాక్స్ తదితరమైనవి నిర్వహించుకోవచ్చును.

Tools (టూల్స్) Ubuntu Libre Office Writer
లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

టూల్ మెనులో లిబ్రె ఆఫీసు రైటరులో మరొక మెను. ఈ టూల్ మెనులోని కమాండ్స్ తో స్పెల్ చెక్ చేయవచ్చును. ఆటో టెక్స్ట్ సెట్ చేసుకోవచ్చును. ఆటో కరెక్టు చేయవచ్చును. వర్డ్ కౌంట్ చేయవచ్చును. లైన్ నెంబరింగ్ ఇవ్వవచ్చును. ఇంకా మెను నిర్వహణ చేయవచ్చును.

Window (విండో) Ubuntu Libre Office Writer

విండో మెనులోని కమాండ్స్ ద్వారా న్యూవిండో ఓపెన్ చేయవచ్చును. ప్రస్తుత విండోను క్లోజ్ చేయవచ్చును.

Help (హెల్ప్) Ubuntu Libre Office Writer

హెల్ప్ మెనులోని కమాండ్స్ తో లిబ్రె ఆఫీసు రైటర్ గురించి వివరాలు తెలుసుకోవచ్చును. ఇందుకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం ఉండవచ్చును.

తెలుగులో లిబ్రె ఆఫీస్ రైటర్ గురించి మరింతగా మరొక పోస్టులో…

ధన్యవాదాలు.