లిబ్రె ఆఫీసు రైటర్ గురించి

తెలుగులో తెలుగువారికోసం లిబ్రె ఆఫీసు రైటర్ గురించి తెలియజేయడానికి సంతోషం….

లిబ్రె ఆఫీసు రైటర్ ఇది మెక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డు లాగా ఉబుంటు సిస్టంలో ఉంటుంది. అంటే లిబ్రె ఆఫీసు రైటర్ పేరుకు మాదిరిగానే లెటర్ రైటింగ్, డాక్యుమెంట్ రైటింగ్ వంటి డాక్యుమెంటేషన్ వర్కులు చేసుకోవచ్చును.

అటువంటి లిబ్రె ఆఫీసు రైటర్ నందు ఉండే ఫీచర్లు గురించి తెలుగులో తెలుగురీడ్స్.కామ్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. తెలుగులో తెలియజేసే ఈ ఉంబుంటుటోరియల్ ఆంగ్రపదాలు కూడా వాడడం జరుగుతుంది. లేకపోతే కొన్ని తెలుగు పదాలు మనకు వాడుకలో లేకపోవడం వలన అన్ని ఇంగ్లీషు వర్డ్స్ తెలుగులోనే తెలియజేయడం కష్టం అలాగే అవగాహన తెచ్చుకోవడం కూడా కష్టమే.

Libre Office Writer మొదటిగా మెను నావిగేషన్ ఉంటుంది. ఏ అప్లికేషన్ అయినా, అందులో మెనుబార్ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ కు సంబంధించిన మొత్తం కమాండ్స్, కమాండ్ కంట్రోల్స్ అన్నియూ, మెను బార్ ద్వారా చూపబడతాయి.

File (ఫైల్)

Edit (ఎడిట్)

View (వ్యూ)

Insert (ఇన్ సర్ట్)

Format (ఫార్మట్)

Styles (స్టైల్స్)

Table (టేబిల్)

Form (ఫార్మ్)

Tools (టూల్స్)

Window (విండో)

Help (హెల్ప్)

పైన వివరించబడిన మెను ఐటమ్స్ Libre Office Writer మెనుబార్లో టాప్ లో ఉంటాయి.

మెనుబారులో మొత్తం అప్లికేషన్ కంట్రోలుకు సంబంధించిన కమాండ్స్ అన్నియూ ఉంటే, ఎక్కువగా ఉపయోగించడానికి అవసరమైన ముఖ్యమైన కమాండ్స్ మరలా టూల్ బార్స్ రూపంలోకి మార్చబడతాయి. ఆయా అప్లికేషన్ ప్రధాన ప్రయోజనం అనుసరించి ఈ టూల్ బార్స్ లో కమాండ్స్ ఉంటాయి.

టాప్ మెను బారు క్రిందగా స్టాండర్డ్ టూల్ బార్ ఉంటుంది. స్టాండర్డ్ అంటే తెలుగులో ప్రామాణికం… అంటే ప్రధానంగా ఉపయోగించేవి, ఉపయోగపడే ఫీచర్ల షార్ట్ కట్స్ ఐకాన్ రూపంలో మనకు స్టాండర్డ్ బార్ లో సెట్ చేయబడి ఉంటుంది. ఎక్కువగా న్యూఫైల్, సేవ్, కాపీ, పేస్ట్, కట్, అండూ, రిడూ, టేబిల్, ఇన్ సర్ట్ ఇమేజ్, చార్ట్, హైపర్ లింక్ తదితర షార్ట్ కట్ ఐకాన్లు ఈ స్టాండర్డ్ మెను బారులో ఉంటాయి.

 లిబ్రె ఆఫీసు రైటర్ గురించి
లిబ్రె ఆఫీసు రైటర్ గురించి

ఆ తర్వాత ఉండే ఫార్మట్ మెను బారులో టెక్స్ట్ స్టైలింగ్ కు అవసరమైన ఫీచర్ల షార్ట్ కట్స్ ఉంటాయి. అంటే ఫాంట్ సైజు, ఫాంటు రకాలు, బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్, ఫాంట్ కలర్, ఫాంట్ బ్యాక్ గ్రౌండ్ కలర్, టెక్స్ట్ ఎలైన్ మెంట్, లైన్ హైట్ వంటి ఫార్మటింగ్ ఫీచర్ల ఐకాన్లు ఈ ఫార్మట్ మెను బారులో ఉంటాయి.

దాని తర్వాతి స్థానంలో క్రిందగా అంటే, ఫార్మట్ బార్ దిగువగా రూలర్ బార్ ఉంటుంది. దీనిపై మౌస్ తో రైట్ క్లిక్ చేసి, డైమన్షన్ సెట్టింగ్, ట్యాబ్ సెట్టింగ్స్ చేంచ్ చేయవచ్చును.

రూలర్ బారును తాకుతూ ఉండే పేజి, వర్కింగ్ వ్యూగా ఉంటుంది. ఈ స్థానంలో మనం టైపింగ్, డాక్యుమెంట్, లెటర్ ఫార్మట్ తదితర వర్కులు చేయవచ్చును.

డిస్ప్లేలో దిగువగా స్టేటస్ బార్ ఉంటుంది. ఇదే డిస్ప్లేలో అత్యంత దిగువగా ఉంటుంది. దీనిపై ప్రస్తుతం వర్కు చేస్తున్న పేజి సంఖ్య, మొత్తం టైపు చేయబడిన పదాల సంఖ్య, అక్షరాల సంఖ్య, ప్రస్తుత శైలి, ప్రస్తుత భాష, జూమ్ వంటివి కనిపిస్తాయి.

ఇక ఈ లిబ్రె ఆఫీసు రైటర్ లో కుడివైపున మరొక స్లైడ్ ఉంటుంది. దీని యందు ఎక్కువగా ప్రొపర్టీస్ కనబడతాయి.

లిబ్రె ఆఫీసు రైటర్ గురించి మరింతగా మరొక తెలుగురీడ్స్ పోస్టులో…