యోగ సాధన తెలుగు బుక్స్

యోగ సాధన తెలుగు బుక్స్: సహజంగానే యోగా వలన ఉపయోగాలు చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అని ప్రధాని మోదీగారు మొదటి ప్రభుత్వం టెర్ములోనే చెప్పారు. ఇక సాక్ష్యాత్తు ప్రధానిగారు చెప్పాక? ఈ యోగ గురించి మనకు సందేహం ఎందుకు.

అయితే ఎవరికి ముఖ్యం? ఎవరు ఎలా చేయాలి? ఎవరు చేయడానికి అర్హులు? ఈ ప్రశ్నలు చాలా ప్రధానం. అనారోగ్యంగా ఉన్నవారు యోగ వెంటనే ప్రారంభిస్తే కొత్త సమస్యలు వస్తాయని అంటారు. అలాగే వయస్సు రిత్యా కొన్ని యోగాసనములు కూడదని అంటారు.

యోగపాధనం మంచిది కానీ ప్రారంభానికి ముందే యోగా అవసనం మన శరీరమునకు ఎంత అవసరమో వైద్యుని ద్వారా తెలుసుకోవాలి. యోగ ప్రక్రియను యోగా శిక్షకుల దగ్గర తెలుసుకోవాలి. అసలు యోగాపై ఆసక్తి పెరగడానికి, యోగాకు సంబంధించని యోగ సాధన తెలుగు బుక్స్ చదవాలి.

మనం ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉండగలం. ఆరోగ్యంగా ఉంటే, వ్యాధినిరోదక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతుని లక్షణాలలో మనసు కూడా ప్రధానమైనదిగా చెప్పడం మన భారతీయ పెద్దలు చెబుతారు.

మనసుంటే మార్గముండదా? అనే ప్రశ్న చాలాసార్లు కాదు అన్న సమాధానానికి ఎదురు ప్రశ్నగా పుడుతుంది. అంటే మనసుపెట్టి, శ్రద్ధ పెడితే కార్యసాధనలో విజయవంతం కాగలం అంటారు. అలాగే వైద్యులు కూడా వైద్యం చేసి, మందులు వాడుతున్నప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోమని చెబుతారు. ఒత్తిడికి గురికావద్దు అంటారు.

మనిషి ఆరోగ్యంలో శరీరం బలంతో బాటు మనోబలం కూడా ముఖ్యం అంటారు

మనిషి ఆరోగ్యంలో శరీరం బలంతో బాటు మనోబలం కూడా ముఖ్యం అంటారు. శరీరమనకు, మనసునకు అవినాభావ సంబంధం ఉంటుందని కూడా చెబుతారు. ఏదైనా కొత్త రోగం అనగానే ఆందోళనకు గురయ్యే మనిషి ఆరోగ్యం ముందుగా క్షిణించే అవకాశం ఉంటుందంటారు. శరీరం అనారోగ్యంగా ఉన్నా, మనోబలం ఎక్కువగా ఉంటే, అనారోగ్యం నుండి బయటపడవచ్చును అంటారు.

మనిషి తన ఆరోగ్యం తను కాపాడుకోవడంలో జాగ్రత్త వహించాల్సింది మనసే. అలాగే ఏదైనా కొత్త రోగం వచ్చింది అనగానే, దాని గురించి కంగారుపడకుండా అవగాహనతో మెలగాల్సింది కూడా మనసే. మనిషి ఆరోగ్యం విషయంలో మనసు ముఖ్యపాత్రను పోషిస్తుందంటారు. మనసుకు కంగారు, ఆందోళన లేకుండా ఉంటూ, సూచించిన జాగ్రత్త తుచ తప్పకుండా పాటించేవారు పరిస్థితులను ఎదుర్కోవడంలో విజయవంతం కాగలరంటారు.

ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు రోజూ న్యూస్ ద్వారా అందరికీ చేరుతుంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదుకానీ ప్రాంతాలలో మనసు బాగుంటే, కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని ఉంటే, అంతలా మనసు ఆందోళనకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఇంకా ఇంట్లోనే ఉంటూ అదే పనిగా న్యూస్ చూడడం కూడా ‘లోకం ఏమైపోతుందో? మనం ఎలా ఉంటామో? ‘ అనే ఆలోచనలు కలగకమానవు.

ఏదైనా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా.. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువే… కానీ కరోనా వ్యాప్తి అంటే మనం తీసుకునే జాగ్రత్తను బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు సూచించిన సూచనలు పాటించడం. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండడం. సామజికదూరం పాటించడం మన బాధ్యత. ఇంటికే పరిమితం కావడం. అనవసరంగా బయటకు తిరగకుండా ఉండడం… చాలా ప్రధానం.

యోగ సాధన తెలుగు బుక్స్ ఐతే యోగ సాధన చేయడానికి ముందు వైద్యుల సలహా అవసరం

అయితే కరోనా యోగ సాధన ఆవశ్యకతను తెలియజేస్తుందా? అంటే వ్యక్తిని బట్టి ఉండవచ్చును. ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండి మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే, అతను కరోనా వైరస్ వలప ప్రభుత్వాలు సూచించిన సూచనలు, నియమాలు పాటిస్తే పరిపోతుంది. ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు కూడా ఇంటిలోనే ప్రయోగాలు చేయడం మేలు కాదు. తగు జాగ్రత్తలు సూచనలతోనే యోగాసనాలు వేయాలి. కాబట్టి యోగా ప్రారంభదశలో ఖచ్చితంగా వైద్యుల సలహామేరకు అనుభవజ్ఙుల దగ్గర ట్రైన్ అవ్వాలి.

కానీ కరోనా వైరస్ అంటువ్యాదిగా ఉండడం చేత ఇది ఆందోళనను కూడా వ్యాపింప చేస్తుంది. వైరస్ వచ్చినవారికి కన్నా వైరస్ వస్తుందేమోననే ఆలోచనతో ఉండేవారు చాలా అధికంగా ఉండవచ్చును. కారణం వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో? న్యూస్ ద్వారా ఆందరికీ తెలుస్తుంది. అలాగే మనదేశంలో ఏవిధంగా వ్యాప్తి చెందుతుందో కూడా న్యూస్ ద్వారా మనకు చేరుతుంది. కరోనా ఎప్పటివరకు ఇండియాలో ఉంటుంది? కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ ఎంతకాలం ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలతో టివీ చూస్తూ కరోనా వైరస్ న్యూస్ మనకు కనబడుతూనే ఉంటుంది.

మనకు న్యూస్ ద్వారా కరోనా వ్యాప్తి, కరోనా ప్రభావం గురించి తెలుసును. అయితే యోగాభ్యాసం వలన మేలు ఏమిటో తెలసుకుంటే, కరోనా వంటి అంటువ్యాధులు మరలా వస్తే, మనకు యోగ ఎంతవరకు సాయపడగలదు? అనేదానిపై అవగాహన వస్తుంది. ఆరోగ్యం విషయంలో మందులు తాత్కలిక ఉపశమనం కలిగిస్తే, నిత్యం చేసే కర్మలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అంటారు.

ఈ నిత్యం చేసే కర్మలు మాత్రం మనసు ఆధారంగానే సాగుతాయి. యోగాసనాలు మనసు శరీరం రెండు అనుసంధానం అవుతాయని అంటారు. అందువలన మనసు నియంత్రణకు, శరీరారోగ్యమునకు మేలు అంటారు. అయితే యోగాసనాలు మాత్రం అనుభవజ్ఙుల ద్వారా ప్రాక్టీసు చేసి ఇంటిలో ప్రయత్నించాలని అంటారు. అలాగే ఆరోగ్యమును బట్టి వైద్యుని సలహా కూడా తప్పనిసరి.

ఆసక్తి పెరిగిన మనసు, దానిని సాధించడంలో ప్రయత్నం చేస్తుందని అంటారు.

యోగసాధన విధానం, దాని ఉపయోగాలు తెలుసుకుంటే, దానిపై ఆసక్తి మనసు పెంచుకుంటుంది. ఆసక్తి పెరిగిన మనసు, దానిని సాధించడంలో ప్రయత్నం చేస్తుందని అంటారు. కాబట్టి కొత్తగా ప్రారంభించే మంచి పని ఒక్కసారిగా ప్రారంభించి అపడం కన్నా, సవివరంగా తెలుసుకుని, ప్రారంభించడం వలన ఆ పని రోజూ క్రమం తప్పకుండా జరుగుతుంది. అయితే ఆసక్తిని పెంచుకోవడం ప్రధానం.