యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు ఆన్ లైన్లో పిడిఎఫ్ ఫార్మట్లో లభిస్తున్నాయి.

నవల చదవడం అంటే, రచయిత ఊహతో మనము ప్రయాణం చేయడమే.. ఒక రచయిత వ్రాసిన స్టోరీని మనం రీడ్ చేస్తున్నామంటే, ఆ స్టోరీలోని పాత్రలు మన మనసులో మెదులుతాయి. అవే పాత్రలు రచయిత మనసులో మెదిలి పుస్తకం ద్వారా మనలోకి వస్తుంటాయి.

తెలుగు నవలా పుస్తకాలు రీడ్ చేయడం వలన నవలలో వ్రాయబడిన వివిధ పాత్రలు మన మనసులో కదులుతుంటాయి. ఒక్కోసారి అటువంటి చిత్రమైన పాత్రలు మనకు సమాజంలో తారసపడుతూ ఉండవచ్చును. రచయిత సమాజం, సమాజంలోని వివిధ వ్యక్తుల స్వభావములను తెలుసుకుని ఉంటాడు. ఇంకా అంచనాతో ఊహాత్మక కల్పిత కధకు శ్రీకారం చుడతారు.

మనకు తెలుగులో అనేకమంది నవలా రచయితలు ఉన్నారు. వారిలో ప్రముఖులు యండమూరీ వీరేంద్రనాధ్. ఈయన నవలలు బాగా ప్రసిద్ది చెందినవి.

యండమూరీ వీరేంద్రనాద్ ప్రముఖ నవలా రచయిత.. ప్రసిద్ద నవలా రచయితలలో యండమూరీ ఒకరు. యండమూరీ నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. యండమూరీ నవలలు తెలుగులో పిడిఎఫ్ రూపంలో ఆన్ లైన్లో లభిస్తున్నాయి.

యండమూరీ తెలుగు నవలలు రీడ్ చేయడానికి

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు
యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు

 తరళా ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టరు ఇంటి పడగ్గదిలో రాత్రి రెండున్నరకి ఒక ఫోన్ మ్రోగింది. యమ్. డి. ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ లో అవతలివారు చెప్పింది అతడికి మొదట అర్ధంకాలేదు. ఫోన్ పెట్టేసిన తరువాత కూడా అతడికి విషయం పూర్తిగా అర్ధం కాలేదని ముఖ భంగిమే చెపుతుంది. గబగబా లేచి తయారై, ‘ఎక్కడికండి’ అని అడుగుతున్న భార్యకి కూడా పూర్తిగా సమాధానం చెప్పకుండా కారు తీసుకుని పోలీస్ స్టేషన్ వైపు బయల్దేరాడు. అతడి నిద్ర ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. 

నవల ప్రారంభం అలా.. ఇంకా ఈ తెలుగు నవల రీడ్ చేయడానికి పై చిత్రం తాకండి.

తెల్లవారు ఝామున నాలుగు గంటలైంది మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుని వున్నాడు చీరంజీవి. రాత్రినుంచీ ఏడవటంవల్ల కంటిపక్క నీటి చారలు కట్టినయ్. రాత్రంతా నిద్రపోలేదు _ కొంచెంసేపు ఏడ్చాడు. తరువాత అది వెక్కిళ్ళలోకి దిగింది. తరువాత అదీ ఆగిపోయింది.

ఇంకా చదవడానికి ప్రక్క చిత్రం తాకండి.

యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు
యండమూరీ తెలుగు నవలా పుస్తకాలు

    అతడు-

తనలోని ఇరవైమూడు అంశాల్ని తీసుకుని-

    తన పరిమాణంతో పోల్చుకుంటే, దానికి లక్షరెట్ల దూరాన్ని పయనించే లక్ష్యంతో-

    వేగంగా ఆమెని చేరుకుంటున్నాడు.

    ఆమె-

తనలో ఇరవై మూడు అందాల్ని నిక్షిప్తపరచి-

    స్వాతి జల్లుకోసం ముత్యపుచిప్పలా వేచి వుంది.

    రెండు ఇరవైమూడులు కలిసి ఒక సజీవాకృతి ధరించబోయే సమయాన-

ఇంకా చదవడానికి పై చిత్రం తాకండి.

నల్లంచు తెల్లచీర నవల తెలుగులో రీడ్ చేయడానికి ఈ చిత్రమును తాకండి.