మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా

మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా మరిన్ని ఫీచర్లతో ఆకట్టుకోబోతుంది. దీని అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ ఇకామర్స్ వెబ్ సైటు ద్వారా 30న ప్రారంభం కానున్నాయి.

Moto G 5G Plus స్మార్ట్ ఫోన్ Android v10 (Q) మొబైల్ ఓ.ఎస్. పనిచేస్తుంది. ఈ ఫోను Octa core Qualcomm Snapdragon 765 Chipset ప్రొసెసరుతో పనిచేస్తుంది. దీనియందు 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నెల్ మెమోరి అంటే ఫోను మెమోరి ఉంటుంది.

ఇంకా Moto G5G Plus స్మార్ట్ ఫోన్ ఐపిఎస్ ఎల్.సి.డి. డిస్ప్లే కలిగి ఉంటుంది. దీని కొలతలు 168 mm x 74 mm x 9 mm సైజులో ఉండి, 207 గ్రాముల బరువు ఉంటుంది. దీని స్క్రీను రిజల్యుషన్ 1080 x 2520 pixels కలిగి ఉండి డెన్సిటి 409 పిక్సెల్ పర్ ఇంచ్ గా ఉంటుంది. ఫోన్ ఏస్పెక్ట్ రేషియో 21:9 మరియు స్క్రీను నుండి బాడీ రేషియో 84.54 % ఉంటుంది.

అద్భుతమైన కెమెరా క్వాలీటి గా చెప్పబడే 48 మెగా పిక్సెల్ కెమెరాతో బాటు 8మెగాపిక్సెల్, 5మెగాపిక్సెల్, 2మెగాపిక్సెల్ ఫోనుకు వెనుక వైపులో ఉంటే, ఫోనుకు ముందువైపున 16మెగాపిక్సెల్, 8మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయని ఫోను ఫీచర్లలో ఉన్నాయి. ఇంకా కెమెరా ఫీచర్లు అంటే డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్ వంటివి లభిస్తాయి. మోటో జి5జి ప్లస్ ఫోను 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

మోటోజి5జి ప్లస్ 5జి కలిగి ఇంకా వైఫై, బ్లూటూత్, జిపిఎస్, వోల్టే, ఎన్ ఎఫ్ సి తదితర కనెక్టివిటి ఫీచర్లు కలిగి ఉంటుంది. మోటోజి5జి ప్లస్ ఫోను రేట్ రూ. 29,490…లుగా సుమారు ధరగా ఉండవచ్చును. దీని ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈనెల అంటే నవంబర్ 30, 2020వ తేదిన అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

సామ్సంగ్ ఫోనును హార్డ్ రిసెట్ చేయడం

తెలుగురీడ్స్