మన భారతంలో భారత్ బంద్

ఈరోజు మన భారతంలో భారత్ బంద్ తలపెట్టారు. రైతులు, ప్రతిపక్షాలు డిసెంబర్8న భారత్ బంద్ ప్రకటించాయి. తత్ఫలితంగా నేడు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ బంద్ పిలుపు.

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు గత కొన్నిరోజులగా మన భారతంలో కొనసాగుతున్నాయి.

ఇక రాజకీయ భారతంలో అయితే సరేసరి కొన్ని ప్రతిపక్షాలు ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా ఉన్నాయని.

రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం:

మన భారతంలో ఏ పంటకు అయినా.. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, ఆయా కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. దీనికి ఒక కాల పరిమితి ఉంటంది. అది కనీసం ఒక పంట కాలం నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. రైతులు తమ పంట పండించడానికి ముందే ఎవరైనా కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకోవచ్చు. ఇందులో వివాదాల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుంది.

పెద్ద పెద్ద కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతాయి. దీంతో తాము పండించే పంట ఉత్పత్తుల అమ్మకాల విషయంలో రైతులకు భరోసా కలుగుతుంది.
ముందే ధర తెలుసుకోవడం వల్ల రైతు తన పండించే పంట పెట్టుబడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
రైతులకు పంట పండించడం కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయి.
రైతుల తమ పంటల అమ్మకాల ప్రక్రియలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

2) నిత్యావసర సరకుల (సవరణ) చట్టం:

కేంద్రప్రభుత్వానికి నిత్యావసరాల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, అమ్మకాల నియంత్రణ అధికారం ఉంటుంది.

వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడంతో బాటు, నిత్యావసర వస్తువులపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం.
దీని వలన వ్యవసాయ రంగంలో పోటీ ఏర్పడుతుంది. తత్ఫలితంగా రైతుల ఆదాయం పెరుగుతుంది.
దేశంలో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తగినన్ని సదుపాయాలు పెరుగుతాయి. తత్ఫలితంగా పంట వ్యర్థాలు పెద్ద మొత్తంలో తగ్గుతాయి.

ప్రతిపక్షాలు, రైతు సంఘాలు భారత్ బంద్ పిలుపునిచ్చేంతలాగా ఈ వ్యవసాయ చట్టంలో ఏముంది? చట్టాలు ప్రజాప్రయోజనాలను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తారు.

అయితే ఈ చట్టాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులు విశ్లేషకుల మాటలలో వింటే మనకు మరింత అవగాహన ఉంటుంది.

మన భారతంలో మేధావులు, విశ్లేషకులు ఎక్కువగానే ఉన్నారు. కొందరు ప్రధానంగా సామాజిక పరంగా విశ్లేషిస్తే, కొందరు రాజకీయపరంగా విశ్లేషిస్తూ ఉంటారు.

ఏదైనా విశ్లేషణలు చూడడం వలన మనకు సరైన అవగాహన ఉంటుంది. మన భారతంలో నివసిస్తున్న మనం జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలుసుకోవడం అవసరం అంటారు.

ఆందోళనలు పెంచుతున్న ఈ వ్యవసాయ చట్టంపై ప్రముఖుల అభిప్రాయాలు, చట్టం వివరించే వీడియోలు ఈకిందగా ఇవ్వడం జరిగింది. వాచ్ చేయండి… అవగాహన ఏర్పరచుకోండి.

వ్యవసాయ చట్టాలపై ప్రముఖ వీడియోలు ఈ క్రిందగా చూడండి.

సామాజిక మార్పు ఆశించి, ఉద్యోగం వదలి పార్టీని స్థాపించిన జయప్రకాశ్ నారాయణ గారి అభిప్రాయం.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెషర్ కె నాగేశ్వర్
మన భారతంలో భారత్ బంద్
https://www.youtube.com/watch?v=WIIP2vkuwcQ

వ్యవసాయ మంత్రిత్వశాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.