భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? తెలుగు బుక్: ఈ తెలుగు బుక్ చదవాలి? ఈ బుక్ ఎవరు చదవాలి? ఈ బుక్ వలన కలిగే ప్రయోజనాలు? అంటూ పలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తూ ఈ పుస్తకం వ్రాయబడింది.

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? పిడిఎ ఫ్రీ తెలుగు బుక్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

గమనిక:

ఈ క్రిందగా వ్రాసిన వచనం, పైన తెలియజేయబడిన బుక్ లింకు సంబంధం లేదు. ఇది కేవలం భార్యభర్తలు అన్యోన్యత అనే ఆలోచన రాగానే, నా మనసులో మెదిలిన ఆలోచనలే ఒక వచనంగా మార్చి, ఈ పోస్టులో జతచేయడం జరిగింది. ఇందులో ఎవరిని ఉద్దేశించి ఏమి వ్రాయలేదు. కేవలం మనసు అనేది ఎలా ఉంటుందో… తెలియజేయడానికి జీవితభాగస్వామి… పదం ఆధారం వ్రాశాను… ఇక చదవండి.

ఖుషి సినిమా చూస్తూ ఉంటే, ఓ ఆహ్లాదకరమైన ప్రేమకధను తెరపై పాత్రలతో కనబడుతుంది. ఆ సినిమా ఎప్పుడు చూసినా బోర్ కొట్టదని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే దానిలో ఇద్దరి మద్య జరిగే సంభాషణలు, కలిగే భావాలు సహజధోరణిలో సాగుతాయి. వారిద్దరి మద్య జరిగే పరోక్ష, ప్రత్యక్ష సంఘర్షణ ఆకట్టుకుంటుంది.

అయితే ఖుషి తెలుగు సినిమా ముగింపు కూడా ఇద్దరి ఘర్షణాత్మక వాతావరణంలోనే ఉంటుంది. గొడవపడుతూనే ఒకరిపైఒకరి అమితమైన ఇష్టాన్ని కలిగి ఉండేవారు, విడిపోయేదాకా వెళ్ళి మరలా కలుసుకుని కాపురం చేస్తారు. కాపురంలో కూడా కలహాలతోనే సాగిందనే ఉద్దేశ్యం చిత్రం ముగింపులో కనబడుతుంది.

ఇంతలా అందరిని కట్టిపడేసిన, ఆ సినిమా కధనంలో ఆయువుపట్టు ఏమిటంటే ఇద్దరిలో ఉండే ఇగో. ఆ ఇగో ఆధారంగానే సినిమా మొత్తం నడుస్తుంది. అయితే అది సినిమా కాబట్టి ఇగోలకు పోయి పంతం పట్టుకు కూర్చున్నవారు కలుసుకోవడం కుదిరింది.

సినిమా మాదిరి జీవితం?

జీవితంలో అయితే సినిమాలో చూపినంత తేలికంగా బంధం ఏర్పడవచ్చును. కానీ సినిమాలో చూపినంత తేలికగా ముగింపు ఉండకపోవచ్చును. సినిమాలో దర్శకుడు సృష్టించిన పాత్రలకే పరిమితం. కానీ జీవితం భగవంతుడు ఇచ్చిన బంధాలు కీలక పాత్రను పోషిస్తాయి.

ఇద్దరి మద్య బంధంలో, ఆ ఇద్దరికే పరిమితమైన భావాలు మూడో వ్యక్తి జోక్యం చేసుకున్నప్పుడు మాత్రం మారే అవకాశం ఉంటుంది. ఆలోచలనే మారుతూ ఉంటాయి. స్వభావం అంత త్వరగా మారదంటారు. అయితే జోక్యం చేసుకునే వ్యక్తి ఆ బంధం యొక్క శ్రేయస్సు ఆశించేవారు అయితే అది వారికి మరింత మేలును చేస్తుంది.

శతమానంభవతి తెలుగు సినిమాలో విడిపోవాలని నిశ్చయించుకున్న భార్య, భర్త ఇద్దరూ ఒక పెద్దాయన దగ్గరకు వస్తారు. అప్పుడు పెద్దాయన వారికి సర్దిచెప్పడం కాకుండా, వారిని ప్రశ్నిస్తాడు.

ఉద్యోగంలో ఏదైనా సమస్య అయితే, సర్దుకుంటున్నారా? లేక ఉద్యోగం వదిలేస్తున్నారా?

ఇంకా అద్దెకు తీసుకున్న ఇల్లు, ఆ ప్రక్కవారితో సమస్యలు ఉంటే, సర్దుకుంటున్నారా? లేక ఇల్లు వెంటనే ఖాళీ చేస్తున్నారా? అని ప్రశ్నించిన… ఆ పెద్దాయన… ఉద్యోగంలో, అద్దె ఇంటి విషయంలో సర్దుకుపోయే తత్వం, జీవితభాగస్వామి విషయంలో కూడా ఉండాలని సూచన చేస్తాడు. ఆపై వారు కలిసే ఉంటారు.

సమాజంలో చాలాచోట్ల సర్ధుకుపోయేవారు, జీవితభాగస్వామితో ?

దీనిలో చాలా వాస్తవిక పరిస్థితి కూడా ఉందంటారు. జీవితంలో చాలా విషయాలలో సమాజాన్ని బట్టి, సమాజంలో ట్రెండును బట్టి సర్దుకుపోవడం అలవాటు అయినవారు, జీవితభాగస్వామి విషయంలో పట్టు పట్టి పంతానికి పోవడం ఉంటుందంటారు. ఇటువంటి ధోరణి బంధాన్ని పాడుచేస్తుంది.

సర్దుకుపోవాలి అనే ఆలోచన పుట్టనివారు, లోకం తెలియనివారు, అజ్ఙానంతో ఉన్నవారు అయితే ఇంకొకరు చెబితే వింటారు. లోకం తెలిసి, లౌక్యం తెలిసినవారు మరి జీవితభాగస్వామి విషయంలో సర్దుకోకపోతే, మరి ఇంకా ఎవరికోసం సర్దుకుంటారు. ఒకనాటికి వారి మనసు వారికే ఎదురుతిరిగితే, దానితో కూడా సర్దుకుపోలేని భావనలు ఉంటాయి.

ఎప్పుడైన ఒక జీవి మనసుకు తోడు జీవితభాగస్వామి యొక్క మనసే…! ఎందుకంటే ఆమె కానీ, అతను కానీ తమ భాగస్వామి యొక్క మంచి గుణాలు, చెడ్డగుణాలు గుర్తించగలుగుతారు. కానీ ఆ విషయంలో వారిలో ఉండే మనసు గుర్తించకపోవచ్చును. కష్టంలో జీవితభాగస్వామి యొక్క లాలనే, మనిషికి శాంతిని తేగలదు.

అపార్ధం చేసుకోవడమే కలతకు కారణం అయితే, అపార్ధం తొలగించుకుంటే, బంధంలో కలతను సృష్టించిన ఆఅపార్ధమే, ఆ ఇద్దరిలో మరింత ప్రేమను పెంచుతుంది. అపోహ గురైనవారికి తన భాగస్వామి హృదయం అర్ధం అవుతుంది. అర్ధం చేసుకుని ఆలోచించగలిగితే అపార్ధం కూడా బంధువే కాగలదు. లేకపోతే అపార్ధమే అనర్ధాలకు కారణం కాగలదు.

భిన్నమైన ఆలోచన ధోరణి మనసుకు సహజ లక్షణం. ఇది మనసుకు మాములే అనుకుంటే, ఎదుటివారి మనసులో మెదిలే ఆలోచనలపై మాత్రమే కోపం వస్తుంది, కానీ వ్యక్తిపై కాదు. ఎదుటివారికి కోపం కలిగిందంటే, అది తన ఆలోచన వలననే అని అనుకుంటే, ఆలోచనా తీరును మార్చుకోవాలనే మంచి తలంపు పుడుతుంది.

కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. కాలంలో కష్టం వెనుక ఇష్టం, ఇష్టంతోబాటు కష్టము కూడా కలుగుతుంది. ఇలా ఆలోచిస్తే, భాగస్వామిపై భావన మారదు. కష్టం భరిస్తూ, ఆ కష్టాన్ని దూరం చేసుకునే ఆలోచనను మనసు చేయగలుగుతుంది.

వివాహం యొక్క విశిష్టతను తెలియజేసే గురువుగారి ప్రవచనం, ఈక్రింది వీడియో ఉంది.

https://www.youtube.com/watch?v=p2ljuw300_A
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఈ లింకు యూట్యూబ్ నుండి సేకరించడం జరిగింది. ఉచితంగా చూడవచ్చును.

ధర్మం గురించి తెలిస్తే, కర్తవ్యము గురించిన ఆలోచన

ధర్మం గురించి తెలిస్తే, తను చేయవలసిన కర్తవ్యము గురించిన ఆలోచనను మనసు వదలదు. చూడండి… సమాజంలో కొందరు ఉద్యోగంలో చాలా విషయాలలో రాజీపడుతూ సర్దుకుపోతారు. ఎందుకంటే ఉద్యోగం తన కర్తవ్యం అని వారి మనసు పదే పదే చెబుతుంది. అలాగే పెళ్ళి, జీవితంలో ప్రధాన ధర్మం. జీవితభాగస్వామి ధర్మ భాగస్వామి అనుకుంటే, అప్పుడు కర్తవ్యం మీదే మనసు ఉంటుంది. ఏదైనా కష్టకాలంలో జారిపోవచ్చును, కానీ కర్తవ్యం కష్టం నుండి జారిపోదు. ఇక్కడ మనసు ఒక బలమైన భావనను పొంది ఉంటుంది. అదేమిటంటే?

అసలు నేనూ నాకర్తవ్యమును నిర్వహిస్తున్నా కాబట్టే, ఈ కష్టాలు. కాబట్టి నేను నా కర్తవ్యం నుండి మరలకూడదనే భావనను బలంగా పొంది ఉంటుంది. కర్తవ్యంపై పూనిక బలంగా రావాలంటే, ధర్మం తెలియజేసే బుక్ రీడింగ్ చాలా మేలైనవిగా చెబుతారు.

కర్తవ్యం గుర్తించడం వలననే కదా… బోర్డరులో సైన్యంలో చేరతారు. కర్తవ్యం వలననే కదా… బోర్డరులో కలసికట్టుగా శత్రువుపై పోరాడతారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశరక్షణ చేస్తారు. మరీ జీవితభాగస్వామి విషయంలో… ఇది ఎవరికివారే ఆలోచన చేయాలి.

ఎన్ని పుస్తకాలు అయినా, ఏ సినిమాలు అయినా…. ఒక ఆలోచనా విధానం వలన ఎలా ఉంటుందో? అనే భావన వరకు పరిమితం. బుక్ చదివిన వ్యక్తి లేక సినిమా చూసిన వ్యక్తి స్వయంగా ఆలోచన చేస్తేనే, తన సమస్యకు తన మనసులో పరిష్కారం మెదులుతుంది. ముందు మనసును మధిస్తేనే, మజ్జిగలో ఉండే, వెన్న పూస బయటకు వచ్చినట్టు, మనసులో ఉండే తెలివి బయటపడుతుంది. దాని శక్తి తెలియవస్తుంది.

ఏదైనా ఒక బుక్ ఒక సమస్యపై వ్రాయబడితే, ఆ తెలుగు బుక్ ఒక మిత్రుని మాదిరిగా ఉంటుంది. మిత్రుడు మన వ్యక్తిగత కష్టం చూసి, ఎలా పరోక్షంగా సలహాను ఇస్తాడో? అలాగే పుస్తకం కూడా పరోక్షంగా సమస్యలు, పరిష్కారాలకు ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతుంది.

భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే?

ఇక భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే? ఇద్దరికీ ఇష్టమైన విషయాలతో మరొకరి ఇష్టాయిష్టాలపై దృష్టిపెడితే… వారి బంధం మరింత బలపడుతుంది. ముందు మనసుకు ఇష్టమైనది చూస్తే, దానికోసం కష్టం భరిస్తుంది. ఒక్కవిషయంలో ముందు కష్టంలో కలిగే వ్యగ్రతలో వ్యక్తులను చూడడం కన్నా వారి మనసును చూస్తే, సగం తీవ్రత తగ్గుతుంది. ఇక కాలం, కర్మ అనే ఆలోచన కూడా తోడైతే, ఆ కష్టం ఒకరి వలన వచ్చిందనే భావన కన్నా ఇది మనకు ఏర్పడిన కష్టం. కాలం తెచ్చిన కష్టం… దీని నుండి మనం బయటపడాలనే తలంపులు మనసులో ఏర్పడతాయి.

కష్టంలో వచ్చే ఆలోచనలు త్రీవంగా ఉంటే, వాటిని దారి మళ్ళిస్తే ప్రయోజం పొందవచ్చును. రాయి గోడకు తగిలితే పెద్దగా ఏంకాదు. కానీ అదే రాయి అద్దానికి తగిలితే, అద్దం పనికిరాదు. అలానే తీవ్రమైన భావన, భాగస్వామిపై పడకుండా దారి మళ్ళిస్తే, కష్టం బంధానికి కీడు చేయదు. మనసు గోడకు కొట్టిన బంతిలాంటిది.

అర్ధం చేసుకోవడం, సర్దుకుపోవడం జీవితభాగస్వామి విషయంలో చాలా ప్రధానమైన విషయం. అప్పుడే అపార్ధములను కూడా బంధం బలపరుచుకోవడానికి వాడుకోవచ్చును. కాలంలో అపార్ధం కలగకపోదు, కష్టం రాకుండా ఉండదు. ఇష్టాలు తీరకుండానూ ఉండవు. ఒకవేళ ఉంటే, అవి స్థాయిని దాటి ఉండవచ్చును. వాస్తవానికి దూరంగా ఉండవచ్చును.

ధన్యవాదాలు… తెలుగురీడ్స్.కామ్