భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. సర్వదేవతా భజనలు, రామభజనామృతము, సీతారామ భజన తదితర తెలుగు పుస్తకాలు… సర్వదేవతా భజనలు బుక్ లోని కొన్ని భజన పద్యాలు.

శ్రీగణేశ శ్రీగణేశ | శ్రీగణేశ పాహిమాం
జయగణేశ జయగణేశ | జయగణేశ రక్షమాం
ఓం గణేశ ఓం గణేశ | ఓం గణేశ పాహిమాం
శ్రీగణేశ శ్రీగణేశ | శ్రీ గణేశ రక్షమాం ||

గణేశ శరణం | శరణం గణేశ
వాగీశ శరణం | శరణం వాగీశ
విఘ్నేశ శరణం | శరణం విఘ్నేశ
మహేశ శరణం | శరణం మహేశ
రమేశ శరణం | శరణం రమేశ
సురేశ శరణం | శరణం సురేశ
గిరీశ శరణం | శరణం గిరీశ

విఘ్కేశా తవచరణం | విఘ్నవినాశక మమశరణం
గంగాధరహర గౌరీమనోహర | గిరిజాతనయా తవచరణం
మూలాధారా మోదకహస్తా | మోక్షదాయకా తవచరణం
జ్ఙానాధారా జ్ఙానవినాయక | నటనవినోదా తవచరణమ్||

దశరధనందన రామరామ | దశముఖమర్దన రామరామ
పశుపతిరంజన రామరామ | పాపవిమోచన రామరామ
మేఘశ్యామ రామరామ | రవికులసోమ రామరామ||

సాంబసదాశివ సాంబశివా | శంభోమహాదేవ సాంబశివా
గౌరీమనోహర సాంబశివా | గంగాజటాధర సాంబశివా
చంద్రకళాధర సాంబశివా | హరహర శంభో సాంబశివా

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా
భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

విఠలా విఠలా | పాండురంగ విఠలా
పాండురంగ విఠలా | పండరినాధ విఠలా
పండరినాధా విఠలా | పురందర విఠలా
పురందర విఠలా | పుండరీక విఠలా||

నందనందనా గోవిందా | నవనీతచోరా గోవిందా
భక్తవత్సలా గోవిందా | భాగవతప్రియ గోవిందా
వేణువిలోలా గోవిందా | విజయగోపాల గోవిందా
కృష్ణారామా గోవిందా | రామకృష్ణా గోవిందా||

అఖిలాండేశ్వరి నమో నమో | ఆదిపరాశక్తి నమో నమో
రాజరాజేశ్వరి నమో నమో | శ్రీభువనేశ్వరి నమో నమో
ఓం జగజ్జననీ నమో నమో | ఓంకారేశ్వరి నమో నమో
త్రిలోక జననీ నమో నమో | దేవి మహేశ్వరి నమో నమో
శక్తి మహేశ్వరి నమో నమో | దుర్గా సరస్వతి నమో నమో
అన్నపూర్ణేవ్వరి నమో నమో | అంబపరమేశ్వరి నమో నమో

ఆనాధరక్షక సదాశివా | దీనబంధో సదాశివా
ఆదిదేవా సదాశివ | కైలాసవాసా సదాశివా
ముక్తి దాయకా సదాశివా | గిరిజారమణా సదాశివా
నందివాహనా సదాశివా | గిరిజారమణా సదాశివా
త్రాహి త్రాహి సదాశివా | పాహి పాహి సదాశివా
హర హర హర హర సదా శివా | హర ఓం హర ఓం సదా శివా||

రామ భజనామృతము తెలుగు బుక్ నందు భజన పాటలు మన మనసుకు తేలికగా వచ్చేసేలాగా ఉన్నాయి.

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా
భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

భజనలు చేయవే ఓ మనసా సీతారాముల భజనలు చేయవే ఓ మనసా
అయోధ్య రాముని భజనలు చేసి ఆనందం పొందవే ఓ మనసా
ఆత్మానందం పొందవే ఓ మనసా ||
ధశరధరాముని భజనలు చేసి దిగ్విజయం పొందవే ఓ మనసా
దివ్యానందం పొందవే ఓ మనసా||
కౌసల్య రాముని భజనలు చేసి కృపానందం పొందవే ఓ మనసా
కైవల్యం పొందవే ఓ మనసా||
అహల్య రాముని భజనలు చేసి ఆనందం పొందవే ఓ మనసా
పరమానందం పొందవే ఓ మనసా||
భార్గవ రాముని భజనలు చేసి భక్తిని పొందవే ఓ మనసా
బ్రహ్మానందం పొందవే ఓ మనసా ||

కళ్యాణ రాముని భజనలు చేసి కటాక్షం పొందవే ఓ మనసా
కైవల్యం పొందవే ఓ మనసా||
సీతారాముల భజనలు చేసి సంతోషం పొందవే ఓ మనసా
సరోజదళముల పూజలు చేయవే ఓ మనసా||

నన్ను కన్నతల్లి నా భాగ్యమా
సీతమ్మ తల్లి జనకరాజ తనయే
నిన్ను నమ్మితమ్మ నా దైవమా
రఘునాధ ప్రియే సూర్యవంశరాణి
నా మొరలు వినవే సరోజాక్షి
సౌమిత్రి పూజిత అయోధ్యారాణి
కరుణచూపు తల్లి కమలలోచనీ
కౌసల్య కోడల రఘు వంశోద్ధారి.

మానస మాధవం-భక్తి గీతాలు తెలుగు బుక్ లో

మనసును మైమరిపించే భక్తి గీతం చాలా తేలికగా మన మనసులోకి చేరిపోతుంది.

ఏడడుగులు కలసి నడుద్దాం
ఏడుకొండలే ఎక్కుదాం
రండి జనులార –
రండి తరించండి –

మనసు మనసు కలుపుదాం
మనమంతా ఒకటౌదాం
మనందరిది ఒకే గతం
మనందరిది ఒకే మతం

అరమరికలు అంతరించి ఆనందం పొందుదాం
ఏడు రంగు లొకటైతే ధవళవర్ణం
ఏడు కొండలెక్కితే దైవదర్శనం
ఆరు గిరలు దాటితే అఖలాత్ముడు
ఆరు అరులు ఓడితే మోక్ష ప్రాప్తం

పాపాలే మాసిపోవు మనదారిలో
లోపాలు తొలగిపోవు కొండదారిలో
ఏడవ గిరి శిఖరాన గుడిగోపురం
ఆనంద నిలయడే అచట కాపురం

బండలన్ని పవిత్రం కొండలన్ని విచిత్రం
ప్రకృతంత పవిత్రం ప్రతి అణువు పావనం
పోవుకొలది ప్రపంచాన్ని బాసే అనుభూతి
చేరుకొలది పరమాత్ముని సన్నిధి ప్రీతి

మరిన్ని భక్తిగీతాలు మన మనసుని ఆకర్షిస్తాయి. ఆ మాధవునిపై మనసుని మళ్ళిస్తాయి.

భక్తి గీతములు తెలుగు బుక్ లో భక్తి పాటలలో ఒక్క పాట ఏడుకొడలవాడిపై

ఎంత మధురము నీ నామం
ఎంత మోహనము నీ రూపం
ఎంత చూచినా తనివి తీరదు
ఎంత భజించిన కాలము చాలదు

ఏడుకొండలా వెంకటేశ్వరా
ఎన్నాళ్ళు వేచేను నిన్ను చూడ నేను
అలసినదయ్యా నా కనుదోయి
అగుపించవయ్యా అలివేలు నాధా

ఏడు కొండలా వెంకటరమణా
సన్నుతింతురా – సంకట హరణా
విడువలేనురా – నీ పదయుగళి
దరిశన మీయరా – నీ దరి చేర్చరా

ఏ జన్మ కర్మో ఈ జన్మలో నేను
ఇడుములలో పడి వేసారుచుంటి
వేడు చుంటిరా – వెంకటరమణా
వేగమె రావా – నా వ్యధ బాప

నిను చూడలేనా – ఈ జన్మలోనా
తిరుమాలవాసా ఓ శ్రీనివాసా
వడ్డికాసులూ నే నివ్వలేనయా
పద దాసి పిలచేనూ కనిపించ రావయ్యా…

ఇంకా ఇలాంటి భక్తి గీతాలు మరిన్ని మన మనసులో భక్తి భావమును పెంచుతాయి.

ఇతర తెలుగురీడ్స్ పోస్టుల రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లను టచ్ లేక క్లిక్ చేయండి.