పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను ఉండేలా చూడవచ్చునా? అసలు పిల్లలకు ఫోను ఎందుకు అందుతుంది? పిల్లలపై ఫోను ప్రభావం ఎలా ఏర్పడుతుంది…? ఈ పోస్టులో కొంచెం వివరించే ప్రయత్నం…

పిల్లలు మొబైల్ ఫోను అందుకుంటున్నారు, అందిస్తున్నారు, అడుకుంటున్నారు. కొన్నిసార్లు ఒక అంశంలో అవి ప్రధానమైనవి అనో, ఇవి ప్రధానమైనవి అనో అనుకుంటూ, కొన్ని ప్రధాన విషయాలుగా దృష్టిపెడుతూ ఉంటాం. అయితే కాలంలో ఒక్కోసారి కొత్తగా వచ్చిన ప్రధాన సమస్యలు మారుతూ ఉంటాయి.

పిల్లలకు ఒకప్పుడు చెడు అలవాట్లు కొన్ని ఉండేవి అనుకుంటే, ఇప్పుడు ఫోను కూడా ఒక అలవాటు అవుతుందా? ఫోను వలన ఉపయోగాలు చాలా ఉంటున్నాయి. అలాగే అనర్ధాలు కూడా ఉంటాయంటున్నారు.
అయితే మన పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోనును మార్చేస్తే? ఎలా…. అదే ఈ పోస్టు ప్రధాన ఉద్దేశ్యం… ఇక చదవండి…

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను
పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

ఉమ్మడికుటుంబంలో పిల్లలను ఆడించడానికి అమ్మతో బాటు మేనమామలు, మేనత్తలు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, బాబయిలు, అన్నయ్యలు… అబ్బో బలమైన బంధువర్గంలో పిల్లలకు అందరూ రక్షకులే. తల్లి రక్షణతో బాటు ఇందరి ఆలనా, పాలనా పిల్లలకు ఉమ్మడి కుటుంబంలో లభిస్తుంది. అయితే ఇది ఒకప్పటి స్థితి.

ఈకాలంలో అంటే ఈ రోజులలో ఉన్న ఊరులోనే బంధువులకు దగ్గరగా ఉండే పరిస్థితి కూడా కొందరికి ఉండకపోవచ్చును. అంటే వృత్తిరిత్యా ఉండాల్సిన ఊరుకు దూరంగా వెళ్లవలసిరావడం వంటివి జరుగుతుంటాయి. ఏదైతేనేమి… ఉమ్మడి కుటుంబంలో ఉండటం అటుంచితే, ఊరికే దూరంగా ఉండే రోజులలో కొందరు ఉంటే, ఎవరి సంసారం వారు చేసుకుంటూ ఉండేవారు కొందరు ఉంటారు.

ఎలాగైతేనేమి? ఇలాగైనా ఎవరి కుటుంబంలో కుటుంబ సభ్యులు వారి కుటుంబంతో కలిసి చిన్న కుటుంబంగానే ఉంటున్నామనుకుంటే, వారి మధ్యలోకి కూడా వచ్చేశాయి. మాధ్యమములు. మాధ్యములు అంటే తెలియనిదేముంది టివిలు, రేడియోలు. వాటిలో వచ్చే కార్యక్రమములపై మనసుకుండే ఆసక్తి వలన అందరితో మాట్లాడేవారు కూడా కొందరితో మాత్రమే మాట్లాడుతూ ఇంట్లో మాధ్యమములు(టివిలు, రేడియోలు) అందించే కార్యక్రమములకు అలవాటు పడ్డారు.

సరే… టివిలు కాసేపు చూసినా ఎవరి చదువు వారు, చదువుకుంటూ, ఎవరి పని వారు చేసుకుంటున్నారులే… అనుకుంటే ఇంకా సౌకర్యంగా ఆసక్తికి హద్దులేకుండా వచ్చేసింది ప్రపంచం ఆరచేతిలోకి.

మొబైల్ ఫోనులు ఇవి స్మార్ట్ ఫోనులుగా మారి ప్రతిమనిషి చేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చి చూపుతున్నాయి. ప్రపంచంలో సంబంధంలేని విషయాలను తెలియజేస్తున్నాయి. అంతేకాదు చేస్తున్న వృత్తికి సంబంధించిన సందేహాలకు సమాధానాలు కూడా అందిస్తున్నాయి. వ్యక్తిగత, వ్యవస్థాగత సందేహాలకు సమాధానాలు కూడా ఆన్ లైన్ ప్రపంచంలో వెతకవచ్చును.

అయితే ఇవి పిల్లలకు అలవాటు అవుతున్నాయి. ఆడుకునే వయస్సులో పిల్లలకు కూడా ఫోన్లు పట్టుకుని ఆడుకుంటున్నారు. ఫిజికల్ గేమ్స్ కన్నా వర్చువల్ గేమ్స్ కే ప్రధాన్యత ఇస్తున్నారు. ఫిజికల్ గేమ్స్ మనసుకు, శరీరమునకు అలసటతో బాటు, ఆరోగ్యమును కూడా తీసుకువస్తాయి. వర్చువల్ గేమ్స్ అంతం ఉండదు, ఆలోచనకు అవగాహనతో పని ఉండదు. కేవలం గెలవడం ప్రధానంగా మనసు మారిపోతుంది.

పిల్లలకు ఫోన్లు అలవాటు చేయడానికి ప్రధాన కారణం బిజి లైఫ్ లో లైఫ్ పార్టనర్స్ ఇద్దరూ ఉండడమే. ఒకప్పుడు చిన్న కుటుంబం అయినా ఒకరు ఇంటి పనికి పరిమితం అయితే మరొకరు బయటి పనికి పరిమితం. కాబట్టి పిల్లలకు తల్లి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు కొన్నిచోట్ల లేక కొన్ని ప్రాంతాలలో అమ్మకు కూడా ఆర్ధిక ఉద్యోగమే.

సాదారణంగా అమ్మపనిలో ఉంటే, పిల్లల ఏడుపు మానడానికి, వారికి ఏదో ఒక ఆట వస్తువు ఇచ్చేవారు. అప్పుడా పిల్లల కాసేపు ఆ వస్తువుతో ఆడుకునేవారు. అయితే కొన్నిసారు ఈ ఆటవస్తువు, స్మార్ట్ ఫోను అవుతూ ఉంటే మాత్రం ఇబ్బంది. ముందు రేడియేషన్ ఇంపాక్ట్ పిల్లలపై చూపుతూ ఉంటుంది. బాగా చిన్న పిల్లలప్పుడు తప్పదు, ఏదో ఒకటి చూసిందే కావాలంటారు. అప్పుడు ఫోను చూస్తే తప్పదు…. ఇవ్వక తప్పదు.

కానీ ఎదిగే కొద్ది పిల్లలకు మొబైల్ ఫోను అలవాటు అవుతుందా? ఇదే ప్రధానమైన ప్రశ్న.

ఎదుగుతున్న పిల్లలకు చూసింది, చూసినట్టుగా కొందరు పట్టుకుంటారు. కొందరు చూసింది చూసినట్టుగా చేసేస్తూ ఉంటారు. కొందరి చూసిందాంట్లోంచి చేయడానికి ప్రయత్నిస్తారు. పిల్లల చూసింది చేయడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నం ఫలించాడానికే ఉంటుంది. కారణం ప్రయత్నం చేయడమనేది పిల్లల వయస్సు నుండే ఆరంభం అవుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు దృష్టిపెడితే, పిల్లలు మంచి విషయాలవైపు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది.


ఎప్పుడైనా చెడు ఎవరూ పరిచయం చేయవసరంలేదు. అదే అందరికీ తెలియబడుతూ ఉంటుంది. ఆకర్షిస్తుంది. చెడగొడుతుంది. కానీ మంచిని మాత్రం పరిచయం చేస్తే సరిపోదు. అది ఆకట్టుకోదు. గుళ్లో దేవుడిలాగా ఉంటుంది. సరిగ్గా దృష్టి పెడితేనే మంచి అలవాటుగా మారి పెరుగుతుంది. లేకపోతే మనసుకు ఆమడదూరంలో ఉంటుంది.

పెరిగే వయస్సులో పిల్లలకు రోల్ మోడల్ తల్లిదండ్రులే, ఆ తర్వాత బంధుమిత్రులు. వీరిలో ఎంతమంది దగ్గరివారు ఏస్థాయిలో హీరోగా ఉంటారో… పిల్లలు ఆ స్థాయిలో లేదా అంతకన్నా ఎక్కువస్థాయిలో హీరోగా మారతారు. ఎందుకంటే ప్రయత్నంతో సాధన ఎప్పుడూ మెరుగ్గానే ఉంటుంది..కదా?

అంటే పిల్లలకు కావాల్సింది… వారి ఆసక్తిని బట్టి వారికి మంచి మంచి కధానాయకులు జీవితంలో కనబడాలి. మానసికంగా కధల రూపంలో కనబడాలి. జీవితంలో అంటే, అమ్మానాన్న, మేనమామ, మేనత్తలు, బాబాయిలు ఉంటారు. మానసికంగా అంటే తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పే కధల రూపంలో ఉంటుంది. ఈస్థితి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చును. మొబైల్ ఫోన్లు ఎప్పుడూ అమ్మమ్మలకు, నాయనమ్మలకు, తాతయ్యలకు పిల్లలను దూరం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది.

ఈ వ్యాసం ఉద్దేశ్యం పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దలు వాడే ఫోన్లలో ఎటువంటి విషయాలు ఉండాలి… అనే భావనతో….

చూసి నేర్చుకోవడం, విని ఊహించుకోవడం అలవాటు అయ్యేది చిన్ననాడే… కాబట్టి పిల్లలకు ధర్మము, దానము, నీతి, దయ, ధైర్యము, సాహసము, ఉపాయం వంటి విషయాలతో కూడిన కధలు తెలియాలి. అటువంటి కధలు కలిగిన వీడియోలు ఎక్కువగా కనబడాలి. ప్రవేటు విషయం ఒక్కటైనా ఫోనులో ఉండకుండా ఉంటే మేలైన విషయం.

ఈ రోజులలో సాంకేతిక పరికరాలు అంటే మొబైల్ ఫోన్లు, టాబ్స్ ఉపయోగించడంలో పిల్లలకు అందెవేసిన చేయి. ఇంకా అవి మూడోకాలుతో ముందుకు వస్తుంటారు.

చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చూసే ఫ్యాషన్, పెంచేటప్పుడు కూడా ఉండాలని అంటారు. మన ఫోను మనపిల్లలకు ఖచ్చితంగా పరిచయం అవుతుంది. అటువంటప్పుడు మన ఫోనులో మంచిని సూచించే విషయాలు ఎక్కువగా ఉండాలి. అప్పుడు మనకు తెలియకుండానే పిల్లలకు మంచి విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

మొబైల్ ఫోను వాడకంలో పిల్లలకు పెద్దగా నేర్పించాల్సిన అవసరం ఉండటం లేదు. చాలా సహజంగా వచ్చేస్తుంది. స్మార్ట్ ఫోను ఉన్న ఇంట్లో దాని వాడుక తెలియని పెద్దలు ఒక్కరైనా ఉంటారేమోకానీ పిల్లలు మాత్రం ఎవరూ ఉండరు. ఖచ్చితంగా స్మార్ట్ ఫోను వాడటంలో ఒక స్టైల్ కూడా కొందరికి వచ్చేస్తూ ఉంటుంది. పెద్దలకే తెలియని ఫీచర్లు పిల్లలు తెలియజేస్తూ ఉంటారు.

అటువంటి టెక్నాలజీ ఉన్న రోజులలో ఎదుగుతున్న పిల్లలకు మన ద్వారా స్మార్ట్ ఫోను అందుతుంది. అలా అందిన మొబైల్ ఫోనులోనుండి ఎటువంటి విషయాలు… పిల్లలకు అందుతున్నాయి? ఇది ఎందుకు చెబుతున్నాను అంటే….

మన వాడుక ఒక హిస్టరీగా ఫోనులో ఉంటుంది… కదా… ఆ హిస్టరీ ఎదుగుతున్న పిల్లలకు కనబడుతుంది… కదా. అప్పుడు వారికి కనబడే హిస్టరీలో ఏ నరేంద్రమోదీగారి గురించి, అటల్ బిహారి వాజ్ పేయి గురించో ఉంటే…. ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా ఏ షకీలా సినిమాల గురించో ఉంటే???

అందుకే ఫోనులో వాడుక ఎలా ఉంటుందో…. ఆ ఫోను చూసిన ఇతరులకు కొంతమేర మన మానసిక స్థితి కూడా చేరుతుంది. కాబట్టి పిల్లలున్న ఇంట్లో మొబైల్ ఫోను వాడుక చాలా ఎరుకతో చేయాలి. అంటే అందరూ ఏదో చెడు విషయాలనే చూస్తారని కాదు…. నేటి కాలంలో ముందుగా ఫోనులో కనబడేవి యాడ్స్… అవి ఎటువంటివి కనబడతాయో మనకు తెలియదు. వాటిని తెలియకుండా క్లిక్ చేస్తే… అదొక హిస్టరీగా మారుతుంది…కదా?

ఒక్కోసారి ఉద్దేశ్యపూర్వకంగా కొందరు ఫోనులో వేరు వేరు విషయాలను చూస్తూ ఉంటారు. కొందరు తెలియకుండా ఏ యాడ్స్ వలననో క్లిక్ చేసేసి, మరలా క్విట్ అవుతారు. మొబైల్ ఫోను పిల్లలకు చేరుతుందంటే, అందులో ఉన్న హిస్టరీ కూడా వారికి చేరుతుంది. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు….

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను
పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

ఫోను ఒకరిది, వాడేది ఒకరు, హిస్టరీ మాత్రం ఫోను ఓనరుదే. అలాగే మొబైల్ ఫోను ద్వారా విషయ సేకరణలో మంచి, చెడుల గమనిక అవసరం. అనవసరం అనుకున్న విషయాలను వెంటనే హిస్టరీ నుండి తొలగించాలి. ఏదైనా ఒక విషయం చూశాకా… ఆవిషయం ఇతరులకు తెలియడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటే, వెంటనే ఆవిషయమును ఫోను హిస్టరీ నుండి తొలగించేయాలి.

తెలిసి, తెలిసి ఆఫీసు ఫోను ఇంట్లో వాడుట కన్నా, ఇంట్లో వాడేఫోను సపరేటుగా ఉంటేనే ఉత్తమం. ఆఫీసు అంటే సవాలక్ష వ్యవహారాలతో జీవితం సాగుతుంది. కాబట్టి ఆఫీసు ఫోను అసలు అందుబాటులో లేకుండానే ఉంటే ఉత్తమంగా ఉంటుంది.

చిన్ని చిన్ని పిల్లలకు ఆట వస్తువుగా ఏదీ ఇచ్చినా ఆడుకుంటారు. ఎదుతున్న పిల్లలు ఊహ తెలిసేకొలది…. వస్తువుల ఎంపికను చూస్తుంటారు. నచ్చిన వస్తువు కోసం పేచి పెడతారు. అటువంటి వస్తువులలో మొబైల్ ఫోను ఉండకుండా ఉంటే మాత్రం… చాలా మంచి విషయం.

ఇక ఫోనులో మనం రక రకాల మొబైల్ యాప్స్ వాడుతూ ఉంటాము. అందులో అనవసరం అనుకున్నాయి, ఎప్పటికప్పుడు తొలగించేయాలి. ఇక ఎప్పుడూ మన సంప్రదాయంలో ఉన్న వివిధ ప్రాంతాల ఆచారాలను బట్టి, ఆయా కుటుంబాలకు సంబంధించిన గొప్ప, గొప్పవారి ఫోటోలు వారి వారి మొబైల్ ఫోన్లలో ఉండాలి. ఎందుకంటే ముందుగా పిల్లలకు మన అనే అభిమానం ఏర్పడుతున్నప్పుడు… మన అనేవారు ఏంచేశారో… ఎంతగొప్ప పనిచేశారో గుర్తిస్తే… ఆగొప్పపని చేయాలనే ఆసక్తి పిల్లలకు కలిగే అవకాశం ఉంటుంది.

అలాగే ప్రాంతాలను బట్టి, ఆచారాలను బట్టి కొందరి గొప్ప గొప్ప నాయకులను పరిచయం చేసే మొబైల్ యాప్స్ కూడా ఉండడం వలన ఎదిగే పిల్లలకు నాయకులు గురించి తెలుస్తుంది. నాయకత్వ లక్షణాలు కనబడే పిల్లలకు గొప్ప గొప్ప నాయకుల జీవితాలు తెలియడం వలన పిల్లలలో మంచి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

సాధన చేయడంపై ప్రత్యేకదృష్టి ఉన్నవారికి…. అంటే ఏదైనా ఒక విషయంలో అత్యంత శ్రద్దాసక్తులు కనబరిచేవారికి ఏ శాస్త్రవేత్తల గురించో తెలిస్తే, పిల్లలకు ఏదైన పరిశోధనా ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా మనం వాడే మొబైల్ ఫోనును కూడా మన పిల్లలకు ప్రాధమిక గురువుగా మనం మార్చేయవచ్చును.

ప్రాధమికంగా పిల్లల మనసులో నిలిచిపోయిన విషయాలు జీవితపర్యంతం గుర్తుకుంటాయని అంటారు. కాబట్టి పిల్లల పెంపకం విషయంలో తీసుకునే జాగ్రత్తలతో బాటు, మనం వాడుతున్న టచ్ ఫోనుతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ టచ్ ఫోను ఒక మిని టీచరుగా మార్చేస్తే, పిల్లలలో ప్రాధమికమైన అవగాహనకు మార్గం ఏర్పడుతుంది.

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను
పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పాఠశాలలో గురువులు వస్తూ ఉంటారు. బోర్డుపై వ్రాస్తూ, పిల్లలకు చెబుతూ వారి సమయం కాగానే మారుతూ ఉంటారు. ఆసక్తి ఉన్నవారికి పాఠాలు బాగా అర్ధం అవుతాయి. ఆసక్తి లేనివారికి అంతగా పాఠాలు అర్ధం కావు.
స్కూళ్ళల్లో పిల్లలకు పాఠాలపే కలిగాల్సిన ఆసక్తిని, స్మార్ట్ ఫోను రూపంలో కలిగిందంటే… ఇక స్కూలులో వారి ఆసక్తి ఏమిటో బయటపడుతుంది. అది ఆటలైతే….ఆటలు. పాటలైతే…పాటలు. లెక్కలైతే…లెక్కలు. సైన్సైతే…సైన్సు. టెక్నాలజీ అయితే….టెక్నాలజీ. ఏదైతే…అది… జీవితానికి పనికి వచ్చేది అయ్యుండాలి అంటారు.

అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి అన్నింటా అనర్ధమే అంటారు. అంటే అదేపనిగా ఒక విషయమే పట్టుకోవడం… ఒక తినుబండారమే అదేపనిగా తింటే, అనారోగ్యం వచ్చినట్టు. ఏదైనా విషయంలో కూడా అదే పని ఆలోచనా…. అదేపనిగా చేస్తూ ఉండడం…. ఇలా అన్ని విషయాలలో సమతుల్యత ఉండాలి కానీ అతి పనికిరాదని అంటారు.

అయితే స్మార్ట్ ఫోనులో మాత్రం అతిగా అలవాటు పడే విషయాలు చేరిక ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటారు. అవి గేమ్స్ అదే పనిగా ఆడటం కావచ్చును. అదేపనిగా వీడియో వాచింగ్ కావచ్చును. అసలు టివి మన సమాజంలో విస్తరించకముందు రోగుల సంఖ్య…. టివిలు వంటి మాధ్యమాల వేగం పెరిగాక పెరిగినా రోగాల సంఖ్య చూసుకుంటే…. మనపై మనకు తెలియకుండానే మాధ్యమాల ప్రభావం ఉంటుంది. అయితే వీటిని మనం పట్టుకోలేదు. మన సమాజంలో ఒక బాగంగా మారాయి.

కాబట్టి వీటితోనే విజ్ఙానం పెంచుకుంటూ మనసుకు అలవాటుగా మారకుండా… మనసుపై నియంత్రణను పెంచుకుంటే…మాత్రం టెక్ యుగంలో మనం విజేతలమే అంటారు. మనతో బాటు ఇంట్లో ఉండే పిల్లలు లేకపోతే పక్కింటి పిల్లలు… మన ఫోను ద్వారా మంచి విషయాలే పిల్లలకు చేరితే, అదే ప్రాధమికంగా వారికి గురువు అవుతుంది.

ప్రధానం… ప్రధానం ఫోను వాడుకలో హిస్టరీ ఏది ఉందనేది… ప్రధానం….

ధన్యవాదాలు తెలుగురీడ్స్