నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.

మంచి మ్యూజిక్ వినడం మొదలు పెట్టిన మనసు, కొంత సమయానికి ఆలోచనల నుండి దూరం అయ్యి స్వస్థతకు వస్తుంది. మ్యూజిక్ చెవులను తాకగానే మనసు విశ్రమించడానికి ఉపక్రమిస్తుంది. మంచి మ్యూజిక్ ఓ మంత్రంలాగా మనసుపై ప్రభావం చూపుతుంది. ఆలోచనలతో సతమతం అయ్యే మనసును, ఆ ఆలోచనల నుండి మళ్ళించడానికి మంచి మ్యూజిక్ ఉపయోగపడుతుంది.

ఈ క్రింది యూట్యూబ్ లైవ్ వీడియో రిలాక్సింగ్ మ్యూజిక్ ప్రసారం చేస్తున్నారు. ప్రకృతి చిత్రాలను చూపుతూ, మనసును ఆకర్షించే మ్యూజిక్ లైవ్ వస్తూ ఉంటుంది. ఈ మ్యూజిక్ వింటూ ఉంటే, మనసు ఆలోచనల నుండి బయటకు వచ్చి, రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది.

https://www.youtube.com/watch?v=WxfpMASC-uM
నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

మనకు నిద్రను దూరం చేసే కారణాలు ఏమి ఉంటాయి? ఆలోచిస్తే ఒత్తిడికి గురయ్యే విధంగానే వేగవంతమైన జీవన విధానంలో పలు కారణాలు కనబడతాయని అంటారు. బోజనం కూడా ప్రశాంతతో చేయకుండా ఏవో విషయాలపై ఆలోచనలతోనో, మాటలతోనో బోజనం చేస్తే, ఏవిషయం గురించి మాట్లాడుతున్నామో, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నామో… ఆ విషయమే మనసును మరింతగా ఆక్రమిస్తుంది. ఆలోచనలను మరింత పెంచుతుంది.

మనతోటివారితో మాటలు, మన మనసులో ఆలోచనలు ఈ రెండూ లేకుండా ఉండడం అసాధ్యం. అయితే ఈ రెండింటిలోనూ ఎటువంటి తరహా ఆలోచనలు, మాటలు సాగుతున్నాయి? ఇదే ప్రధానం… ఒకవేళ మాటలలో చెడుస్వభావం గురించి తలచుకుంటూ ఉంటే, అలాంటి చెడుతలంపులకు మనం అవకాశం ఇచ్చినవారమే కదా..

ముఖ్యంగా మన మాటలు, ఆలోచనలు పాజిటివ్ దృక్పధంతోనే సాగితే మేలు అని అంటారు.

నిద్రకు పోనీ మనసుకు ఆలోచనలు ఆగవు.

  • ఒకప్పుడు మనసు కదిలిపోవడం అంటే, బలమైన కారణం కావాలి. కానీ ఇప్పుడు మనకు నచ్చని అంశంలో వ్యతిరేకంగా ఏదైనా న్యూస్ కనబడవచ్చును. భవిష్యత్తు ప్రమాదం అంటూ ఏదైనా న్యూస్ రావచ్చును. లేదా ఏదైనా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందవచ్చును. ఇలా చేతిలో ఉంటే స్మార్ట్ ఫోను మన ఆలోచనలు ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా ఆలోచనలను పెంచేవిధంగానే స్మార్ట్ ఫోను ఉంటుంది.
  • మనసులో ఏదో బలమైన కోరిక కోసం ఎక్కువ ఆలోచనలు రావడం.
  • వాదులాటలో పాల్గొనడం వలన కదిలిన మనసు స్వస్థతకు రావడం సమయం తీసుకుంటుంది.
  • తగాదా పడిన మనిషి మనసు కూడా వ్యగ్రతను పొంది ఉంటుంది. కొనసాగింపుగా ఆలోచనలు సాగితే, మరింత వ్యగ్రతకు గురి అయ్యే అవకాశం ఉంటుంది.
  • అనుకోకుండా నోరు జారడం.. ఇది అప్పుడప్పుడు కొందరికీ ఎదురయ్యే సమస్య. మాట్లాడుతూ ఉండగానే ఎదుటివారి మనసు నొప్పించేవిధంగా ఏదో ఒక మాట నోటి నుండి వచ్చేస్తుంది.
  • పని ఒత్తిడి, వస్తువు వలన ఒత్తిడి, అనుకోని ప్రవర్తనతో ఒత్తిడి… ఏదో ఒక విధంగా మనిషి మైండులో ఆలోచనలు పెరిగే విధంగా నేటి సమాజం తయారయ్యిందనేది కొందరి నిపుణుల మాట.
https://www.youtube.com/watch?v=iVLji2zdLM4
నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

ఇలా మనిషి నేటి సమాజంలో ఏదో ఒక రకమైన బలమైన కారణం కానీ లేక చిన్నపాటి విషయాలకు చలించే సున్నితమైన మనస్తత్వం లేక దీర్ఘకాలికంగా ఏదో ఒక సమస్య ఉండడం లేక ఎవరో ఒకరితో శత్రు భావన బలపడడం… మనిషి తనను తాను గమనించుకుని ఉండకపోతే, ఎక్కువ ఆలోచనలు పుట్టడానికి, పెరిగి ఒత్తిడిగా మారడానికి చాలా తక్కువ సమయమే పడుతుందని అంటారు.

మనిషి ఎంతటి ఒత్తిడిని అయినా జయించవచ్చును.

అదే మనిషి ఎంతటి ఒత్తిడిని అయినా జయించవచ్చును. ఎంతటి అసాధ్యమైన సాధించవచ్చును. కేవలం ఓపిక అనే గుణంతో విజయం సాధించవచ్చును. గాంధీజీ ఓపిక పట్టడం వలన ఎక్కువమంది స్వాతంత్ర్యపోరాట యోధులు ఏకం కాగలిగారు. యావత్తు దేశం ఒక్కతాటిపైకి రావడానికి గాంధీజీ కారణం కాగలిగారు. అంటే అసాధ్యం అంటూ ఏది ఉండని ఈ ప్రపంచంలో మన మనసును మనం ఒత్తిడి నుండి దూరం ఎందుకు చేయలేం. ఖచ్చితంగా ఒత్తిడిని జయించవచ్చును.

https://www.youtube.com/watch?v=5qap5aO4i9A
నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

ఎటువంటి మనిషి అయినా ఒత్తిడిని జయించడానికి, తనను తాను నియంత్రించుకోవాలి. అందుకు మనసుకు తనపై తనకు పరిశీలన అవసరం. తనను తాను పరిశీలన చేసుకోవడం ఒక మంచి స్నేహితుడి మాటలలో అర్దం అవుతుంది. మంచి మనోవిజ్ఙానం ఉన్న బుక్ వలన అవుతంది. పురాణ విజ్ఙానం మనసు గురించి, దాని క్రమం గురించి వివరిస్తాయి.

బౌతికంగా చూస్తే మనిషి శరీరమునకు తగినంత శ్రమ ఉంటే, అలసిపోయిన మనసు, శరీరము రెండూ విశ్రాంతిని కోరుకుంటాయి. మానసికంగా బలంగా ఉండడమంటే, తను జీవిస్తున్న పరిసరాల గురించిన పరిజ్ఙానం సరిగ్గా ఉండడం ప్రధానం.

తన చుట్టూ ఉండే పరిస్థితులపై అవగాహన ఉంటే, ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో ఒక అవగాహన ఉంటుంది. ఎప్పుడు ఎవరికీ ఏ అవసరం పడుతుందో కూడా అవగాహన ఉంటుంది. తద్వారా తన చుట్టూ పరిస్థితులలో తను మెరుగైన ప్రవర్తనను చూపించవచ్చును.

తన గురించి, తన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి సరైన అవగాహన ఉన్నవారికి ఆకస్మికంగా సమస్యలు అంతగా ఉండవు. ఇంకా తన ఆరోగ్య పరిస్థితి, తన ఆర్ధిక పరిస్థితిని గురించి కూడా ఖచ్చితమైన ఆలోచన ఉన్నవారికి సమస్యలు తక్కువగానే ఉంటాయి. వార అంతగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉండదు.

https://www.youtube.com/watch?v=ql4S8z1jW8I

నిద్రపట్టకపోవడానికి అనేక కారణాలు వెతికే మనసు, నిద్రపోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందనే ఆలోచనను చేయదు. ముందుగా నిద్ర అవసరం తెలియకపోతే, నిద్రకు ప్రధాన్యతను తగ్గించడ స్వయంకృతం అవుతుంది. నిద్ర శరీరమునకు, మనసు కూడా ఆరోగ్యం…అయితే అది నిర్ధేశింపడిని రాత్రి వేళల్లో… పగటి నిద్ర పనికి చేటు.

https://www.youtube.com/watch?v=UnzWpQ63siQ

రాత్రి పూట హాయిగా నిద్రపోవడానికి మనసు సమాయత్తం కాకపోతే… మంత్రంలాంటి మాటలు, మంత్రం లాంటి మ్యూజిక్ వినడమే మార్గం. ఇక మంత్రలాంటి మ్యూజిక్ అంటే యూట్యూబ్ వీడియోలలో లభిస్తాయి. పై వీడియోలు అన్నీ మ్యూజిక్ అందించే వీడియోలు…

మంత్రంలాంటి మాటలతో మన మనసు ఆలోచనల నుండి బయటకు వచ్చేస్తుంది. మనసు శాంతికి దగ్గరగా వస్తుంది. శాంతించిన మనసు విశ్రమించడానికి ఎంతో సమయం తీసుకోదు. అలా మంత్రం లాంటి మాటలు మంచి మిత్రుని వద్ద లభిస్తాయి. అమ్మానాన్న దగ్గర లభిస్తాయి. గురువులు మాటలలో ఉంటాయి.

https://www.youtube.com/watch?v=J0G77qg3Odk