నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్. తెలుగు నవలలు ఖాళీ సమయంలో కాలక్షేపమునకు ఉపయోగపడతాయి. వివిధ స్వభావాల ప్రవర్తనలు, వివిధ వ్యక్తుల మనస్తత్వం గురించి మానసికంగా పరిచయం ఏర్పడుతుంది. నవలలు రీడర్ మైండులో ఊహాత్మకంగా స్టోరీని సృష్టిస్తాయి.

సమాజంలో ఉండే వివిధ రకాల స్వభావముల పరిచయం మనకు ఊహాత్మకంగా జరుగుతుంది. రచయితలు విభిన్నమైన స్వభావములు గల వ్యక్తుల ప్రవర్తనను నవలలో మనకు అక్షరరూపంలో పరిచయం చేస్తూ ఉంటారు. చిత్రమైన స్వభావములు, చిత్రమైన కోరికలు నవలలో వ్యక్తుల ప్రవర్తనలో మన మనసులో కనబడతాయి.

వివిధ రచయితల నవలలు మనకు పుస్తక రూపంలో ఉంటాయి. కొన్ని నవలలు మనకు ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. పిడిఎఫ్ బుక్ రూపంలో ఉండే ఈ నవలలను డౌన్ లోడ్ చేసుకుని చదవవచ్చును.

తెలుగు రొమాంటిక్ నవలలు పిడిఎఫ్ బుక్స్

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్
  సంకెళ్ళు జీవితాన్ని చుట్టేసిన ముళ్ళు-రూసో ఒక్కడే వీటిని తెంచగలడు - సోషల్ కాంటాక్ట్ వల్లే ఈ పరువు మర్యాదలు, వంశప్రతిష్టలు, నైతికానైతిక మీమాంసలు-వీటన్నిటినీ బద్దలు కొట్టగలగాలి.

అనుభూతి ఒక్కటే ముఖ్యం - జాన్ లాక్ చెప్పింది అదే గదా- గోనె సంచిలో కుట్టేసినట్లు ఊపిరాడదు- కవాటాలేవీ తెరుచుకోవు-ప్రతీ క్షణం ఏమీ తోచకపోవడం మెదడులో కాంక్రీట్ ని పోస్తుంది.

అందుకే గుండె వికసించక ముందే వాడిపోతుంది- ఎంత నెత్తురు పోసినా అది విచ్చుకోవడం లేదు- జీవితం అర్ధరహితం- ప్రపంచం అంతకంటే నిరర్ధకం-మనిషి ఎప్పుడూ ఏకాకి - ఎవరూ తోడుండరు-

ఇదంతా  స్వయంకృతాపరాధం- అసలు నాకేం కావాలి? అది తెలిసిపోతే జీవితానికి అర్ధం తెలిసిపోవును. చివరికి మిగిలేది అదే.

బుచ్చిబాబులాగా మనమూ కొన్ని ఊహిస్తే బావుంటుంది. మనకవులు, రచయితలూ స్వర్గానికి వెళ్ళగానే మొదట ఏం మాట్లాడారో ఆలోచిద్దాం.

కందుకూరి వీరేశలింగం "ఒక్క వితంతువూ కనపడడం లేదే" - గురజాడ "యాంటీనాచ్ ఉద్యమం ఇక్కడా తప్పేటట్లు లేదు" - చలం "శచీదేవి. ద్వారపాలకుడు ఎటెళ్ళారు?" - విశ్వనాథ "మంచి లేఖకుడు కావాలి"- ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక నొక్కండి.
నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

 అప్పుడు టైమ్ పదైంది.  

    రాత్రి బ్యాగ్ లో ఆ టౌన్ ను సర్ది వెన్నెల జిప్ వేసేసినట్టు చాలా భాగం చీకటిగా వుంది. అక్కడక్కడా మాత్రం వెలుగు చారికలు కనపడుతున్నాయి. వూరంతా తిరిగి, తిరిగి కాళ్ళు నొప్పిపెడుతున్నట్లు గాలి మెల్లగా వీస్తోంది.
    
    ఆమె వంటిల్లంతా సర్ది బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టింది.    

    ఆ అలికిడికి అటు తిరిగి పడుకున్న అతను ఇటుతల తిప్పాడు.
    లేత పసుపు పచ్చటి ట్రాన్స్ పరెంట్ నైటీలోంచి కనపడుతున్న ఆమె వంపు సొంపులు అతని కళ్ళలో మరో దృశ్యాన్ని అచ్చొత్తుతున్నాయి.
    
    ఆమె జుట్టు ముడివిప్పింది. వర్షం బరువుకి తాళలేని ఓ నీలం మబ్బుతునక ఒళ్ళు విరుచుకుంది. ఆమె తన కళ్ళను సాగదీసింది. కెరటాల ధాటికి ఏమరుపాటుతో ఒడ్డుకి కొట్టుకొచ్చిన రెండు చేప పిల్లలు తిరిగి నీట్లోకి వచ్చి పడ్డాయి. ఆమె ఎద కదిలేటట్టు ఆవుళించింది. పెద్ద కడవలలోని పెరుగును చిలగ్గా వచ్చిన వెన్న రెండు ముద్దలై పోయింది. ఆమె నడుం చిన్నగా కదిలింది. అంతవరకు విశాలంగా పరుచుకున్న నది సన్నటి పయలాగా చీలింది. బొడ్డు నీటి నైటీని తూటు పెట్టుకుని చూస్తోంది. గంగోత్రిలా నాలుగువైపుల నుండి వస్తున్న నీటి తాకిడికి ఎటూ పోలేని కాగితపు పడవ నిలిచిపోయింది.
    ఆ తర్వాత కిందకి దిగడానికి లైట్ షేడ్ అడ్డొస్తోంది అతనికి.
    
    పెర్ ఫ్యూమ్ కు బదులు సెక్సీతనాన్ని స్ప్రే చేసుకున్నట్టు మెరిసిపోతున్న ఆమె మెల్లగా నడిచి బెడ్ దగ్గరికి వచ్చింది.
    
    ఆమె అంత ఎగ్జయిటింగ్ గా వున్నా ఏమీ ఆసక్తి కలగకపోవడంతో అతను అటు తిరిగి పడుకున్నాడు. ఆమె ఇటు తిరిగి పడుకుంది.
  ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక నొక్కండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

“చెల్లీ! ఇది దుర్మార్గపు లోకం
బతుకంటే తీరని శోకం…..”
ఆపాట జైలంతా ప్రతి ధ్వనిస్తోంది. ప్రతి ఖైదీ గతాన్ని తట్టి లేపుతోంది.
ఓ ముసలి ఖైదీ ఆపాట పాడుతున్నాడు. బతికున్నందుకే సిగ్గుపడే మనిషి పాట పాడితే ఎలా వుంటుందో ఆ పాట అలా వుంది ఆయన గొంతులోని విరక్తీ, వేదనా రాత్రికి మరింత గాఢత్వాన్ని పులుముతున్నాయి. ఆత్మీయులకు దూరంగా, తమకు తామే భారంగా వున్న ఖైదీలకు ఆపాట వూరట కలిగిస్తోంది. జీవన పోరాటంలో ఓడిపోయిన వాళ్ళను సేద తీరుస్తోంది. ప్రేమతో కన్నీళ్ళను తుడుస్తోంది.
ఆంజనేయులు పదకొండో నెంబర్ సింగిల్ సెల్లో పడుకుని వున్నాడు. అతని కళ్ళు మించవు. కానీ అతనికి వ్యతిరేకంగా కుట్ర జరుపుతున్నట్టు అక్కడక్కడా వెంట్రుకలు తెల్లపడ్డాయి. కండలన్నీ జారిపోయి మొత్తం శరీరంమంతా లూజుగా కొలత తక్కువున్న బస్తాలా వుంది కలలుకని బక్కచిక్కిన కళ్ళు ఆరిపోవడానికి సిద్దంగా వున్న ప్రమిదల్లా వున్నాయి నుదురంతా గీతలు పడడం వల్ల అతనిముఖం కురచగా కనిపిస్తోంది. మాసిపోయిన జైలు యూని ఫారమ్ దుమ్ముతో నేసినట్టుంది.
ముసలి ఖైదీపాట అతనిలో దూరి రక్తాన్ని జిలకొడుతుంది. తన ఒంటరి బ్రతుకునీ, తన దురదృష్టాన్ని పాట ఎత్తి చూపిస్తుంటే గుండెల్లో మంట రక్తప్రసరణకు అడ్డుతగుల్తోంది. అతని కళ్ళు నీటిపొరతో వుబ్బివికారంగా వున్నాయి.
పాటతోపాటు అతని ఆలోచనలు ఆగదిలో సుళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా చదవడానికి చిత్రం తాకండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

మేర్లపాక మురళి రచించిన అతడు ఆమెను జయించాడు నవల రొమాంటిక్ స్టోరీగా ఉంటుంది. స్త్రీ, పురుషుల మద్య కలిగే ఆసక్తిని రొమాంటిక్ గా మనకు అక్షరరూపంలో ఉంటుంది. ఈ నవలను డౌన్ లోడ్ చేయడానికి ప్రక్క చిత్రముపై టచ్ లేక క్లిక్ చేయండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

శృంగారపురం ఒక కిలోమీటర్ తెలుగు నవలా బుక్ రచయిత మేర్లపాక మురళి.

 వర్షకి మెలకువ వచ్చింది.

    పడక  మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి  గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్ లైట్ వెలుగుతోంది.

    రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ గా ఫీలయింది.

    పక్కకు తిరిగి చూస్తే టైమ్ పీస్  అయిదు గంటలను చూపిస్తోంది. కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్నా తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది. ఇంకా చదవడానికి చిత్రం తాకండి లేక నొక్కండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

కలగంటినే చెలీ తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి.

సాయంకాలమైంది, కృష్ణుడి అనుభవం దృష్ట్యా గయుడు భూమిమీద కాకుండా ఆకాశంలో తన తాంబూలవు ఎంగిలి ఊసినట్లు పడమటి ఆకాశం ఎర్రగా వుంది.
లోకంమీద రాత్రి వాలడానికి వీలుగా మొత్తం ప్రపంచాన్నంతా శుభ్రం చేస్తున్నట్టు గాలి వీస్తోంది. రామాపురం ఆ సాయం సంధ్యలో దేవతలు వేసిన సెట్టింగ్ లా వుంది. రామాపురం అని సింపుల్ పేరున్న ఆ ఊరు కాస్త పెద్దదే. వేయి గడపలుంటాయి. కోడిచుట్టూ దానిపిల్లలు చేరినట్టు దానికి చుట్టూ చిన్న గ్రామాలు నాలుగుదాకా వున్నాయి.

ఉమ్మడి కుటుంబంలా అవి కూడా రామాపురం పంచాయితీలోనే వుంటాయి. ఇంకా చదవడానికి చిత్రం తాకండి లేక నొక్కండి

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

 కాబోయే శ్రీమతికి ‘చెక్’ చెప్పబోతున్నాను. మరి రాణీగారు ఎటు అడుగువేస్తారో, తనను ఎలా రక్షించుకుంటారో చూడాలి.

    ఈ ప్రేమ చదరంగంలో నేను సక్సెస్ అయితే నా కౌగిట్లో కీర్తి. అలా అనుకోవడంతోనే టెన్షన్ మొదలైంది నాలో.

    పెళ్ళికి ముందే ‘తొలిరేయి’ గడపడానికి అన్ని పరిస్థితులూ అనుకూలంగా వున్నాయి, ఒక్క రాణీగారు తప్ప.

    నా ప్రమేయం ఏమీ లేకుండానే పరిస్థితులు అలా కలిసొచ్చాయని తను భ్రమించేటట్టు చేసుకోవాలి. ఎక్కడా ఏ పొరబాటూ జరగకూడదు. బంటుల్ని పక్కకు తప్పించేసి, గుర్రాలకు కళ్ళెంవేసి, ఏనుగులను కట్టెయ్యాలి. రాణీగారి మంత్రి అయిన ‘నిగ్రహాన్ని’ దెబ్బతీయగలిగితే చాలు కీర్తి నా కౌగిట్లో వుంటుంది.

    రాత్రే మాకు చదరంగం బల్ల, మనోనిబ్బరం, ధైర్యం, ఎథిక్స్, లాజికల్ థింకింగ్ … ఇవే మా పావులు. వీటిని చిత్తుచేసి కీర్తిని దక్కించుకోవాలి. ఇం చదవడానికి చిత్రం తాకండి

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

 ఆకాశంలో సూర్యుడు నిప్పుల పళ్ళెంలా తన ప్రతాపం చూపిస్తున్నాడు. గాలిని ఎవరో కొలిమిలో కాచి సాగదీసి పంపిస్తున్నట్టు వేడిగా వీస్తోంది. నీడను వెదుక్కోడానికి ఎటూ వెళ్ళలేని కొండలు గింజుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి.

    దశరధరామయ్య ఇక అడుగు వేయలేకపోయాడు. చుట్టూ చూశాడు. రోడ్డు పక్కన ఏదో పేరు తెలీని ముళ్ళు చెట్టు ఒంటరిగా తనలో తానే ముడుచుకు పోయినట్టు కాస్తంత నీడను ప్రసరిస్తోంది.

    ఆయన అటువేపుకు నడిచాడు. అంతవరకూ తండ్రి చిటికిన వేలు పట్టుకుని నడుస్తున్న ఆయన కొడుకు కూడా కదిలాడు. ఇంకా చదవడానికి చిత్రం తాకండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

చీకటికి అవతల తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి.

సాయంకాలం ఆరయింది. కడుపాత్రం కోసం కొరడాలతో అదే పనిగా కొట్టుకుని ఒళ్ళంతా కమిలిపోయిన భిక్షగాడిలా వున్నసూర్యుడు పడమటి కొండల్లోని తన ఇంట్లోకి చొరబడుతున్నాడు. సాయంసంధ్య రాత్రి డయాస్ మీద ఎక్కి ‘షో’ఇవ్వనున్న రికార్డింగ్ డ్యాన్సర్ లా షోగ్గా వుంది.

పగటి వేషగాళ్ళ వెనుక జోలె పట్టుకుని నెమ్మదిగా కదులుతున్న దానిలా గాలి సోమరిలా వీస్తోంది. అంతవరకు ఎండ తీవ్రతకు భయపడ్డ జనం అప్పుడే వీధుల్లోకి వస్తున్నారు.

ఆ నగరంలోకెల్లా అతి ఖరీదైన ప్రాంతం అది. దాని పేరు లవ్లీ హిల్స్. నల్లడబ్బుకి అంత అందం, అంత హుందాతనం వుంటుందని అక్కడున్న ఇళ్ళను చూస్తే తెలుస్తుంది. ఒక్కో ఇల్లు కోటికి తక్కువగా వుండదు. సామాన్యుడు ఎప్పుడూ చూడలేని విధంగా, మధ్యతరగతివాడు ఎప్పుడూ ఊహించుకోలేనంత ఖరీదుగా వుంటుంది ఆ ప్రాంతం. ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక నొక్కండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

ఇట్లు నీ చిలక తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి.

ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆకాశంలో చంద్రుడు బాగా పేరిన గడ్డపెరుగు గిన్నెలా వున్నాడు. నవంబరు నెల కావడంతో అప్పుడప్పుడే చలి లోకప్రవేశం చేసినట్టుంది. తనతోపాటు చల్లదనం వచ్చి చేరడంతో గాలి బరువుగా వీస్తోంది.

అక్కడక్కడ వున్న నక్షత్రాలు కాశీమజిలీ కథలు చెప్పుకుంటున్నట్టు పక్కపక్కన జేరి మెరుస్తున్నాయి వెన్నెలను గంధంలా ఒంటికి రాసుకోవడానికి చెట్లు మరింత విప్పారినట్టు కనిపిస్తున్నాయి.

రాత్రి పదిగంటలవుతూ వుండడం వల్ల గోపాలపురం అనబడే ఆ ఊర్లో జనం పడుకోవడానికి దుప్పట్లు, చాపలు సర్దుకుంటున్నారు. అప్పటి వరకు శృంగార కథలకు నిలయాలైన వీధి అరుగులు ఖాళీ అవుతున్నాయి. కబుర్లు అటకెక్కి అలుపు తీర్చుకుంటున్నాయి.

అంతవరకు నిద్ర నటించిన ఇందుమతి మెల్లగా కళ్ళు విప్పింది. పెద్ద అడ్డాపిల్లు అది. దానికి ముందు కొబ్బరికాయకు పీచు వదిలేసినట్టు వసారా వుంది. అందులో ఆమె పడుకుని వుంది. ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక నొక్కండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

మగ బుద్ది తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి.

ఉదయం ఆరుగంటలు. రామాలయంలోని గ్రామ్ ఫోన్ సుప్రభాతాన్ని ఆలపిస్తోంది. నీళ్ళ కొళాయిల దగ్గర ఆడవాళ్ళు. సిగలు పట్టుకోవడానికి తయారవుతున్నారు. పసిపిల్లలు వీధి ప్రక్కనజేరి రకరకాల ఆటల్లో మునిగిపోయారు.

ఇందిరానగర్ కాలనీ మెల్లగా మేల్కొంటోంది. సుప్రభాతం చెవులను గెలకడంతో మెలకువ వచ్చింది నరేష్ కు.

మామూలుగా అయితే మరోగంటసేపు తన జీవితాన్ని తిట్టుకుంటూ పడకమీద దొర్లుతుండేవాడు. కానీ ఆ రోజు స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీలో ఇంటర్వ్యూ వుందని గుర్తుకు రావడంతో లేచి కూర్చున్నాడు.
చుట్టూ చూశాడు.

ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక క్లిక్ చేయండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

పగలే వెన్నెల తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి.

అక్కడెక్కడో దూరంగా వున్న లోకాల నుంచి ఆకాశపుటొడ్డుకు కొట్టుకొచ్చిన గవ్వలా వున్నాడు చంద్రుడు. ఎండకు భయపడి అప్పటి వరకు కాలు బయటపెట్టని గాలి అప్పుడే షికారుకు బయల్దేరినట్టు చల్లగా తగుల్తోంది.

మల్లెపూలు వేసుకున్న పైటను ఎవరో ఆకతాయి లాగేసినట్టు ఆ ప్రదేశమంతా సువాసనలు చుట్టుమడుతున్నాయి.

అక్కడక్కడా విసిరేసినట్టున్న పెంకుటిళ్లు భూదేవి తన పాదాలకు రాసుకున్న గోరింటాకు లతల్లా వున్నాయి. ఇళ్లమధ్య వున్న రహదారి వెన్నెల్లో వెండిపట్టీలా మెరుస్తోంది.

సురేష్ వర్మ మెల్లగా ఆ దారంట నడుస్తున్నాడు. క్ర్గీగంట పరిసరాల్ని గమనిస్తున్నాడు. ఆ వాకిట్లో నిలబడి వుందెవరు? జయంతనుకుంటా – వెన్నెల్లో గోధుమ చేలమధ్యన నిలబడ్డట్టుంది ఆమెను చూస్తుంటే.

బాగా మరగకాచిన పాలరంగు ఆమెది. ఒడ్డూపొడుగుతో మగాడి కేదో సవాల్ విసిరినట్టుంటుంది. అంత భారీమనిషితో పడకటింట్లో యుద్దం చేయడానికి ఆమె భర్త వెంకటేశ్వర్లు ఎంత కష్టపడుతున్నాడో? ఆత్మ విశ్వాసం కాబోలు రోజూ సాయంకాలమైతే కల్లుకొట్టు దగ్గరుంటాడు.

ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక నొక్కండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

రారా మా ఇంటిదాకా తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి.

బెడ్ రూమ్ లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ- అలాగని ఎవరన్నది?

ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్.

తనని ఇప్పుడు ఎవరైనా హిప్నటైజ్ చేసి, ట్రాన్స్ లోకి నెట్టేస్తే- ఏమడిగినా తనుచెప్పబోయేది ఒక పేరే- సు...జ....న....మనసులోని మూడు అరల్లోనూ నిండిపోయి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తున్న జీవి.

జీవితంలో ఇప్పటికే రెండక్షరాలను ఆక్రమించుకున్న ఆ 'జీవి'తో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతే మొత్తం వామనదేవుడిలా ఆక్రమించేసుకుంటుంది.

వామనదేవుడు పుంలింగం కదా - మరి స్త్రీ లింగం వామనదేవి కాబోలు. ఈ లింగభేదం స్త్రీలను ఎంత హీనస్థితిలోకి నెట్టేసింది - సిమోన్ దిబోవర్లూ, కౌత్ మిల్లెట్ లూ - ఇంకా ఎందరు పుడితే ఈ పురుష ప్రపంచం మారుతుంది? లేకుంటే తన మామ, కూతురిమీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్ నైట్ కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా!

ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక నొక్కం

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

అనాధ మహిళా సదన్ తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి.

 ప్లేటో ప్రేమపాత్రుడే, కానీ సత్యం ఇంకా ప్రేమ పాత్రమైంది. అరిస్టాటిల్ శిష్యుడై వుండి అలెగ్జాండర్ ఎందుకంత యుద్ధోన్మాది అయ్యాడు? ఈగోని సంతృప్తిపరచడానికి యూరప్ నుంచి ఆర్యావర్తనం వరకు యుద్ధాలుచేయాలా?

    సంఘం శరణం గచ్ఛామి – బౌద్ధమతానికి పూర్వం నుండీ లోకాయుత వుంది. చార్వాకుల్ని నిలువునా కాల్చేసినా నాస్తికత్వం ఎక్కడికి పోతుంది? భోగలాలసత ముద్రవేసి పుస్తకాలన్నిటినీ తగులబెట్టారు. చాలామందికి ఆనందాన్ని ఇచ్చేది ‘లాక్’నీతి. నైతిక సమస్యతో నిమిత్తం లేనిది ఒక్కటే – అది కల.

    ఫ్రాయిడ్ ఇంట్రడెక్టరీ లెక్చర్స్ ఆన్ సైకో అనాలసిస్ పుస్తకాన్ని ఎక్కడయినా సంపాదించి చదవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ ఫోర్స్ అయితే మరి డబ్బో!! స్లీవర్ లో షెరాన్ స్టోన్ రూపంలో కైపెక్కిన సుఖం. హోటల్ లో అంతమంది ముందు ప్రియుడు అడగగానే అందరి కళ్ళలోనూ కారం కొట్టి తన లోదుస్తుల్ని తీసిచ్చిన జాణతనం, బుసలుకొట్టే వేడి నిట్టూర్పులతో థియేటర్ పేలిపోతుందేమోనన్న అనుమానం.

    థియేటర్ ఆఫ్ ఆబ్సర్డ్ – ఐశ్వర్యారాయ్ తో సన్ సిటీలో ‘అందం – క్షణికం’ అన్న టాపిక్ మీద మాట్లాడటం, బ్రూనో రాజుతో చర్చించడం – అన్నీ జీవితంలో సహా అసంబద్ధాలే.  బెడ్ లేకపోవడంవల్ల నిద్రాదేవి రావడం లేదు. సెల్ స్టియల్ బెడ్ మీద లేడు ఛాటర్లీస్ లవర్.

    ఒక మనిషికి తన జీవితకాలంలో నాలుగువేలసార్లు సెక్స్ లో పాల్గొనే సామర్థ్యం వుంటుందట. వింటూనే ఇంత తక్కువా అనిపించింది. కానీ లెక్కవేస్తే కరెక్టేననిపించింది.

ఇంకా చదవడానికి చిత్రంపై తాకండి లేక నొక్కండి.

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

రంగులవల తెలుగు రొమాంటిక్ నవలను రచించింది మేర్లపాక మురళి. ఈ తెలుగు నవలా పుస్తకం పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయడానికి ఈ ప్రక్క చిత్రంపై టచ్ లేక క్లిక్ చేయండి.

గంగ తెలుగు నవలను రచించింది యార్లగడ్డ సరోజినీదేవ. ఈ తెలుగు నవలా పుస్తకం పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయడానికి ఈ ప్రక్క చిత్రంపై టచ్ లేక క్లిక్ చేయండి.

ఇంకా అప్డేట్ చేయబడతాయి..