నక్షత్రములు పాదములు మొదటి అక్షరం

చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పుట్టిన సమయం బట్టి ఉన్న చూసేవి. నక్షత్రములు పాదములు బట్టి మొదటి అక్షరం ఏమిటి అనేది.

27 నక్షత్రములు 108 పాదములు ఎవరు పుట్టినా ఈ 108 పాదములలోకి వస్తారు. పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, నక్షత్రం యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం నిర్ణయిస్తూ ఉంటారు.

ఈ క్రింది నక్షత్రముల జాబితాలో ప్రతి నక్షత్రమునకు ఎదురుగా నాలుగు అక్షరములు గలవు. అంటే పాదమునకు ఒక అక్షరము గలదు. నాలుగు పాదముల గల నక్షత్రములకు నాలుగు అక్షరములుగా నిర్ణయించబడి ఉన్నవి.

పాప పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం బట్టి, నక్షత్రము యొక్క పాదమును బట్టి పేరులో మొదటి అక్షరం ఉండేలా చూస్తారు.

అశ్విని – చూచెచౌల,

భరణి – లీలూలేలో,

కృత్తిక – అఇఉఎ,

రోహిణి – ఓవావీవు,

మృగశిర – వేవోకాకి,

ఆరుద్ర – కూఘంఙచ్ఛ,

పునర్వసు – కేకోహహి,

పుష్యమి – హూహేహోడ,

ఆశ్లేష – డీడూడేడో,

మఖ – మామీమూమే,

పుబ్బ – మోటాటీటు,

ఉత్తర – టేటోపాపి,

హస్త – పూషణాఢ,

చిత్త – పేపోరారి,

స్వాతి – రూరేరోత,

విశాఖ – తీతుతేతో,

అనురాధ – నానీనూనె,

జ్యేష్ఠ – నోయాయియు,

మూల – యేయోబాబి,

పూర్వాషాఢ – బుధబాఢ,

ఉత్తరాషాఢ – బేబోజాజి,

శ్రవణం – జూజేజోఖ,

ధనిష్ఠ – గాగీగూగే,

శతభిషం – గోసాసీసు,

పూర్వాభాద్ర – సేసోదాది,

ఉత్తరాభాద్ర – దుశ్చంఛాథ,

రేవతి – దేదోచాచి.

ఉదాహరణకు పాపాయి పుట్టిన సమయం బట్టి ధనిష్ఠ నక్షత్రం మొదటి పాదం వచ్చిందనుకోండి. పేరులో మొదటి అక్షరం బట్టి గణేష్, గంగాధర్ వంటి పేర్లను చూస్తూ ఉంటారు.

అంతేకాకుండా గ పేరుతో ప్రారంభించినా దానికి తోడు ఇంకా ఏదైనా పేర్లు కూడా కలిపి పెడుతూ ఉంటారు. అయితే కొందరు నామనక్షత్రం, జన్మనక్షత్రం, మాసం, వారం వంటివి కూడా మొదటి అక్షరమును సూచిస్తారు.

ఈ విషయంలో దగ్గరలో ఉన్న బ్రాహ్మణులను అడగడం చాలా చాలా శ్రేయష్కరం. ఎందుకంటే పేరులో పలికే మొదటి అక్షరం పిల్లవాని భవిష్యత్తుపై ఎంతోకొంత ఫలితం చూపుతుందని అంటారు.

కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉండాలనేది మాత్రం ఇంటి పురోహితుడిని అడగాలి. వారు సూచించిన అక్షరాలను బట్టి ఆపేరుకు తోడుగా పేర్లు ఎంచుకోవచ్చును.

మీరు కనుక బ్రాహ్మణుల సూచించిన అక్షరం బట్టి చిన్న పిల్లల పేర్లు వెతకాలంటే ఈ క్రింది మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.

లేదా మీరు ఈ వెబ్ సైటులో గల మెను పేజిలో గల అచ్చతెలుగులో పిల్లల పేర్లు బాయ్ నేమ్స్ అనే పేజిని ఓపెన్ చేయండి. బాలిక పేరుకోసం అయితే అచ్చ తెలుగులో బాలిక పేర్లు పేజిని ఓపెన్ చేయండి.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్