దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్

దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్
దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్

వెలుగు ఇచ్చే దీపం సైజు చిన్నదే కానీ దాని వెలుతురు గదంతా వెదజల్లుతుంది. దీపం వెలుగు ఇచ్చినట్టే, జీవితం కూడా మరొక జీవితానికి దారి చూపుతుంది. మానవ జీవన మనుగడ అంతా ఒకరు మరొకరితో జతకట్టి ధర్మబద్దంగా జీవిస్తూ మరొక ధార్మిక జీవితానికి పునాది వేస్తూ… తమ జీవిన ప్రయాణం మోక్షపదానికి చేరడమే మనుజుని లక్ష్యం అయితే అటువంటి జీవన ప్రయాణానికి దారి చూపించే వెలుగు మనిషిలో ఉండే చైతన్యమంటారు.

అటువంటి చైతన్యమే విశ్వమంతా నిండి ఉంటే, ఆ చైతన్యమునే దర్శించడమే జీవన పరమార్ధం అయితే, అలాంటి చైతన్య దర్శనం తర్వాత మనసు ప్రశాంతతను పొంది, నిశ్చలంగా నిర్భయంగా ఉంటుంది… అటువంటి స్థితికి మనుజుని ప్రయాణం సాగాలని పెద్దలు అంటూ ఉంటారు.

దీపం జ్ఙానానికి చిహ్నంగా చెబుతారు. దీపం గదంతా వెలుగు విరజిమ్మినట్టు జ్ఙానం కూడా చైతన్యమును వెదజల్లుతూ ఉంటుంది. వ్యక్తిలో ఉండే చైతన్యం దీపంతో పోలిస్తే, లోపలి జ్ఙానదీపమును గుర్తించడం సాధన అయితే అటువంటి సాధనకు బాహ్యంలో దీపము వెలిగిస్తూ, బయటి దీపపు కాంతిని పరిశీలిస్తూ లోపలి దృష్టిని మెరుగుపరచుకోవడం జ్ఙానసాధన అయితే అలాంటి సాధనకు దీపము ఎంతగానో ఉపయోగపడుతుందని అంటారు.

వ్యక్తి జీవితపు లక్ష్యాన్ని చేరే క్రమంలో దీపముయొక్క పాత్ర చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతున్నది. అటువంటి దీపానికి పండుగ ఉంటే, దీపాలే దీపాలు….

అనేక దీపాలు వెలిగించి, దీపాల పండుగ జరుపుకోవడం దీపావళి అయితే, దీపము మనిషి కుటుంబ జీవితాన్ని ప్రతిబింబించేలాగ ఉంటుందని అంటారు.

దీపంలో నూనే తరిగిపోతూ వెలుగుగా మారుతుంది. దీపంలోని వొత్తి కాలుతూ కాంతిని ప్రసారం చేస్తుంది. కుటుంబంలో భార్యభర్తలు కూడా అంతే తాము తరిగిపోతూ తమ పిల్లలకు మార్గం చూపించడానికి పరిశ్రమిస్తూనే ఉంటారు.

అటువంటి తత్వం కలిగిన దీపమునకు పండుగ చేయవలసి వస్తే అదే దీపావళి అయితే దీపావళి పండుగ దీపాలను మాత్రమే వెలిగించి చేయడం వలన ప్రకృతి పదార్దములతో ప్రకృతి తో పనిచేసే దీపాలు సంతోషిస్తాయి. ప్రకృతి వనరులు అంటే దేవతలుగా భావింపబడితే, దీపం ద్వారా దైవరాధన జరిగినట్టే అయితే కేవలం సహజంగా లభించే తైల దీపాల వలన దేవతలు సంతషిస్తారని అంటారు.

దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్

జీవన వేదం దీపంతో ముడిపడి ఉంటే, అటువంటి దీపారధన మీకు ఎల్లప్పుడూ సంప్రాప్తించాలని ఆశిస్తూ…. హ్యాపీ దిపావళి.

మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఇనుము కాలితే పదునైన కత్తిగా మారుతుంది. పదునైన కత్తని మంచి చెడుకు ఉపయోగించవచ్చును… మనసు కూడా అటువంటిదే సంఘర్షణకు లోనయ్యే మనసు పదునైన కత్తి వంటిదే ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం… అంత:దీపమనే కాంతిలో వికసించే బుద్దిచేత మనసు ప్రేరేపింపబడితే, అది జ్ఙాన ప్రసరణ చేయగలదని అంటారు.

లోపలి దీపపు వెలుగు మనో ప్రశాంతతకు నిదర్శనం, బాహ్యపు దీపపు వెలుగు ప్రకృతి విషయ సందర్శనం…

మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు

శబ్ధకాలుష్యంతో కాకుండా దీపాల వరుసతో దీపావళి పండుగను జరుపుకుందాం…

దివాలి విషెస్

మనం మెచ్చినది నలుగురు మెచ్చినది ఒక్కటే అవ్వడం గొప్ప అయితే ఆనాడు ఆచరించిన పండుగలు ఎంతోమంది జరుపుకోవడం అంటే ఏనాడో మనవారు సాధించిన శాస్త్రవిజయం…

మీకు మీ బంధుమిత్రులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

రెండువేల ఇరవై ఒక్కటి అయినా అరవై ఒక్కటి అయినా తైల దీపాల వరుసలతో దీపావళి పండుగ శోభ వేరయా….

మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ప్రతి పండుగ ఏదో సందేశం ఇస్తుంది… దీపావళి జ్ఙాన సందేశిమిస్తుందని అంటారు.

మీకు మరియు మీ బంధు మిత్రులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

కాంతి విరజిమ్ముతుంది. మాట మనసును తాకుతుంది. రెండు పవర్ పుల్ వాటిని సరిగ్గా వినియోగించుకున్నవారి జీవితం ఆదర్శవంతం అవుతుంది.

దీపావళి పండుగ శుభాకాంక్షలు.

మట్టి ప్రమిదలలో తైలముతో ఒత్తులు వెలిగించడం బాహ్యం అయితే ఆంతర్యంలో మనసు అనే తైలమును బుద్ది అనే ఒత్తితో జ్ఙానమునే అగ్నితో మండించడమే అయితే దీపావళి ఓ మంచి పండుగ శుభాకాంక్షలు.

మీకు మీ బంధుమిత్రులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

మౌనంగా ఉండే మనిషి, నిశ్చలంగా ఉండే దీపం కాంతివంతంగా ఉంటారు…

దీపావళి పండుగ శుభాకాంక్షలు.

చీకట్లో ఉన్న కుండలో దీపం ఉంటే ఎలా ఉంటుందో, శరీరంలో ఉండే మనసు జ్ఙానాన్ని పొందితే అలాగే ఉంటుందని అంటారు.

హ్యాపీ దివాలి విషెస్

చాయ్ చైనాలో పుట్టి ప్రపంచం అంతా

తెలుగులో శుభాకాంక్షలు

ఆన్ లైన్ సాధనాలతో ఆన్ లైన్ తరగతులు

వ్యాసరచన గురించి ఇంకా వివిధ వర్గాలలో తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్ ప్రశ్నలు తెలుగుక్విజ్

తెలుగులో చిన్న పిల్లల పేర్లు

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2021 న్యూఇయర్ కోట్స్

Published
Categorized as telugureads