దసరా విజయ దశమి శుభాకాంక్షలు

అందరికీ దసరా విజయ దశమి శుభాకాంక్షలు. మేలైన విజయం కోసం మీ ప్రయత్నం పరిపూర్ణమవ్వాలని, అందుకు అమ్మ అనుగ్రహం అందాలని ఆశిస్తూ….

దసరా విజయ దశమి శుభాకాంక్షలు
దసరా విజయ దశమి శుభాకాంక్షలు

విజయం అందుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని ప్రయత్నాలు పరిపూర్ణము కావు. పరిపూర్ణమైన ప్రయత్నం విజయం అందించినట్టే.

పరిపూర్ణముకానీ ప్రయత్నం మరలా సరిచూసుకుని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం విజయం సాధించడానికే అయితే అపజయం అప్పటికి ఆలోచనలను సరిచూసుకోవడానికి పడిన బ్రేక్ మాత్రమే.

సరైన ఆలోచన విధానంలో మైండు లేనప్పుడు ప్రయత్నంలో పొరపాట్లు సహజం. కానీ చిన్న పొరపాట్లే, పెద్ద ప్రయోజనానికి కూడా బ్రేక్ వేయగలవు అంటారు. అటువంటప్పుడు ప్రయత్నానికి బ్రేక్ పడడమే మేలు అంటారు. మరలా సరిచూసుకుని తిరిగి ప్రయత్నం చేయవచ్చును. అందుకే కాలంలో వచ్చే పరాజయాలు కూడా పాఠాలే అంటారు.

ఇలా కాలంలో ప్రయత్నాలకు విజయాలను అందిస్తూ, అపజయాలతో పునరాలోచనలకు పురిగొల్పుతూ అందరి మనసులలో మెదిలే పరదేవతా స్వరూపం. ఎప్పుడు ఎవరికిల ఎలా విజయాలను అందించాలో? ఎప్పుడు ఎవరికి ఎటువంటి ప్రయోజనం అందించాలో పరదేవతకు తెలుసు అంటారు.

అలాంటి పరదేవతను పూజించే దసరా ఉత్సవాలు, అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. విజయదశమి రోజు ఉత్సాహంతో తల్లిని ధ్యానిస్తే, ఆ తల్లి అనుగ్రహం మన బుద్దిలో వికసిస్తే, మనకు మరిన్ని విజయాలు కలగకమానవు.

పరాజయం మెట్లుగా మార్చుకోవడం అంటే, ఆలోచనలకు పదును పెట్టడమే…

అపజయం అనేది ప్రయత్న లోపానికి ఫలితం కానీ ప్రయత్నమునకు కాదు. ప్రయత్నం పరిపూర్ణమైతే, అది విజయంతోనే ముగుస్తుంది. అసంపూర్ణమైన ప్రయత్నములే, అపజయానికి దగ్గరగా వెళుతూ ఉంటాయి.

ముగ్గురమ్మల మూలపుటమ్మ అందరికీ విజయాలను అందించాలని, ఆశిస్తూ… తెలుగురీడ్స్.కామ్