తెలుగు అమ్మ వంటిది అమ్మ లేని జీవితం ఉండదు మాతృభాష

తెలుగు అమ్మ వంటిది అమ్మ లేని జీవితం ఉండదు మాతృభాష మాట్లాడనివారు ఉండరు. తెలుగులో మాట్లాడడం వలన మన వ్యకిత్వం మనకు తెలుస్తుంది… తెలుగు చదవడం వలన తెలుగు గొప్పతనం మనకు తెలుస్తుంది…

ఎవరి పని వారికి గొప్ప… ఎవరి వృత్తివారికి గొప్ప అలా అయితే భాష గొప్పతనంలో కూడా ఎవరిభాష వారికి గొప్పగానే ఉంటుంది.

తెలుగుప్రాంతములలో పుట్టి, తెలుగులో చదువుకున్నవారికి ఆ ప్రాంతం గురించి మరింత మక్కువ ఏర్పడుతుంది.

మాతృభాష అమ్మ దగ్గర నుండి మొదలై, నాన్న, బాబయ్, మావయ్య, అత్తయ్య, పిన్ని… ఇలా బంధుమిత్రుల ద్వారా మాతృభాషలో మాటలు ఒక పిల్లవానికి వస్తాయి.

అలాంటి మాతృభాష అంటే మానవునికి మిక్కిలి మక్కువ ఉంటుంది. అటువంటి మక్కువైన భాషపై గౌరవంతో అందరూ ఉంటారు.

అమ్మ తాత..తాత్త..తాత. అంటూ అత్త అని అమ్మా అని ఇలా వరుసలతో చిన్నారికి మాటలు తెలుగులోనే తెలుస్తాయి.

ఉహ తెలిసినప్పటి నుండి తెలుగు ప్రాంతాలలో పెరిగే పిల్లలకు తెలుగులో పట్టు పెరుగుతుంది. తెలుగు మాటలు మాట్లాడడం బాగా అలవాటు అవుతుంది. అదే అలవాటులో విద్య నేర్చుకుంటే, చక్కగా అర్ధం అవుతుంది.

మారాం చేస్తున్న పిల్లవానికి మాయచేసి, మురిపించి ముద్ద తినిపించినట్టు… తెలుగులోనే పాఠాలు ఉంటే, చదువు మీద శ్రద్దలేనివారు కూడా ఎప్పుడో ఒకప్పుడు చదువుకునే అవకాశం ఉంటుంది.

ఒక తెలుగు సభలో తెలుగులో మాట్లాడితే మన గొప్పతనం తెలుస్తుంది. ఒక స్కూలులో తెలుగు నేర్చుకుని ఉంటేనే కదా… తెలుగులో గొప్పగా మాట్లాడగలిగేది.

తెలుగు తెలుసుకుంటే తెలుగు గొప్పతనం

తెలుగు తెలుసుకుంటే తెలుగు గొప్పతనం తెలుస్తుంది. వ్యక్తి పరిచయం పెరిగాక వ్యక్తి వ్యక్తిత్వం తెలిసినట్టుగా…

అలా తెలుగు తెలుసుకోవాలనే కుతూహలం పిల్లలో పెంచాలి. తింటే కదా గారె రుచి తెలిసేది… వింటే కదా భారతం గొప్పతనం తెలిసేది…

భారతం మన మాతృభాషలో ఉంటుంది. మన మాతృభాషలో విన్న భారతానికి, ఇతర భాషలలో విన్న భారతానికి తేడా ఉంటుంది కదా..

మన తెలుగులో మనం భారతం వింటే, భారతంలోని పాత్రలు మనలో మెదులుతాయి… ఇతర భాషలలో భారతం తెలుగువారు వింటే, భారతంలో పదాలకు అర్ధాలు వెతుక్కోవడంతో మనసు పని సరిపోతుంది. ఇక జీవితపరమార్ధం ఎక్కడ తెలియాలి?

అంతే కదా… సాదారణంగా తాత్విక చింతనతో చూసినా ఏవ్యక్తి ఎక్కడ పుట్టాలో ఆపైవాడు నిర్ణయం చేసేశాడు…

ఎందుకంటే, అనేక మంది పుట్టే ఆసుపత్రిల యందు ఒకరు పేద ఉంటాడు.. ఒకడు ధనికుడు ఉంటాడు. కాబట్టి పుట్టుక వ్యక్తి చేతిలో లేనిది… అది ఎవరి ఒకరి ద్వారా పైవాడి చేతిలో ఉండేది.

తెలుగు అమ్మవంటిది అమ్మలేని జీవితం ఉండదు మాతృభాష
తెలుగు అమ్మ వంటిది అమ్మ లేని జీవితం ఉండదు మాతృభాష

ఇక జీవిత పరమార్ధం అయితే ఏమిటి? అంటారు… జీవితం అనుభవించడానికే అని కొందరంటారు.

అనుభవించడానికి జీవితం అయితే తెలుగులో కవితలు, పద్యాలు, సాహిత్యం, కధలు.. ఇవన్నీ మనో వికాసానికే కదా… వికసించిన మనసే కదా… అనుభవించేది…

ఇంకొందరంటారు… జీవితం ఉన్న వ్యక్తి అనుభవించి, చివరికి పరమాత్మలో ఐక్యం కావాడానికే అంటారు. అటువంటి పరమాత్మను తెలియజేసే గ్రంధాలు ఉంటాయి. ఎవరి మాతృభాషలో వారికి తేలికగా అర్ధం అయ్యేలాగా పెద్దలు చేశారు.

మరి మన తెలుగువారికి అటువంటి పరమార్ధ రహస్యం తెలియాలంటే, తెలుగు బాగుగా తెలిసి ఉండాలి… లేదా తెలుగులో వినడానికి పండితులు కావాలి.

మనకు పరమార్ధ విడమర్చి చెప్పే పండితులు మనకు ఉన్నారు. మరి భవిష్యత్తులో అటువంటివారు ఉంటేకదా… చదవలేనివారికి పరమార్ధం గురించి తెలియజెప్పగలిగేది.

ఏదైనా ఎవరి మాతృభాషలో వారికి విద్య నేర్చుకోవడం సులభం. అయితే బ్రహ్మవిద్య నేర్చుకోవడం కష్టం.. అది అనుభేద్యకముగానే తెలియాలి అంటారు.

అటువంటి బ్రహ్మవిద్యను తెలియజేసే గ్రంధాలు మాతృభాషలో చదివితే బాగా అర్ధం కాగలవని అంటారు. మాతృభాష అమ్మ వంటిది అయితే మనకు తెలుగు భాష అమ్మవంటిది. అమ్మలేని జీవితం ఉండదు. తెలుగు మాతృభాష మాట్లాడనివారు ఉండరు.

ఒక వ్యక్తికి వచ్చిన పని మరొక వ్యక్తికి వస్తుంది.. కానీ అందరికీ అదే పని రాకపోవచ్చును.

అంటే ఏ అనే వ్యక్తికి యాప్ డిజైన్ చేయడం వచ్చును. ఏ ఒక ప్రొఫెషనల్ యాప్ డవలపర్. బి అనే వ్యక్తిపై యాప్ గురించి… యాప్ డిజైన్ చేయడం గురించి.. యాప్ డిజైనింగ్ స్క్రిప్ట్ గురించి… యాప్ డవలప్మెంట్ గురించి పదే పదే చెబితే…

యాప్ డవలప్ మెంట్ పై అంతగా ఆసక్తి చూపని బి అనే వ్యక్తి యాప్ తయారు చేస్తాడు… కానీ ఏఅనే వ్యక్తి చేసినంత గొప్పగా చేయలేడు. అదే ఆసక్తి ఉన్న సిఅనే వ్యక్తికి చెబితే, సి అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తికన్నా మిన్నగా యాప్ డవలప్ చేయగలుగుతాడు.

అలాగే కెఅనే వ్యక్తి ఏదో ఒక భాషలో మంచి ప్రావీణ్యం ఉంది… అప్పుడు కె అనే వ్యక్తి అందరికీ ఆభాషను నేర్చేసుకోండి… అంటే కొందరు నేర్చుకుంటారు. కొందరు నేర్చుకోలేకపోతారు…

కానీ కె అనే వ్యక్తి అందరూ ఖచ్చితంగా భాషను నేర్చుకోవాలంటే అది అసాద్యం.. కదా.. అందరి ఆలోచనల తీరుకు తగ్గట్టుగా ఒక సినిమా లేకపోతే, ఆసినిమా పరాజయం పాలవుతుంది.

అందరీ ఆలోచనల దగ్గర ఆలోచించలేని దర్శకుడి సినిమా ప్రజాధరణను పొందలేదు. అందరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యాపారం చేస్తే, లాభాలు రావడం కన్నా నష్టపోయే అవకాశం ఉంటుంది.

ఒక వ్యాపారి కూడా అందరి దృష్టికోనం ఏ రంగంపై ఉందనేది? ఆలోచన చేసుకుని వ్యాపారం ప్రారంభిస్తాడు.

ఇలా ఒకవ్యాపారి, ఒక సేవాసంస్థ ఏదైనా అందరికీ ఆమోదయోగ్యమైన పనులను, సేవలను ఎంచుకుంటారు.

ఏదైనా కొత్త విషయం అందరికీ చెప్పాలంటే, అందరికీ తెలిసిన విషయంతో మొదలు పెట్టి చెప్పలసిన కొత్త విషయం చెబుతారు.

అలాంటప్పుడు మనకు కొత్త భాష నేర్చుకోవాలంటే, తెలుగులో మనకు ఉపోద్గాతం కొంత తెలిసి ఉండాలి… కదా.

తెలుగు మన బంధువులతో మాట్లాడే భాష… ఎక్కువమంది తెలుగులోనే సంబోదించుకుంటూ ఉంటాము… టెక్నాలజీ సంస్థలు భారతీయ భాషలలోకి అనువాదం చేసే అప్లికేషన్స్ అందిస్తున్నారంటే, మాతృభాషపై పట్టు ఉన్నవారు ఎంతమంది ఉంటారు?

ఎవరి భాష వారికి ముద్దు మన భాష మనకు ముద్దు…

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

తెలుగురీడ్స్ హోమ్