జీవిత చరిత్ర కధలు పిల్లలు

జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవిత చరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది.

జీవిత చరిత్ర : సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా చెప్పబడతారు. సమాజంచేత గుర్తింపబడి సమాజం చేత కీర్తింపబడడం అంటే వారు సమాజానికి మార్గదర్శకంగా నిలబడి ఉండి ఉంటారు.

ఇంకా సమాజం హితం కోసం సమాజంలో ఉన్న సమస్యలపై పోరాడి ఉండి ఉంటారు. సమాజం కోసం తమ జీవిత ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా నిత్యం సమాజ హితం కోసం పాటుపడి ఉండి ఉంటారు. ఇలా సమాజానికి మేలు చేసిన వారి గురించి, వారి వారి జీవిత చరిత్రగా సమాజం చేత గుర్తింపడడంతో అలాంటి వారి జీవిత చరిత్రలు పుస్తకాలలో మనకు లభిస్తాయి.

చరిత్రకెక్కినవారిలో వారి జీవితంలో జరిగిన విశేషాలను తెలియజేసే పుస్తకాలు మనకు ఫ్రీగురుకుల్.ఆర్గ్ ద్వారా ఉచితంగా లభిస్తున్నాయి. మహాత్మగాంధీ, బంకించంద్ర చటర్జీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రాజారామ్ మోహన్రాయ్, వల్లభాయిపటేల్, శివాజీ చరిత్రము మరియు మరింత మహాపురుషుల గురించిన పుస్తకాలు ఇక్కడ చదవవచ్చును. ఈ క్రింది బటన్లపై టచ్ చేయండి లేక క్లిక్ చేయండి.

కధలు: కధలు వినడం అంటే అందరికీ సరదాగా ఉంటుంది, ఆ సరదాకు కొనసాగింపుగా కధల పుస్తకాలు చదవడం అలవాటుగా మారుతుంది. చిన్నప్పుడు చక్కగా అమ్మ కధలు చెబితే, కొనసాగింపుగా కధలు నాన్న చెబుతాడు. చక్కగా కధలు వింటూ అన్నం తినేస్తూ ఉంటాం! కొందరం అయితే కధ చెబితేనే అన్నం తిని ఉండి ఉంటాం, మరికొందరం అయితే కధ చెబితేనే నిద్రపోయి ఉండి ఉంటాం!

ఇలా కధలు మనకు చిన్నతనం నుండి వినడం అలవాటు అవుతుంది, ఇంకా అక్షరజ్ఙానం వచ్చాక, ఇష్టం పెరిగితే వినడానికి కొనసాగింపుగా దొరికిన కధల పుస్తకాలు అన్నీ చదివేస్తూ ఉంటాం. వింటే కధలు కమ్మగా ఉంటే, చదువుతూ ఉంటే కధలు ఆలోచనను, ఊహాశక్తిని పెంచుతాయి. ఇప్పుడు మీకు కధలు అంటే ఇష్టం ఉండి, పురాణ కధలు, నీతి కధలు, బేతాళ కధలు ఉచితంగా చదవాలంటే, ఫ్రీగురుకుల్.ఆర్గ్ వెబ్ సైటు ద్వారా చదవవచ్చును. ఈ క్రింది బటన్ టచ్ చేసి, మీరు ఆయా కధల పుస్తకాలు చదవవచ్చును.

పిల్లలు: నేటి బాలలే – రేపటి పౌరులు అన్నారు! ఇప్పుడు పిల్లలుగా ఉన్నవారు తమకంటే పెద్దవారు ఏమి చేస్తున్నారో తెలిసి లేక తెలియక గమనిస్తూ ఉంటారు. తాము పరిశీలిస్తున్న పెద్దలు వయస్సుకు తాము చేరుకున్నాక పిల్లలు తాము చిన్నతనంలో తమకన్నా పెద్దవారు అవలంభించిన తీరును అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనిషి మనసు మొదట అమ్మతో నేర్చుకోవడం మొదలు పెట్టి, నాన్నను అనుసరించడం మొదలుపెడుతుంది.

అలాగే తమకంటే పెద్దవారిని కూడా గమనిస్తూ, స్నేహితులను గమనిస్తూ ఉంటుంది. కానీ ప్రాధమికంగా అమ్మ చెప్పిన మంచివిషయాలను మాత్రం ఎప్పటికి మనిషి మనసు మరువదు. పిల్లల గురించిన రచనలు ఉచితంగా మనకు ఫ్రీగురుకుల్.ఆర్గ్ వెబ్ సైటులో లభిస్తున్నాయి. పిల్లల పెంపకం, పిల్లల ప్రవర్తన, బాలలోకం, పిల్లల పాటలు మొదలైన పుస్తకాలు చదవడానికి ఈ క్రింది బటన్ పై టచ్ చేయండి. ఆయా తెలుగు ఉచితంగా బుక్స్ చదవండి.