గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది.

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం కారు వేగానికి బ్రేకులు వేసినట్టయ్యింది. ఆశించిన ఫలితాలు అంటే టిఆర్ఎస్ కన్నా బిజెపినే సాధించినట్టయ్యింది.

గ్రేటరులో కారు వేగంగా వెళ్ళినా కమలం వికసించింది. కమలనాధులు చేసిన ప్రచారం గ్రేటరు ఓటరులో మార్పును తెచ్చింది.

గతంలో గ్రేటరు తీర్పు అధికార పార్టీ కారుకు సూపర్ ఫాస్ట్ అందించింది. ఇప్పుడు కారు ఫాస్ట్ వెళ్లింది. కానీ కమలం వికసించింది.

దూసుకొచ్చిన కారుకు వికసించిన కమలం, కారుతో సమానంగా కనబడుతుంది.

నిన్న శుక్రవారం జరిగిన గ్రేటర్ ఎలక్షన్ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ 56 సీట్లు కైవసం గెలుచుకుంటే, దాదాపు దగ్గరగానే వచ్చి 8సీట్ల దూరంలో బీజేపీ 48 గెలుచుకుంది. ఎంఐఎం 44 డివిజన్లను గెలుచుకొన్నాయి. కాంగ్రెస్‌ రెండు డివిజన్లు గెలుచుకుంది.

2016లో అత్యదిక స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ, 2020లో మాత్రం సీట్లను తగ్గించుకుంది. అయినా ఎక్కువ సీట్లు గెలచుకున్న పార్టీగా గ్రేటరులో నిలబడింది.

దేనికైనా కాలం కొంతకాలం అనుకూలంగా ఉంటే కొంతకాలం ప్రతికూలంగా ఉంటుంది. ఒక్కోసారి మద్యమ ఫలితాలను తలబొప్పికడుతుంటుంది.

ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టి లేదు. కారు వేగంగా పరిగెత్తితే, కమలంకూడా దీటుగా వికసించింది. 150 స్థానాలు గల గ్రేటర్ మేయర్ పీఠానికి కావాల్సిన సంఖ్యా బలం 102.

రాజకీయాలలో అయితే ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ సారి గ్రేటరులో గ్రేట్ రిజల్ట్స్ హంగ్ ఏర్పడే విధంగా వచ్చాయి.

గ్రేటరులో మేయర్ పీఠం ఎవరికి?

ఆ బలం ఏపార్టీకి లేకపోవడంతో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్‌కు ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు వచ్చిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం మేయర్ పీఠం దక్కించుకోవడానిక సరిపోదు.

గ్రేటర్ మేయర్ పీఠం కావాలంటే, మరొక పార్టీ మద్దతు కావాలి. టిఆర్ఎస్ కాకుండా మరొక పార్టీ మజ్లిస్ ఉంది. బిజెపి ఉంది. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు కలిసే అవకాశాలు ఎవరూ ఊహించలేరు కూడా…. గ్రేటర్ ఎన్నికలలో పోటిపడ్డ ప్రధాన పార్టీలుగా బిజెపి-టిఆర్ఎస్ ఉన్నాయి.

కాబట్టి అవి కలిసే అవకాశం కన్నా మజ్లిస్, టిఆర్ఎస్ పార్టీలపైనే అందరి దృష్టి. ఈ రెండు కలిస్తే మేయర్ పీఠం ఒకపార్టీకి దక్కుతుంది. అయితే ఎవరు పీఠంపై కూర్చుంటారు? ఇదే ప్రశ్న. కానీ టిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీతో కలిసి మేయర్ పదవిని పంచుకుంటే, అది బిజెపికి బలమైన ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది.

గ్రేటర్ పరిధిలో జరిగిన ఎలక్షన్ హోరెత్తిస్తే, ఇప్పుడు పరిణమాలు మరింత ఆసక్తికరమైనవిగా మారాయి. ఇప్పుడు టిఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

బిజెపి ఎన్నికల వ్యూహంలో విజయవంతం అయ్యింది. ఇప్పుడు ఎటువంటి వ్యూహం కలిగి ఉంటుందో చూడాలి.

ధన్యవాదాలు తెలుగురీడ్స్

ఉచితంగా ఎలాంటి యాడ్స్ లేకుండా చదువుకోవాలంటే భక్తి స్త్రోత్రములు, అన్నమయ్య సంకీర్తనలు, భగవద్గీత శ్లోకాలు తెలుగులో చదువుకోవాలంటే భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో లభిస్తుంది.