గురువు గురువులు గురువులతో

గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది.

అమ్మ మొదటి గురువు, నాన్న తర్వాతి గురువు, న్యూస్ సామాజిక గురువు ఇలా గురువులతో నిండే జీవితానికి ఉద్దరించే గురువు ప్రత్యేకంగా ఉంటారు.

అక్షరాభ్యాసంతో విద్యా బోధకుల రూపంలో గురువు. సందేహాలు తీర్చే స్నేహితుడి రూపంలో గురువు. అనుసరణలో అన్నదమ్ముల రూపంలో గురువు.

జీవితం ఓ సాధనగా సమాజం పాఠశాలగా భావిస్తే, పరబ్రహ్మ స్వరూపమైన గురువు మనకు ఏదో ఒక రూపంలో అప్పటికి అవసరమైన జ్ఙానం అందిస్తూనే ఉంటాడు. భక్తి కొలది పరబ్రహ్మమును వాడు, వీడు అని కూడా అంటాము. గురువును మాత్రం మీరు, వారు అనే సంభోదిస్తాము. గురువు అంటే అంతటి గౌరవభావం ఉంటుంది.

రామదాసు నిందించాడు. దూర్జటి దెప్పిపొడిచాడు. భగవానుని ఎవరైనా స్వతంత్రంగా పిలవడం భక్తిలో సహజం అయితే నేర్చుకోవడంలో మాత్రం చాలా భక్తిశ్రద్దలలో బాటు గౌరవం కూడాను ఉంటుంది.

అమ్మ ఒడిలో భద్రత ఉంటుంది. అమ్మను అనుసరిస్తూ నేర్చుకుని, నాన్నను అనుసరిస్తాం.. అన్నయ్య అయినా, అక్కయ్య అయినా వారిని అనుసరిస్తాం… ముందుగా నేర్వడం, నైపుణ్యం ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. గురుత్వం ఇంటిలోనే బంధుమిత్రుల రూపంలో సాధారణ విషయాలలో ఉంటుంది.

గురువు గురువులు గురువులతో న్యూస్ కూడా గురువుగా ఉంటే
గురువు గురువులు గురువులతో న్యూస్ కూడా గురువుగా ఉంటే

పరిశీలించి చూస్తే సమాజం ఓ పెద్ద గురువుగా ఉంటుంది. న్యూస్ చూస్తే రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఓ ఆలోచన పుడుతుంది. ఆలోచన పుట్టేలాగా చేయడమే గురుతత్వం అంటారు. గురువు గురువులు గురువులతో న్యూస్ కూడా గురువుగా ఉంటే, సమాజంపై అవగాహన పెరుగుతుంది.

ఆవుని చూస్తే సృష్టిలో చులకనగా చూసే గడ్డిపరకలను తిని, సృష్టికి మూలమైనవాడిని ఆరాధించడానికి అవసరమైన ద్రవ్యాలను ఇస్తుంది. మనకు అవసరం లేకపోయినా అది వేరే రూపం నుండి సమాజానికి ఉపయోగపడతాయని అవు, గడ్డిని చూస్తే అవగతమవుతుంది. పరిశీలిస్తే లోకంలో జరిగే ప్రక్రియలో కూడా గురుత్వం కనబడుతుంది.

దత్తాత్రేయుల వారి గురువులంతా ప్రకృతి నుండే ఉంటారు. అంటే ప్రకృతి పాఠశాలలో గురువులు అనేకంగా ఉన్నారు. గురుత్వం ఎక్కడిక్కడ జ్ఙానం అందించడానికే సిద్దమే. అయితే ఆలోచనతో కూడిన పరిశీలన, శద్ధ ముఖ్యం అంటారు. శ్రీగురు చరిత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలో…

శ్రీగురు చరిత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలో

గురుత్వాకర్షణ శక్తి చేత భూమి మీద మనం నిలబడి ఉండగలుగుతున్నాం. ఆ శక్తి వలననే వస్తువులు అన్ని కూడా వాటి వాటి పరిణామమును బట్టి భూమిపై ఉంటున్నాయి. గురుత్వాకర్షణ శక్తి లేకపోతే ఎలా మన శరీరం భూమిపై నిలబడి ఉండలేదో… లోకంలో జ్ఙానం లేకపోయినా మన మనసు జీవితంలో నిలబడదు. విషయాలపై అవగాహన ఉండడం చేత, విషయములను అనుభవించడం, విషయములను నేర్చుకోవడం, విషయములను సాధించడం… ఏదైనా విషయ పరిజ్ఙానం గురువు వలననే తెలియబడుతుంది. అటువంటి గురువు మనకు అమ్మ నుండే ప్రారంభం.

అయితే ఇలా మనకు తెలియకుండానే మనకు ఒక గుర్తింపు ఏర్పడడంలో సమాజంలో కొందరి గురువుల ప్రభావం ఉంటుంది. మనకు స్వయం ఆలోచన దృష్టి ఏర్పడే సమయానికి కొంతమంది గురుస్వభావం మనపై పడుతుంది. మనకు స్వీయ ఆలోచన కలుగుతున్నప్పుడు మన అభిరుచికి తగ్గట్టుగా బోధనా గురువుల దగ్గరకు వెళుతూ ఉంటాము.

అతను తిరిగి మరొకరికి గురువు కాగలడు. ఇంకా మరికొంతమందికి గురువు

మనం నేర్చుకునే సమయంలోనే ఆసక్తి చూపిన విషయంలో నైపుణ్యం పెంచుకుంటాం.. పరిశీలనాత్మక దృష్టితో ఊహాత్మక దృష్టి పెరిగి… ఒక విషయం గురించి గరిష్ట జ్ఙానమును సంపాదిస్తే, ఆ విషయంలో అతను తిరిగి మరొకరికి గురువు కాగలడు. ఇంకా మరికొంతమందికి గురువు కాగలడు. అంటే అమ్మ అనే గురువు దగ్గర తెలియకుండా మొదలైన బోధ, మన శ్రద్ధాసక్తుల చేత ఏదైనా ఒక విషయంలో నైపుణ్య సంపాదించి, అందులోనే మరొకరికైనా గురువుగా మారవచ్చును.

గరుత్వం ఒకరి నుండి ఒకరికి మారుతూ ఉంటుంది. అది బోధ చేస్తూనే ఉంటుంది. కాలం బట్టి శ్రద్ధాసక్తుల బట్టి తెలిసి, తెలియక గురుత్వం బోధ చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనకు తెలిసి కానీ తెలియక కానీ విషయాలు బోధించబడుతూ ఉంటాయి. అయితే నేర్చిన విషయాలలో, నైపుణ్యం సాధించిన విషయంతో జీవన మనుగడ సాగుతుంది.

జీవితంలో కాలం కూడా ఒక గురువుగానే కనబడుతుంది. ఒకసారి కష్టం ఇస్తుంది. ఒకసారి సుఖం ఇస్తుంది. కష్టం, సుఖం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనకు ఫలిత ప్రభావం అనుభవం అవుతుంది. కానీ కాలం కనబడదు. కనబడని కాలం, మనకు కనబడకుండా మనలోనే ఉండే మనసుపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. పరిమితమైన శరీరం గురించి ఎక్కువగా శ్రద్ద పెడితే, ఆలోచన కూడా పరిమితం. అపరమితమైన మనసు గురించి ఆలోచన చేస్తే, ఆలోచన అపరిమితమే.. అటువంటి మనసులను ప్రభావితం చేసే కాలం గురించి ఆలోచన చేయడం అంటే అది అద్భుతంగానే అనిపిస్తుంది.

మనిషిలో ఉంటూ మనిషి చుట్టూ ఉన్న పరిస్థితుల బట్టి ఏర్పడిన సంస్కార ప్రభావంతో ప్రవర్తించే మనసు. దానికి మూలమైనది, కాలంతో పోలిస్తే… మనసు భావాలు, కష్ట సుఖాలు రెండు భ్రమలు గానూ కదిలే కాలంలో ఏర్పడిన ఒక ప్రయాణం గురించిన ఆలోచన పుడుతుంది. అలా కాలంలో కలిగే కష్టసుఖాల వలన కాలాన్ని పరిశీలించాలనే ఆలోచన పుట్టడం కూడా కాలంలో కలిగేదే… పరిశీలిస్తే కాలమొక కొలమానం లేని గురువు.

ఏ గురువు దగ్గరకు ఏ వ్యక్తి ఎలా వెళుతున్నాడు

లోకంలో అనేకమంది జనులం. అనేకమంది జనులకు బోధించడానికి గురువులుంటారు. ఏ గురువు దగ్గరకు ఏ వ్యక్తి ఎలా వెళుతున్నాడు.. కాలమే నిర్ణయిస్తుంది. కాలం ఎలా ఈ ఫలితం ఇస్తుంది? అంటే అది కర్మప్రభావం అని అంటారు. అయితే అనుగ్రహం కలిగితే పరమార్ధం ఎలాగైనా తెలియబడుతుంది. కాలం అందుకు తగ్గట్టుగానే మార్పుని జీవితంలో తెస్తుందని అంటారు. అయితే పరమార్ధం వైపు వెళ్ళగలగడమే అదృష్టదాయకం అంటారు.

కొందరికి కాలం గురువుగా ఎవరో ఒకరిని నిర్ణయిస్తూ ఆ వ్యక్తి జీవితంలో పొందవలసిన కర్మఫలితం అందిస్తుందని చెబుతారు. అయితే అది చేసుకున్న కర్మకొద్ది ఫలితం… ఇంకా ఆ జీవితం భవిష్యత్తులోకి కూడా కర్మఫలితం ద్వారానే ముందుకు సాగుతుంది. కర్మఫలితం కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా రెండింటిలో అప్పటిదాకా ఉన్న అనుభవం ఆధారంగా అనుభవిస్తూ ముందుకు సాగుతుంది. కానీ కష్టమే కనబడుతూ, సుఖం ఏదో అలా కనీ కనబడక పోతుంటే మాత్రం… ఆ జీవితం భరించడం కూడా కష్టదాయకమే…

ఏదో ఆశతో ముందుకు సాగుతూ ఉంటాం… ఆశ తీరుతుందనే భావన బలపడేలాగా కష్టసుఖాలు కలుగుతూ ఉంటాయి. కానీ లక్ష్యం వైపు జీవితం సాగదు. మలుపుల తిరుగుతూ ఉంటుంది. మన ఆశ తీరుతుందనే భావన బలపడేలాగా పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో జీవితం సాగకుండా కష్టం తిష్టవేసినట్టుగానే ఉండే అవకాశం అతి కొద్ది మంది విషయంలో జరగవచ్చును. ఏదో ఒక ఆశ.. అది ఏస్థాయివారికి అనేది చెప్పలేం.

ఆశ నిరాశల మద్య జీవితం అనుభవం అవుతూ…… ఆశ వదిలేసి నిరాశనే పట్టుకున్న మనసుకు మాత్రం గురువు అవసరం ఏర్పడుతుంది. తన స్థితికి తనే ఎలా కారణమయ్యానో… తెలియబడాలి. కారణం అంతర్లీనంగా తెలుస్తునే ఉంటుంది. కానీ కన్ఫర్మ్ కాదు. గుర్తించడంలో అసక్తత ఉంటుంది. గురువు వలననే అది ఏమిటో తెలియవస్తుంది. ఆ యొక్క నిరాశను ప్రారద్రోలడంలో గురువు అనుగ్రహం ఏవిధంగా ఉంటుందో? అంటే అది వారి వారి జీవన పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ అటువంటి ఆశ నెరవేరడం, నిరాశ తొలగిపోవడంలో జీవిత పరమార్ధం కూడా కలిసి ఉండవచ్చును.

గురువు నైరాశ్యాన్ని ప్రారద్రోలతాడు

కొందరు అంటారు. అతి కష్టం. అతి నిరాశ. కోలుకోలేని ఎదురుదెబ్బలు.. స్థాయి మరీ దీనంగా ఉండదు. కానీ పరిస్థితులు ప్రతికూలం… కష్టంతో కాపురం చేస్తున్నట్టుగానే ఉంటుంది. అలాంటి కొన్ని జీవితాలలో వారి జీవన పరమార్ధం కూడా కలిసి ఉండవచ్చును అంటారు. వారి జీవితం సార్ధకతకోసం తిరగడం కోసమే అలాంటి పరిస్థితిని కాలం కల్పించవచ్చు అని అంటారు.

https://www.youtube.com/watch?v=V6xqyMDvp2g
గురువు గురువులు గురువులతో

ఏది ఏమైనా జీవితంలో ఓ గురువు కష్టాన్ని దూరం చేస్తాడు. ఓ గురువు చిరకాల కోరిక సాధనను సులువుగా మారుస్తాడు. ఓ గురువు నైరాశ్యాన్ని ప్రారద్రోలతాడు. ఓ గురువు అపరిమిత జ్ఙానాన్ని అనుగ్రహించేస్తాడు. కాలం గుర్తు చేసిన గురువే ఇలాంటి అద్భుతాలు ఆయా జీవితంలో కల్పిస్తాడు. అటువంటి గురువు ముందు ఇక ఏం గొప్పగా ఉండదు. ఏం కోరలేం.. మనసు ఆ గురు పాదములనే పట్టుకుంటుంది. అప్పటిదాకా ఉన్న తన కోరికో, ఆశో, నైరాశ్యమో… అంతా మరిచిపోతుంది… ఇది కొందరి జీవితాలలో కొందరి ద్వారా కాలం సృష్టించేదిగా చెబుతారు.

ఒక వ్యక్తి జీవిత లక్ష్యం ఏమిటి? జీవితంలో ఒక వ్యక్తి ధర్మమేమిటి? ఈ సంఘర్షణ మనిషికి వచ్చినప్పుడు, ఆఇంటి పెద్దే, ఆ వ్యక్తి దిశానిర్ధేశం చేయగలడు. అప్పటికి తృప్తి చెందకపోతే, ధర్మసందేహాలు ఎక్కువగా ఉంటే, పురాణ పరిచయం పరిష్కారంగా ఉంటుందని, ప్రవచనకర్తలు చెబుతూ ఉంటారు. అటువంటి ప్రవచన సారం ఇచ్చిన పురాణాలు రామాయణం, మహాభారతం, శ్రీమద్భాగవతం లాంటి గ్రంధాలలో మనకు కనిపించే గురువుల గురించి తెలుసుకోవడం వలన జీవనం శాంతియుతం కాగలదు అంటారు. గురువు అనుగ్రహం అయితే, చదువుల తల్లి అనుగ్రహం వలన చదువులలో మర్మం తెలియబడుతుంది, అంటారు. మరి అలాంటి పురాణ పురుషులు అయిన మన గురువుల గురించి లభించే ఉచిత తెలుగు పుస్తకములు…