కర్మ యోగం

కర్మ యోగం గురించి తెలుసుకోవాలి అంటరు. ఎవరు కర్మ యోగం గురించి తెలుసుకోవాలి? అంటే కర్మను ఆచరించేవారు కర్మ యోగం తెలుసుకోవాలి అంటారు.

కర్మ అంటే పని. పని ఎలా చేయాలో? తెలిసి ఉంటే, అలాగే ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలం. పని ఎలా చేయాలో? తెలియనప్పుడు తలపెట్టిన పని అసంపూర్ణంగానే ముగుస్తుంది. కాబట్టి పని చేసేవారు, అ పనిలో నిష్ణాతులైతే పనిని సరిగ్గా చేయగలరు.

పనిలో నైపుణ్యం ఎలా వస్తుంది? అంటే పని గురించి తెలుసుకోవడం వలన ఆపై ఆ పనిలో అనుభవం ఉన్నవారిని అనుసరించడం వలన పనిపై శ్రద్ద కలిగి, శ్రద్దతో చేస్తుండడం వలన పనిలో నైపుణ్యత పెరుగుతుంది. పనిపై శ్రద్ద ఎంత ఎక్కువగా ఉంటే ఆ పనిలో అంతటి నైపుణ్యం పెరుగుతుంది.

ఈ విధంగా మనకు పనిలో వచ్చే నైపుణ్యం, మనకు జీవనోపాధిగా మారుతుంది. ఇంకా కొందరికి గుర్తింపు తీసుకువస్తుంది. అన్ని పనులలోనూ అందరికీ నైపుణ్యత ఉండదు. కొందరికి ఎక్కువ పనులలో ప్రవేశం ఉండవచ్చును. కానీ నైపుణ్యం ఉండేది ఒక పనిలోనే ఉంటుంది.

కొందరికి డ్రైవింగులో నైపుణ్యత ఉంటే, కొందరికి పాటలు పాడడంలో ఉంటుంది. కొందరికి అందరికీ అర్ధం అయ్యే రీతిలో ప్రసంగించగలరు. కొందరు కంప్యూటర్ వాడుకలో నైపుణ్యం కలిగి ఉంటారు. కొందరు పొలం పనులలో పూర్తి అవగాహనను కలిగి ఉంటారు.

ఇలా ఎవరి అభిరుచిని బట్టి వారి వారికి ఏదో ఒక పనిలో నైపుణ్యత వస్తుంది. కొందరికి ఆ నైపుణ్యం వలన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలరు. కొందరు కేవలం కుటుంబపోషణకు వరకు మాత్రమే ఉపయుక్తంగా ఉంటుంది. మరికొందరికి కేవలం కీర్తిని మాత్రమే తీసుకువస్తుంది, కానీ జీవనోపాధికి ఉపయోగపడకపోవచ్చును.

ఇలా పనిలో నైపుణ్యత కొందరికి పెరుగుతుండగానే పరిశీలనలో వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి నైపుణ్యాలు పైన చెప్పినట్టు కొందరు సంపాదనకు ఉపయోగించుకుంటే, కొందరు కేవలం ఒక అలవాటుగా పెట్టుకుంటారు.

అయితే మనం చేసే పనులలో నైపుణ్యానికి, కర్మయోగానికి సంబంధం ఏమిటి? అంటే కర్మ అంటే పని కాబట్టి. అయితే సాదారణంగా కర్మ అంటే సనాతన ధర్మంలో పూర్వజన్మఫలితం అని చెబుతూ ఉంటారు.

జీవితం సాఫీగానే సాగుతున్నప్పుడు ఎటువంటి కర్మగురించి ఆలోచన రాదు. జీవితంలో చేయడానికి ఒక పని. ఆపనికి తగిన సంపాదన. వచ్చిన సంపాదనను తన కుటుంబ సభ్యులతో సహా అనుభవించడం.. ఇలా సాగుతూ ఉంటే, ఇలలోనే స్వర్గం ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ వారు కర్మగురించి ఆలోచించకపోవచ్చును. కానీ వారిని గమనించేవారు మాత్రం, అది గతజన్మలో చేసుకున్న పుణ్యఫలం అంటారు.

కొందరు జీవితంలో ఏదో లోటుతో మనసు శాంతిగా ఉండదు. వీరిని గమనించేవారు గతజన్మలో ఏదో పాప కర్మ అని అంటారు. అంటే జీవితంలో ఏదైన తీరని వెలితి గతజన్మలో పాపమైతే, ఈ జన్మలో పొందుతున్న సుఖాలు అన్ని గతజన్మలో చేసినవి అవుతాయి.

అయితే ఇక్కడ ఒక చిక్కు ముడి ఉంటుంది. గత జన్మలో నేను పుణ్యం చేసే ఉంటాను, అని ఎప్పుడూ సుఖం వెతుక్కుంటాను అంటే దాని ఫలితం విపరీతం అయ్యే అవకాశం ఎక్కువ. గత జన్మలో అంతా పాపమే చేశాను అని భావించి, వర్తమానంలో ఎల్లప్పుడూ దు:ఖిస్తూ ఉండడం వలన భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది.

గత జన్మలో మనమేమిటో మనకు తెలియదు. కానీ దాని ఫలితం ఖచ్చితంగా ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుందని ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. కాబట్టి మనం గతజన్మలో చేసుకున్న కర్మఫలితం కాలం మనకు వర్తమానంలో ఇస్తుంది. అయితే అది సుఖం కావచ్చును లేక దు:ఖం కావచ్చును.

కానీ వచ్చేది సుఖం అని, వచ్చేది దు:ఖమని మనకు ముందుగానే తెలియదు. అది అనుభవం అయ్యాక తెలియవస్తుంది. సుఖం అనుభవిస్తున్నప్పుడు గడిచిన కాలంలో దు:ఖం కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాగే దు:ఖం అనుభవిస్తున్నపుడు మాత్రం ఏదో కర్మ అనుకుని దు:ఖిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా గడిచిన సుఖ: సమయం గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఇలా గడిచిన కాలంలోని భావజాలాన్ని మోసుకుంటు మనకు గుర్తు చేసేది మనసు అయితే, అదీ ఏదో ఒక భావనను బలపరుస్తూ ఉంటుంది. అయితే ఈ సుఖ:దుఖాల సమయంలో మనసు కృంగడం, పొంగిపోవడం ఉంటుంది.

అయితే దు:ఖ భావన బలంగా ఉన్నప్పుడ మాత్రం మనసు మరింత కృంగిపోతుంది.

దీర్ఘ కష్టంలో ఉన్న మనసుకు దు:ఖభావాన్ని భరించలేనప్పుడు, దానికి స్థైర్యం అందించేందుకు మన చుట్టూ బంధాలు ఉంటాయి. మిక్కిలి దు:ఖంలో మనసుకు దైర్యం చెబుతారు. బంధుమిత్రుల ఓదార్పుతో మనసు నిలబడి ఉండడానికి ప్రయత్నించి విజయవంతం అవుతుంది.

అయితే అటువంటి బంధం మద్దతు మనసుకు లేనప్పుడు మాత్రం మనిషి నిలబడి ఉండడం చాలా కష్టం. కొందరు జీవితం అయిపోయిందనే నైరాశ్యంలోకి కూడా పోయే అవకాశం ఉంటుంది. కొందరైతే చిన్న విషయాలకు కూడా బాగా నొచ్చుకుని నైరాశ్యంలోకి వెళ్ళేవారు కూడా ఉంటారు.

ఇలాంటి నైరాశ్యంలో ఉన్నప్పుడు మాత్రం మనిషి మనసుకు సజ్జన సాంగత్యం మంచి ఫలితం అంటారు. అలాంటి సజ్జన సాంగత్యంలో సద్ర్గంధాలుగా చెబుతారు. ఈ గ్రంధాలలో మనో విజ్ఙానం, ఆత్మ పరిశీలన తదితర అంశాలు ఉంటాయి.

మనో విజ్ఙానం ఇదే ప్రధానం. మన మనసు గతం నుండి వర్తమానంలో సంతోషంగానో, దు:ఖంగానో ఉంటూ భవిష్యత్తుకు బాట వేసుకుంటూ పోతుంది. గడిచిన కాలంలోని కష్టనష్టాలను గుర్తుపెట్టుకుని వర్తమానంలో ప్రవర్తిస్తూ భవిష్యత్తులో ప్రభావితం అవుతూ ఉంటుంది. ఇలా మనసు పొందే ఆలోచనల నుండి బద్దిబలం పనిచేస్తుంది.

ఈ బుద్ది బలం కర్మానుసారం ఉంటుందని అంటారు. ఒక్కోసారి ఒప్పు చేసే ఎప్పుడూలేనివిధంగా అందరితో మెప్పు పొందడం ఉండవచ్చును. ఒక్కోసారి అనుకోని తప్పు చేసి అందరిలో అవమానం పొందవచ్చును. మెప్పుకు, అవమానానికి మనసు ఆలోచనలతో మునిగి ఉంటూ బుద్దిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ప్రభావితం అయిన బుద్ది గత ప్రారబ్ద కర్మకు ఫలితమో, భవిష్యత్తు కర్మకు కారణమో కాగలదు.

అయితే గతకాలపు పాప, పుణ్యముల ఫలితం లేకపోతే భవిష్యత్తు ఫలితాలకు కారణంగానో బుద్ది పనిచేస్తుంది. గతకాలపు కర్మఫలితం ఇప్పుడు అనుభవించే మనసు బుద్దిని ప్రేరేపితం చేస్తూ ఉంటే భవిష్యత్తును మరింత ప్రభావితం చేయవచ్చును. గతకాలపు కర్మఫలితం అనుభవిస్తున్న మనసు కేవలం కర్మకొద్ది అని కేవలం ఫలితం అనుభవిస్తూ తను చేస్తున్న పనిని పూర్తి చేసే మనసు మాత్రం భవిష్యత్తుకు మార్గదర్శి కాగలదు.

ఏదైనా మనసు పొందే ఆరాటం, అది చేసే పోరాటం మన బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ బుద్ది గతకాలపు కర్మలకు సంభందించో? లేక భవిష్యత్తును నిర్ణయించే ఫలితానికో కారణం కాగలదు. బయటపడిన బుద్దిని పట్టి సమాజంలో వ్యక్తి స్థితిగతులు కూడా ప్రభావితం అవుతాయి.

ఇలా మనసులో ఉన్న నాలగు భాగాలను కాలంలో వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకుంటూ తననుతానే పరిశీలన చేసుకుంటూ చేస్తున్న పని ఫలితంపై కాకుండా చేస్తున్న పనిని అత్యంత శ్రద్దతో చేయడం కర్మ అయితే, ఆ కర్మ కేవలం తన కర్తవ్యంగా చేస్తూ, కర్మఫలితం ఎలా ఉన్నా చలించని మనసు యోగం పొందినట్టే అంటారు.

మనసుతో మనసుపై పోరాటం చేసే మనోవిజ్ఙానం కర్మ యోగం తెలిసి ఉండడం చేత వస్తుంది అంటారు. కర్మఫలితం అనుభవించేది మనసు. ఇప్పటి దాని కర్మఫలితానికి కారణం గతంలో మనసు చేసుకున్న కర్మలే కారణం కాగలవు. అయితే వర్తమానంలో ఫలితం కన్నా కర్మపై భక్తిశ్రద్దలతో చేస్తూ ఎటువంటి ఫలితం అయినా కాలానికో నమ్మిన దైవానికి వదిలి నిశ్చింతగా ఉండే మనసు యోగబుద్దితో ఉంటుందని అంటారు.

అయితే కర్మ యొక్క ఫలితం వలన ప్రభావితం అయ్యే మనసు గురించి మనసుకు ఆలోచన లేకుండా జీవితంలో జరిగే సంఘటనలను స్వీకరిస్తూ ఫలితాలను అనుభవిస్తూ ఉండే తనపై తాను పరిశీలన చేయాలనే తలంపు తనకు పుట్టవచ్చు, పుట్టకపోవచ్చును. ఇదీ ఆయా జీవి యొక్క స్వభావం బట్టి ఉంటుంది.

పరిశీలనాత్మమైన ఆలోచన చేసే పనిలో ఉంటే, ఆపనిలో అవగాహన మరింతగా మనిషికి వస్తుంది. అదే పరిశీలన ఇతరులపై ఉంటే, తన చుట్టూ ఉండేవారి గురించి మంచి అవగాహన కలిగి ఉంటారు. అదే పరిశీలన తన మనసుపై ఉంటే, అదే ఏమిటో?, అదే చేసే చేస్టితములకు కాలం ఎలా సమాధానం ఇస్తుందో? సుఖదు:ఖాలలో దానిపై అదే పరిశీలనతో ఉంటుంది. కొందరి ఒంటరిగా ఆలోచనలో ఉంటే, కొందరు పని చేస్తున్నప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంటారు.

చేస్తున్న పనికి తాను ఎలా కారణం అవుతున్నాను? ఇతరులు కారణం ఎలా అవుతున్నారు? జరుగుతున్న కాలంలో తన పాత్రత, ఇతరుల పాత్రత మనసులు పొందే వికారాలు గమనిస్తూ ఉండే మనసు కేవలం కాలం ఇచ్చే కష్టనష్టాలను స్వీకరిస్తూ కర్మఫలితం అనుభవిస్తుంది అంటారు. ఇలా స్వీయపరిశీలనలో తను గురించి తనకు తెలియడంతో బాటు సమాజంలో తను పొందిన స్థాయికి అసలు కారణం ఏమిటి? తనా? తన కర్మఫలితమా? కాలాన్ని శాషించే దైవమా? మీమాంస మొదలవుతుంది.

స్వీయపరిశీలో పడిన మనసు అంత త్వరగా ప్రతి విషయానికి అలవాటు పడదు. అప్పటివరకు అలవాటు అయిన విషయాలలో ఉన్న మర్మమేమిటో గ్రహిస్తుంది. తన స్థితికి కారణం ఏదైనా వర్తమానంలో పొరపాటుక తావివ్వకుండా చూసుకుంటుంది. ఈ పరిశీలన అన్నింటిలో మనసు చేయకపోవచ్చును.

ఏదో తనకు నైపుణ్యం ఉన్న విషయంలోనే మనసు అన్ని కోణాలలోనూ పరిశీలన చేయవచ్చును. అన్నింటా పరిశీలన అంటే ఆమనసుకు ఆన్నింటిలోనూ అవగాహన అంటే అంతటి ఆలోచనను మనసు చేయకపోవచ్చును. ఒక వేళ చేస్తుంది అంటే అంతటి విశాలహృదయం, ప్రేమపూర్వక పరిశీలన ఉంటేనే అంతటి ఆలోచనను మనసు భరించగలదు. ఆలోచనలో మనసు శాంతిని పొందాలంటే కర్మ యోగం తెలిసి ఉండాలి అంటరు.

కర్మ యోగం తెలియబడి ఉండడం వలన దు:ఖ భావన అధికమైనప్పుడు మనసు తనకు తానే ఓదార్పుగా మారుతుంది. ఫలితానికి గతంలో కర్మ అయినా భవిష్యత్తుకు ఫలితంగానైనా కావచ్చును. ఇందుకు కాలం సాక్షి కాబట్టి నాపనినేను శ్రద్దగా చేస్తున్నాను అనే భావన కర్మ యోగం తెలిసో తెలియకో మనసు అలవడి ఉండాలి అంటారు.

ఈ సుఖదు:ఖాలకు, కష్టనష్టాలకు కారణం మనసు ఎక్కువగా చుట్టూ ఉన్న వ్యక్తులకో వస్తువులకో ఆపాదించి, ఎప్పటికో తనపైతాను పరిశీలన చేస్తుంది. తనను వదిలి ఇతరుల కారణంగా చూపుతున్న కాలం అంతా సాధించేది శూన్యమే అంటారు. తననితాను పరిశీలన చేసుకుంటూ సాగే మనసు ఎప్పటికైన తననితాను చక్కదిద్దుకోగలదు.

తననుతాను చక్కదిద్దుకునే పరిశీలనకు ఆలంబన, అవకాశం ఇచ్చేది.. కాలం అయితే? ఆ కాలం తాను నమ్మే దైవంగా ఆ వ్యక్తి భావించవచ్చును. మనసుకు ఊరటనిచ్చే దైవభావం, మనసుకు మరింత బలం. ఆభావం ఎంత పెంచుకుని మనసుభారం ఎంత తగ్గించుకుంటే, మనసు పనిలో అంత శ్రద్దపెట్టగలదు.

జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, ఆ కష్టాలకు కారణం కాకుండా, ఫలితంపై ఆసక్తితో కాకుండా శ్రద్దతో తనపనిని తాను చేసుకుపోయే స్వభావం ఒక విధంగా ఉంటుంది. ఫలితంపై ఆసక్తితో చుట్టూ ఉన్న పరిస్థితులలో మార్పును ఆశించే స్వభావం మరొకలాగా ఉంటుంది. కర్మను చేస్తూ వచ్చిన ఫలితం స్వీకరించే స్వభావం ఒకలాగా ఉంటుంది. కర్మఫలితం స్వీకరించగా దు:ఖించే స్వభావం భారం అవుతంది. కర్మఫలితం స్వీకరించి కర్మలో విధానం పరిశీలనచేసే పున:ప్రారంభం చేసే స్వభావం మరొకలాగా ఉంటుంది. ఏదైనా మన:ప్రవర్తన ఆ మనిషిలో శాంతి, అశాంతిలకు కారణం కాగలదు.

ఈ ఫలితం స్వీకరించడం, కర్మఫలితం ఆశించడం, ఆశించకపోవడం, జీవితాన్ని సరిదిద్దుకుని సాధించుకోవడం కొందరికి పరిస్థితులు చెప్పే పాఠం వలన అలవాటు పడుతుంది. అయితే కొందరు ఈ మనసు, ఆలోచన, బుద్ది అంటూ పరిశీలన చేయవచ్చును, కొందరు చేయకపోవచ్చును.

ఏదో సమస్య వచ్చింది అని అనుమానం కలిగి సమస్యపై దృష్టిపెట్టిన మనసు సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు సమస్య కనబడదు. అలాగే జీవితంలో ఎదుర్కొంటున్న కర్మఫలితంపైనా దృష్టి పెట్టిన మనసు కూడా ఆకర్మఫలితాన్ని కర్మ యోగం ద్వారా సాధించవచ్చును. ఈ కర్మ యోగం తెలియబడడానికి మనకు కర్మను గురించి, కాలం గురించి, మన:ప్రవర్తనల గురించి, వ్యక్తి చుట్టుప్రక్కల ప్రభావం గురించి తెలిపే బుక్స్ చదవడం వలన మనకు మేలైన ఫలితం కలగవచ్చును.

కర్మ కొద్ది ప్రారబ్ధం అని ఉంటారు. కర్మ అంటే పని అయితే, గతంలో చేసిన పనుల వలన ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాం అని దు:ఖిస్తూ ఉంటారు. కొందరు గతంలో చేసిన పని వలన ఇప్పుడు సంతోషంగా ఉన్నాం అంటూ ఆనందిస్తూ ఉంటారు.

ఇంకా పురాణ పరిచయం ఉన్న కొందరు ఈనాటి దరిద్రానికి కారణం గత జన్మంలో చేసిన కర్మఫలం అంటూ ఉంటే, మరికొందరు ఈనాటి ఐశ్వర్యానికి గతజన్మల పుణ్యఫలం అంటూ ఆనందిస్తారు.

ఏదైనా గడిచిన కాలంలో చేసిన కర్మఫలితం వర్తమానంలో అనుభవంలోకి వస్తే, ఇప్పుడు చేస్తున్న కర్మఫలితం భవిష్యత్తులో అనుభవంలోకి వస్తుంది అంటారు.

అయితే ఇప్పుడు చేస్తున్న కర్మకు గతమే కారణమైతే, మరి భవిష్యత్తు ఫలితానిక వర్తమానంలో నేనెలా కర్తను? అను ప్రశ్న వస్తే దీనికి సమాధానం తెలియాలంటే కర్మ యోగం గురించి భగవద్గీత చదవమంటారు. కర్మ గురించి పూర్తిగా తెలుసుకుని, కర్మను శ్రద్ధతో చేయడం ప్రధానమంటారు.

కర్మ యోగం ప్రఖ్యాత రచయితల రచనలు మనకు ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ రూపంలో లభిస్తున్నాయి. ఉచితంగా ఈ పి.డి.ఎఫ్ పుస్తకాలు చదువుకోవడానికి ఈ క్రింది బటన్ పై టచ్ చేయండి.