కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో చేయడం మంచిది. ఎందుకంటే పుస్తకపఠనం ఒక మంచి అలవాటుగా చెబుతారు. మనసుకు జ్ఙానం అందేది బుక్స్ వలననే…

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో
కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

కొవిడ్-19 ఒక అంటువ్యాధి. మందులేని అంటువ్యాధి ఈ కరోనా (కొవిడ్-19) వ్యాధి. మందులేని వ్యాధి ఉన్నప్పుడు అది పాకకుండా జాగ్రత్త పాటించడమే ఉత్తమ మార్గం అంటారు.

కరోనా వ్యాప్తి చెందుతూ చాలా దేశాలలో విస్తరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా వ్యాధి వ్యాప్తి పెరుగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది. మన తెలుగురాష్ట్రాలలో కూడా ఇది అమల్లో ఉంది.

లాక్ డౌన్ ప్రధాన ఉద్దేశ్యం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి, కాబట్టి అంతా ఇంటికే పరిమితి కావడం చాలా ప్రధానం విషయం. ఇంకా సామాజిక దూరం పాటించడం మరింత ముఖ్యం అంటున్నారు.

అయితే ఇంట్లోనే కూర్చుంటే, వారాలపాటు ఇంట్లోనే ఉండడమంటే ఏం తోయదు. ఖాళీగా ఉండే మనసు ఏదో కొత్త అలజడి మనసులో సృష్టిస్తుంది. లేకపోతే సామాజిక దూరం తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది.

కాబట్టి మనసుకు ఏదో ఒక కాలక్షేపం ఈ కరోనా కాలంలో తప్పనిసరి. కొందరికి టైంవేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు అటువంటి వారు కూడా ఇంట్లోనే కాలక్షేపం చేయాలి.

ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేయడానికి టివి, ఫోన్లు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ అవి ఏదో ఒక కొత్త విషయం మనసులో తీసుకువచ్చి ఆలోచన పెంచవచ్చును. న్యూస్ చానల్స్ ఏంజరుగుతుందో తెలుసుకోవడం వరకు మేలు.

ఇక సినిమాలు మరొక కాలక్షేపం అయితే ఈ సినిమాలు కూడా ఇప్పటికే మనం చూసినవి ఉండవచ్చును. వినోదం వస్తుంది. కాసేపు కాలక్షేపంగా ఉంటుంది.

సినిమాలే కాకుండా యూట్యూబ్ చానల్లో ఉండే ప్రవచనాలు, ఆధ్యాత్మికంగా మనసుకు ఊరటనిస్తాయి. ప్రవచనాలు వలన సాత్విక గుణం పెరుగుతుంది. సత్వగుణంలో మనసు స్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రవచనాలు, సినిమాలు, న్యూస్ ఏదైనా సృష్టించినవే… అన్ని దృశ్యరూపంలో మనకు కనిపిస్తాయి. వీడియో వీక్షణ అంతా మనకు దృశ్యరూపంలోనే ఉంటాయి.

కరోనా కాలక్షేపం బుక్ రీడింగుతో

కరోనా కాలంలో బుక్ రీడింగ్ మరొక అంశం… బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటుగా చెబుతారు. బుక్ రీడింగ్ మనకు విషయాలను అక్షరరూపంలో తెలియజేస్తాయి. అక్షర రూపంలో ఉన్న విషయం మన మనసులోకి భావజాలంగా వస్తుంది.

బుక్ రీడింగ్ వలన విషయావగాహన ఏర్పడుతుంది. ఏ విషయానికి సంబంధించిన బుక్ చదివితే అ విషయంపై మనసుకు అవగాహన ఏర్పడుతుంది. ఇంకా ఆ విషయానికి సంబంధించిన మరిన్ని బుక్స్ చదివితే, ఆ విషయంపై మనసుక ఊహాశక్తి పెరుగుతుంది.

మనం ఎటువంటి బుక్స్ చదివితే అటువంటి ఆలోచనలు మనలో వస్తాయి. ఎటువంటి బుక్ రీడ్ చేస్తున్నామో, అటువంటి భావజాలం మనలో బలపడుతుంది. అందుకే సామాజిక ధర్మం, వ్యక్తిగత ధర్మం గురించి తెలియజేసే బుక్స్ రీడ్ చేస్తే అది మనసుకు మరింత బలం.

కరోనా కారణంగా చాలామందికి ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. చాలామందికి కాలక్షేపం అలవాటుగా ఉండకపోవచ్చును. అయితే ఈ కాలంలో బుక్ రీడింగ్ చేయడం కొత్త విషయాలు తెలుసుకోవచ్చును.

మన కెరీర్ కే సంబంధించిన విషయాలను మరింతగా బుక్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చును. ఇంకా విద్యా విజ్ఙాన విషయాల గురించి తెలుసుకోవచ్చును.

ఆన్ లైన్లో మనకు వివిధ రకాల తెలుగు బుక్స్ ఫ్రీగా లభిస్తాయి. అటువంటి తెలుగు ఫ్రీబుక్స్ డౌన్ లోడ్ చేసుకుని మన వైజ్ఙానిక పరిజ్ఙానం పెంపొందించుకోవచ్చును.

బుక్ రీడింగ్ అంటే ఆ బుక్ లోఉన్న విషయంతో మనసు కాసేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం. ఏకాగ్రతలో ఉన్నప్పడు మనసు పట్టుకున్న విషయం మనసులో ఎప్పటీకి ఉంటుంది.

బక్ చదవడం మంచి అలవాటు అంటారు. కరోనా వలన కాలం మిగులుతుంది. ఈ కాలంలో బుక్స్ ద్వారా మన అభిరుచికి తగ్గట్టుగా బుక్ రీడింగ్ వలన తెలిసిన విషయాలలో మరింత అవగాహన ఏర్పడుతుంది.