ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికి పుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది.

భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది. ఆటోమేటిగ్గా ఆసక్తి కూడా వస్తుంది. అంటే ఒక వ్యక్తికి భగవంతుడు అంటే ఆసక్తి ఉంది. ఏ భగవంతుడు అంటే ఆసక్తి? అంటే వినాయకుడు అంటే ఆసక్తి ఉంది.

విఘ్నేశ్వరుడు ఎందుకంటే, ఏ శుభలేఖ చూసిన మొదటగా శ్రీరస్తు, శుభమస్తు అవిఘ్నమస్తు పదాలు కనబడతాయి. ఎవరంటే? వినాయకుడు అంటారు. విఘ్నేశ్వరుడిని చూస్తే, బొజ్జతో బొద్దుగా ముద్దుగా ఉంటాడు. కానీ ఏనుగు ముఖంతో ఉంటాడు. పామును పొట్టకు చుట్టుకుని ఉంటాడు. పరిశీలిస్తే ఒక దంతంతో ఉంటాడు. అంత పొట్ట వేసుకుని లావుగా ఉండేవాడు, చిట్టెలుకపై ప్రయాణం చేస్తాడు. అసలు ఆసక్తికే ఆసక్తి పుట్టించేలా రూపం ఉంటుంది. ఖచ్చితంగా ఆసక్తికరమైన భావన బలంగా ఉంటుంది. ఎందుకలా? గణేషుడు గురించి తెలిపే పుస్తకాలు చదివితే, గణపతి ఎవరు? లంభోధరుడు జననం ఎట్టిది? వినాయకుడు అవతార ప్రయోజనం? ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

ఇంకొకరికి శివుడు అంటే ఆసక్తి, ఎందుకు?

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే...
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

శివుడు అంటే ఎందుకు ఆసక్తి అంటే, శివుడికి మూడు కళ్ళు ఉంటాయి. కంఠం నీలంగా ఉంటుంది. పాము మెడలో ఉంటుంది. నంది మీద కూర్చుంటాడు. ఎందుకలా అనే దృష్టి వెళ్ళి, శివుడు గురించి తెలుసుకోవాలి. శివుడు ఎందుకలా ఉంటాడనే ఆలోచన, ఆలోచనకు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఇలా శివుడు గురించి కొందరికి ఆసక్తి పెరగవచ్చును.

కొందరికి విష్ణువు అంటే ఆసక్తి పెరుగుతుంది. నాలుగు భుజములు కలిగి ఉంటాడు. నల్లగా ఉంటాడు. పాముపై పడుకుని ఉంటాడు. అవతారములు ఎత్తుతూ ఉంటాడు. అనేక అవతారములతో పూజింపబడుతూ ఉంటాడు. ఎందుకు ఇన్ని అవతారములు ఎత్తాడు. మిగిలిన దేవతలకు లేనన్ని అవతారములు ఈ స్వరూపమునకే ఎందుకు? ఆసక్తికరమైన ప్రశ్న…

ఇక మూడవ ఆయన కానీ మనం మొదలు ఆయన సంకల్పంతోనే… ఆయనకు నాలుగు తలకాయలు ఉంటాయి. ఎక్కడ పూజలందుకోడు.. కానీ సృష్టికర్త. ఆ సృష్టికర్తే బ్రహ్మదేవుడు. నాలుగు తలకాయలు బ్రహ్మదేవుని స్వరూపం చూడగానే ఆయనకు ఎందుకు నాలుగు తలకాయలు అనే ఆసక్తి వస్తుంది. ఇలా ఆసక్తి పెరగడానికి మనకు కనిపించే దైవ స్వరూపములు ఉంటాయి. ఎందుకు దేవతా మూర్తుల అలా ఉంటారంటే, అలా ఉన్నవారిని చూసి ఆసక్తి పెరిగితే ఆలోచనతో జ్ఙానం వైపు మనిషిని మళ్లించడానికే అనే ఆసక్తికరమైన విషయం ద్యోతకమవుతుంది.

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే...
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

భక్తి అనే ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

ఆసక్తికరంగా ఉండే దేవతా మూర్తులు, వారిపై ఆసక్తి కలగగానే వారి వారి పురాణములు మనకు మనోవిజ్ఙానమును తెలియజేస్తాయి. ఏ పురాణము చూడండి.. మనసు, మనసు చేష్టలు, బలమైన మనసు, బలహీనమైన మనసు, ఆచారం కలిగిన మనసు, ఆచారం లేని మనసు… ఇలా మానసిక పరిస్థితులలో మనసు ఆయుధం ఎలా అవుతుంది. మనసు గురించిన విజ్ఙానమును అందిస్తూ, జీవిత పరమార్ధం గురించి తెలియజేస్తూ ఉంటాయి.

మనసును నియంత్రణలో పెట్టుకుంటే, కష్టంలో దాని పనితీరు బాగుంటంది. మనసు ఆకలికి తట్టుకోవడం అలవాటు అయి ఉంటే, ఉపవాసం చేయగలుగుతుంది. ఆకలికి తట్టుకునే అలవాటు లేకపోతే, ఆకలి తీర్చుకోవడానికి దొంగ కూడా మనిషిని మార్చే అవకాశం మనసుకు ఉంటుంది. అంటే నియంత్రణ అలవాటు అయిన మనసు ఆకలిని తట్టుకుని విజ్ఙతతో వ్యవహరిస్తుంది. ప్రకృతిలో తనకున్న పరిధిలో పరువుగా మనగలుగుతుంది.

ఆసక్తి గురించి తెలియజేస్తూ దేవతా స్వరూపములు గురించి ఎందుకు చెప్పానంటే? ఎక్కువమందికి తెలిసి ఉండే దేవతా మూర్తులు. ఇక పరిశీలన చేస్తే, మనోవిజ్ఙానం వైపు, జీవిత పరమార్ధం వైపు తీసుకువెళ్ళగలిగే పురాణ విజ్ఙానం ఆయా దేవతలపై ఉంటాయి. ఇక భక్తితత్వంలో మనసు ఉపశమనం పొందుతుందని పెద్దల మాట. భక్తి అనే ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… భక్తి గురించిన పురాణాలు చదవాలనిపిస్తుంది. మనసు అంటే ఏమిటో? తెలుస్తుంది.

సరే ఇక ఆసక్తి ఇంకా ఇతర విషయములపై కలుగుతుంది. చూస్తున్న వస్తువులో గుణం గమనించడం వలన ఏర్పడే ఆసక్తి పరిశీలనాత్మకమైన ఆలోచనలను సృష్టిస్తుంది. ఇటువంటి ఆలోచనలు విద్యాభ్యాసంలో ఎక్కువగా ఉంటే, విద్యార్ధికి విద్యలో క్లారిటీ వచ్చేస్తుంది.

మనిషి ఎదురుగా లేకపోయినా వారితో నేరుగా మాట్లడగలగడం అనే సదుపాయం గలిగిన ఫోనుపై ఆసక్తి వస్తుంది. ఇంకా కొన్ని ఫోన్లు ద్వారా ఎక్కడో ఉన్న మనిషిని చూస్తూ, మాట్లడగలగడం మరింత ఆసక్తికరమైన ఆలోచనను పరిశీలిస్తే కలుగుతుంది. అయితే అలవాటు అయ్యాక అటువంటి పరిశీలన మనిషిలో కొరవడుతుంది. కానీ పరిశీలన చేస్తే, చూస్తున్న మొబైల్ ఫోనులో ప్రపంచం ఎలా కనబడుతుంది? అనే ఆసక్తి కలగక మానదు.

ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన చుట్టూ ఉండే వస్తువులు కానీ మొక్కలు కానీ ప్రదేశాలు కానీ దైవ స్వరూపములు కానీ మనలో ఆసక్తిని కలిగిస్తాయి. మనం పరిశీలన చేస్తే, చాలా విషయాలు ఆసక్తికరంగానే ఉంటాయి.

న్ని విషయాలు, అన్ని వస్తువులు, అన్ని అంశములు అందరికీ ఆసక్తి చూపడానికి మనసు

అయితే అన్ని విషయాలు, అన్ని వస్తువులు, అన్ని అంశములు అందరికీ ఆసక్తి చూపడానికి మనసు ఇష్టపడకపోవచ్చును. కొందరు దైవం అంటే భక్తి ఉంటే, కొందరికి దైవం అంటే భయం ఉంటుంది. కొందరికి దేవుడు ఎక్కడ అనే ఆసక్తి ఉంటుంది. కొందరికి వస్తువులను పరిశీలించడంపై ఆసక్తి ఉంటుంది. కొందరికి వస్తువు పనితీరుపై ఆసక్తి ఉంటుంది. కొందరికి మానవ శరీరం పనితీరు గురించిన ఆసక్తి కలగవచ్చును. కొందరికి కంపూట్యర్స్ అంటే ఆసక్తి పెరగవచ్చును.

ఇలా ఆసక్తి ఏర్పడడంలో కొందరికి కొన్నింటిపై ఉంటుంది. కొందరికి దీర్ఘమైన పరిశీలన ఏదో ఒక విషయంలో ఏర్పడుతుంది. ఎలా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. ఈ ఆలోచనే కలిగితే, ఆ భగవంతుడు కనిపించేవరకు ప్రయత్నం ఆగదు. ఇక ఇక్కడ వంద ఆలోచనలు లేవు. నిజంగా భగవంతుడినే చూడాలనే ప్రయత్నం అంతే. స్వామి వివేకానందకు భగవంతుడిని చూడాలి, అనే ఆలోచనతోనే రామకృష్ణ పరమహంసను కలవడం జరిగింది.

మరికొందరికి కంప్యూటర్ ఎలా పని చేస్తుంది. దాని బ్యాక్ గ్రౌండులో ఏం జరుగుతుంది. తెలుసుకోవాలనే ఆసక్తి. అదే తపన, అదే ఆలోచన… దాని గురించి తెలిసినవారి దగ్గర తెలుసుకోవడం, ఆలోచించడం సాధన చేయడం జరుగుతంది. ఇలా సుదీర్ఘమైన ఆసక్తి కొందరికి కలిగితే, వారి ప్రయత్న ఫలితం చాలామందికి మార్గదర్శకం కావచ్చును. ఇందుకు సాయపడే విషయాలలో పుస్తకం ఒక ఆయుధంలాగా ఉంటుంది.

ఎందుకు పుస్తకం ఆయుధం అంటే, అనుభవజ్ఙులు

ఎందుకు పుస్తకం ఆయుధం అంటే, అనుభవజ్ఙులు తమన అనుభవ సారమును పుస్తక రూపంలో వివరించి ఉంచుతారు. కొన్ని సంస్థలు ఒక వస్తువు తయారి గురించి, దానికి ఉపయోగపడే మూల పదార్ధముల గురించి, వాటి వాటి గుణములు గురించి విధానములను ఒక పుస్తకరూపంలో మార్చుతారు. ఇలా ఏదైనా విజ్ఙానపరమైన విషయాలు పుస్తకంలోకి మారతాయి.

స్కూలులో పాఠాలు పుస్తకంలో వివరించబడిన విషయాలే. కానీ ఆ పుస్తకం కూడా ఎవరో ఒకరు వ్రాసినదే అయి ఉంటుంది. ఆ వ్రాసినవారికి పుస్తకం చదివే అలవాటు ఉంటుంది.

అంటే పుస్తకం విజ్ఙానం అందిస్తుంది. ఆసక్తిని బట్టి పుస్తకం మరింత అవగాహన కలిగించే విజ్ఙానం అందిస్తుంది. కొత్తగా సృష్టించబడిని విధానం మరలా పుస్తకం అందుకుని భద్రపరిచి భవిష్యత్తులో మరొకరికి అందేవిధంగా మారుతుంది. పుస్తకం ఓ విజ్ఙాన వారధిలాగా మారుతుంది.

దేనిపై ఆసక్తి కలిగితే, దానిపై వివరణలతో కూడిన బుక్స్ నేర్చుకునేవారి ముందుంటాయి. దీర్ఘకాలికమైన ఆసక్తి అందరికీ ఒకలాగా ఉండదు. కానీ అందరిలాగానే ఉంది అంటే అది కేవలం అనుభవించడం వరకే పరిమితం అవుతుంది.

ఎప్పుడూ అన్నం మాత్రమే తినేవారికి కొంచెం బిర్యాని తినిపిస్తే, బిర్యానిపై ఆసక్తి పెరుగుతుంది. మరలా బిర్యాని తినాలనిపిస్తుంది. ఇది అందరికీ కలిగేదే, తిని అనుభవించడం వరకు పరిమితం. కానీ బిర్యాని తయారి ఎలా? బిర్యాని ఎలా చేస్తారు? ఇది కొందరికి నేర్చుకునేవరకు పరిమితం. ఆసక్తి ఎక్కడవరకు పరిమతం అయితే అక్కడి వరకు మనసు విషయసంగ్రహణం చేస్తుంది.

ఆసక్తి అందరికీ ఉంటుంది. కొన్ని విషయాలలో అనుభవించడం వరకు పరిమితం అయితే ఏదో ఒక విషయంలో పూర్తిగా తెలుసుకునేవరకు ఉంటుంది. ఇలా ఒక విషయంలో పూర్తిగా తెలుసుకునేవరకు ఉండే, ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… అవగాహన చేసుకోవడమే తరువాయి విషయసంగ్రహణం చేయవచ్చును.

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే...
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

చంద్రుడు అత్యంత ఆసక్తికరమైన స్వరూపము. ఎందుకంటే చంద్రుడు మన కంటికి కనబడతాడు. ఈయన గురించి పురాణములలో చెప్పబడి ఉంది. ఇంకా మనకు ఉన్న తిధలు, చంద్రగమనం ఆధారంగానే సాగుతుంది. ఇంకా చంద్రుడు ఒక ఉపగ్రహంలాగా మనకు పుస్తకములలోనూ పరిచయం ఉంటుంది. పౌర్ణమి రోజున పూర్ణ చంద్రుడు మనసును ప్రభావితం చేస్తాడు. ఆరోజు చంద్రుడిని చూస్తూ ఆనందించేవారు ఉంటారు.

పరిశీలిస్తే ప్రకృతి చాలా ఆసక్తి. మనసులో కలిగిన ఆసక్తి బలం బట్టి ఆసక్తి మనకు విషయ పరిజ్ఙానం అందిస్తుంది. ప్రకృతిలో మన మనసు చూపించిన ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… మనసు దృష్టి సారించిన ఆసక్తిలో ఎంతో విషయ సేకరణ చేయవచ్చును. పుస్తకపఠనం విజ్ఙానంతో చెలిమి చేయడం వంటిది అంటారు. ఉపయోగించుకుంటే ఆసక్తి బలం.

ధన్యవాదాలు.