ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు

జీవితం ఆశలు ఉంటే, ఆ ఆశలకు తగ్గట్టుగా ఆలోచనలతో కూడి ఉంటుంది. అయితే ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు అంటారు. ఆశలేని జీవి ఉండరు. ఆశ పెరిగే కొద్ది ఆలోచన ఆగదు. అలవాటుకు కారణం ఆశ, అత్యాశకు కారణం అలవాటు అయితే ఆశకు హద్దుండదు, ఆలోచనకు అంతం ఉండదు

ఆశలు అందరికీ సహజం అయితే అవి తీరకపోతే మాత్రం ఆలోచనలు అంతం లేకుండా సాగుతాయి. ఆశ అసాధ్యం అయినప్పుడు ఇక ఆలోచనకు అంతుండదు. సాధారణ ఆశలు తీరే అవకాశం ఎంతగా ఉంటే, అసాధారణ ఆశలలో అయితే అవకాశాలు అంతగా ఉండవు.

ఆర్ధిక స్థితిని బట్టి ఆశ ఉంటే, అది తీరి మనసుకు సంతోషం. అత్యాశ అయితే అది దు:ఖదాయకం. సామాన్యుడు స్మార్ట్ ఫోను వాడాలని అనుకోవడం ఆశ అయితే, ఐఫోను కావాలనుకోవడం అత్యాశగా ఉండవచ్చును. సాధారణ స్మార్ట్ ఫోన్ ధర మంచి ఫీచర్లతో 8వేల నుండి లభస్తే, అవే ఫీచర్లు కలిగిన ఐఫోను ధర మాత్రం నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

సామాన్యుడు ఐఫోను కొనుగోలు చేయవచ్చను. కానీ అందుకు తగిన ధనార్జన లేకుండా ఉంటే, ఐఫోను ఆశ అత్యాశగానే ఉంటుంది. ఆర్ధిక స్థితిని బట్టే ఆశపడితే ఆలోచన తక్కువగా ఉంటుంది. ఆర్ధిక స్థితిని మించి ఆశలు పెంచుకుంటే, ఆలోచనలు పెరుగుతాయి. మొదట్లో బడ్జెట్ ఫోను వాడిన మనసు, తర్వాత కొత్తగా వచ్చిన ఫీచర్ ఫోను కావాలంటుంది. ఇక్కడ ఆశ మరలా రిపీట్ అయ్యింది.

సరే ఫోను పాతబడింది. కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇక ఫోను మార్చాలనే ఆశకు ప్రకృతి పరంగా కూడా డిమాండ్ పెరిగింది. ఇక అవకాశం కోసం చూసిన ఆశ ఆలోచనలను వేగం చేస్తుంది. పాత ఫోను మార్చి కొత్త ఫోను కొనాలనే ఆసక్తి అధికం అవుతుంది. తగినంత ధనం ఉంటే, కొనాలనుకున్న ఫోను కొనేస్తాం. లేకపోతే ఆశనెరవేరేవరకు ఆలోచన చేసి, ధనం సమకూరగానే కొనుగోలు చేస్తాం.

మొదటి ఫోను కొన్న కొన్నాళ్ళకు కొత్త ఫీచర్లవైపు వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, రెండవ ఫోను కొన్న కొన్నాళ్ళకు కొత్త ఫోను కొనాలనే ఆశ పుట్టడానికి ఎక్కువ సమయం అక్కరలేదు. సరే మూడవ ఫోను కొనడానికి డబ్బుంది, కొనేశాం… కానీ మూడవ ఫోను కొనుగోలు చేసేటప్పుడే, లేటెస్ట్ ఫీచర్లతో ఫోను ఉందా? లేదా?.. కొత్త ఫీచర్లు మరలా ఎప్పటికీ మారతాయి? అనే ప్రశ్నలతో మరొక ఫోను ఎప్పుడు కొనాలో కూడా మనసు ఫిక్స్ అవుతుంది. అలా ఆశకు హద్దుండదు.

ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు. హద్దులేకుండా ఆలోచన చేసే మనసుకు అత్యాశ వైపు వెళ్ళడానికి కూడా అట్టే కాలం పట్టకపోవచ్చును. ఆశలు అధికం అయ్యేకొలది, ఆలోచనలు పెరుగుతాయి.

ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు
ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు

తోటివారి అనుభవిస్తున్న జీవితం మన జీవితంలో కూడా ఆశకు కారణం కాగలదు. మనకు తెలిసిన విషయజ్ఙానం మన ఆశలకు జీవం పోయవచ్చును. ఆశ పుట్టడానికి కారణం మనకున్న విషయ పరిజ్ఙానం కారణం కాగలదు.

ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు. ఆశ పుట్టడానికి కారణాలు అనేకం ఉంటాయి.

ఎవరికి ఏ విషయంలో పరిజ్ఙానం ఉంటే ఆ విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆ విషయానికి సంబంధించిన వస్తువులపై ఆశ పుట్టుకొస్తుంది. ఆశ పుట్టడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఆశ నెరవేర్చుకోవాలనే తలంపుకు పరిస్థితులు బలం చేకూరిస్తే ఆశ నెరవేరుతుంది. పరిస్థితులు ప్రతికూలిస్తే, ఆశ నెరవేరదు.

ఆశపడడం, ఆశించిన వస్తువు అందడం అలవాటు అయితే ఒక్కసారి ఎప్పుడైనా నిరాశ ఎదురయితే భరించడం కష్టం. ఎప్పుడూ నిరాశే ఎదురయ్యేవారికి తీరని ఆశ ఏదో ఒకేసారి తీరినా అది అతనికి ఇబ్బందికర స్థితినే తీసుకువస్తుంది. కాబట్టి కాలం ఆశ నిరాశలనే కలిగిస్తూ, మనిషి జీవితాన్ని ఆశ-నిరాశల మద్యే తిప్పుతందని అంటారు.

ఆశ వ్యక్తిగతంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితం స్వార్ధపూరితంగానే సాగే అవకాశం ఉండవచ్చును. ఆశ తనవారి కోసం అయితే, ఆవ్యక్తి జీవితం నలుగురిలో మంచిని సంపాదించగలుగుతుంది.

సమాజంలో తల్లీదండ్రుల ఆశ కుటుంబం కోసం ఉంటుంది. నాయకత్వం ఆశ తమకు పరిచయం ఉన్న కుటుంబాల ఆశలు నెరవేరాలన్న ఆశ ఉంటుంది. ఆశ అందరినీ ఆడిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలు బాగా చదవాలని ఆశపడతారు. పిల్లలు బాగా చదువు పూర్తి చేసుకుంటే, మంచి ఉద్యోగం రావాలని ఆశిస్తారు. ఆపై వివాహం… అలా తల్లిదండ్రుల ఆశ మనవళ్ళను చూసేవరకు ఉంటుంది. ఆపై వారి ఆశలు ఆగి జీవిత పరమార్దం వైపు వెళ్ళవచ్చు.

అంటే ఒక వ్యక్తి ఆశ చిన్న చిన్న వస్తువులై ఆశపడడం, వాటిని నెరవేర్చుకోవడం. అలా వాటిని నెరవేర్చుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. ఇక తల్లిదండ్రుల ఆశలు, పిల్లల మనోభావాలు కలిసినప్పుడు… పిల్లల చదువులు, ఉద్యోగం, వివాహం కూడా సహజరీతిలో సాగుతాయి. పరస్పర భావాలు కలిగినప్పుడు మాత్రం ఏదో ఒక విషయంలో ఒకరి ఆశ మరొకరికి నిరాశ కావచ్చును.

ఒకరి ఆశ మరొకరికి నిరాశగా మారినప్పుడు

ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు
ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు

ఒకరి ఆశ మరొకరికి నిరాశగా మారినప్పుడు, దాని తీవ్రతను బట్టి మరొకరి మనోస్థితి మారుతుంటుంది. ఒకరిని నిరాశపరచి తన ఆశకు మాత్రమే ప్రధాన్యత ఇవ్వడం అలవాటు అయితే అటువంటి ఆశ పుట్టిన వ్యక్తి ఆశలకు హద్దుంటుందనే గ్యారంటీ ఉండదు. మరొకరికి నిరాశ కలుగుతుంది కాబట్టి ఈ ఆశను వదిలేస్తాను అని ఆశపై ఆలోచనను విరమించుకున్నవారికి జీవితంపై మంచి అవగాహన ఉంటుంది. వారికి ఆశపై హద్దు ఏర్పడుతుంది.

ఆశలపై హద్దు ఉంటే, ఆలోచనలు పరిమితం అవుతాయి. ఆలోచనలు పరిమితం అయితే మనిషి సంతోషంగా జీవితం గడుపుతాడు. ఆ మనిషితో బాటు ఉన్నవారికి కూడా ఆ జీవితం సంతోషదాయకమే అవుతుంది.

అయినా ఆశకు హద్దు ఉండాలనే ఆలోచన మనసుకు బాధ కలిగించేదిగానే ఉంటుంది. గారాభంగా పెరిగిన వారు ఉంటే వారి ఆశను నిరాశగా మారితే తట్టుకోలేకపోవచ్చును. గారాభం చేయడం అంటే పిల్లల స్వభావం అత్యాశవైపు నడిపించడం అయ్యే అవకాశం లేకపోలేదు.

అలవాటు అనే ఆలోచనా ప్రక్రియ మనసుకుంటే బలం మరియు బలహీనత… అన్నం తినడం మొదలెట్టిన బాల్యంలో అలవాటు అయిన రుచులు, పెరిగాక ఆవ్యక్తి ఆరోగ్యంపై చూపుతుంది. ఆకు కూరలు చిన్ననాటి నుండి తినడం అలవాటు అయితే ఆవ్యక్తికి, ఆ అలవాటు బలం. మాంసాహారి అయినా బలమే కానీ మసాలాలు మిళితమైన ఆహారం కొంతకాలానికి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటారు. ఆ విధంగా కొంత కాలం అలవాటు బలం అయితే మరికొంత కాలం బలహీనత. అలా అలవాటు ఒక్కోసారి బలం అయితే మరోసారి బలహీనతగా మారుతుంది.

అటువంటి అలవాటు ఆశలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే, ఒక్కసారిగా నిరాశను ఫేస్ చేయడం కష్టమే అవుతుంది. అటువంటి జీవితం నరసింహ తెలుగు సినిమాలో నిలాంబరి(రమ్యకృష్ణ) పాత్రలాగా మారుతుంది.

అలవాటుని బట్టి ఆశ ఉంటే, ఆశలను బట్టి అలవాటులు మారుతూ ఉండవచ్చును. మొదట్లో అన్నం తినడం అలవాటు అవుతుంది. అమ్మ తినిపించిన ఆహారంలో కొన్ని రుచులు మనల్ని ఆకట్టుకుంటే, రిపీట్ అయిన రుచులు మనకు ఆశలను కల్పిస్తాయి. అమ్మ మరలా అటువంటి రుచి ఉన్న పుడ్ ఎప్పుడు పెడుతుంది, అనే ఆశ తెలియకుండానే పుడుతుంది. అమ్మ మనకిష్టమైన రుచిని కనుక్కొని పెట్టడం మొదలుపెడితే, తీరుతున్న ఆశ, ఆ రుచిపై ఆసక్తిని పుట్టించి, ఆరుచికి అలవాటు చేస్తుంది. ఇలా అలవాటు ఆశ రెండూ అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి.

అలవాటు వలన ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు.

అలవాటు వలన ఆశకు హద్దుండదు ఆలోచనకు అంతుండదు. ఎందుకంటే ఆశ ఆలోచనను పుట్టిస్తుంది. ఆ ఆశ నెరవేరుతుందా? లేదా? అనే సంకల్ప వికల్పమైన ఆలోచనలను ఆశ రేకిత్తిస్తుంది. అలవాటు, ఆశ ఈ రెండింటిని తప్పుబట్టరు. అయితే అవి అత్యాశగా మారితే మాత్రం తప్పుబడతారు.

ఆశకు హద్దుండదు, కానీ మనం ఆలోచించి హద్దులు పెట్టాలి. లేకపోతే మనసు ఆశను నెరవేర్చుకోవడానికి, హద్దు మీరడానికి కూడా ప్రయత్నిస్తుంది. అలా ఒక్కసారి మనసు హద్దు మీరితే, అదే అలవాటు విషయంలో మనసు మరలా హద్దు మీరుతుంది. అలా హద్దు మీరడం అలవాటు అయిన మనసు గాడి తప్పుతుంది. ఆశ అత్యాశగా మారుతుంది. అత్యాశ జీవితాన్ని పాడు చేస్తుంది. అటువంటి జీవితానికి విలువ ఉండదు.

జీవితం పరిశీలన చేస్తే ఆశతో అలవాటు అయి అలవాటు పడడం నుండి వ్యసనం వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యసనం భారినపడితే జీవితం చేజారినట్టే… ఆశకు హద్దు పెడితే, అలవాటు నియంత్రించబడుతుంది. ఇటువంటి నియంత్రణ చిన్న చిన్న విషయాలలోనే పెట్టుకోవాలి. అప్పుడు అప్పుడు పెద్ద పెద్ద విషయాలలో కూడా ఆశ, నిరాశలు మనసు ప్రభావితం చేయవు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. పరిస్థితులలో మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ఆశ, అలవాటు మనిషి నిర్ణయక శక్తిని ప్రభావితం చేస్తాయని అంటారు. ఆశకు హద్దు పెట్టడం అంటే ఆలోచనకు చెక్ పెట్టడమే అవుతుంది.

తెలుగురీడ్స్ లోని గతపు పోస్టులు చదవడానికి ఈ క్రింది బటన్లను తాకడం లేక క్లిక్ చేయండి

తెలుగు ఉచిత బుక్స్ చదవడానికి ఈ క్రింది బటన్స్ తాకండి