అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్

ఉన్నత ఉద్యోగాలకే ఏది గ్రేట్ అంటే ఐఏస్ గ్రేట్ అంటారు. ఐఏఎస్ అవ్వడమే గొప్పగా ఉంటే, వారి కర్తవ్యం ఖచ్చితంగా చేస్తే, ఇంకా గ్రేట్ అంటారు. ఇప్పుడు ఈ గ్రేట్ ఎవరికంటే అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ కు.

సుమారు పదిహేను నెలల కాలవ్యవధిలో ఒక రాష్ట్రంలో మార్పును తీసుకురావడం అంటే గొప్పే కధా… ప్రజాభిమానం ఉన్న నాయకుల నిర్ణయాలు కూడా అమలు అవ్వడంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒక ఐఏస్ ఉద్యోగిని రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టడమే కాదు, ఫలితం రాబట్టగలగడం గ్రేట్.

ఈ క్రింది వీడియో చూడండి ఆమె చేసిన ప్రయత్నం ఏమిటో, అమె సాధించనిది ఏమిటో తెలియవస్తుంది.

https://youtu.be/uqPZgVa6QKs
అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్

మనకు ఆరోగ్యమంటే, మనం తినే ఆహారమే… మన మనసు, శరీరము రెండు నియంత్రణలో ఉండేది, మనం తీసుకునే ఆహార పదార్ధములను బట్టే ఉంటుంది. ఎటువంటి పుస్తకం చదివితే, అటువంటి ఆలోచనలు అన్నట్టు, ఎలాంటి పుడ్ తింటే, అలాంటి బలం శరీరమునకు ఏర్పడుతుంది.

కానీ కల్తీ ఆహార పదార్ధములు తింటే మాత్రం, మన శరీరం కూడా విషపూరితంగా మారుతుంది. అయితే అది ఒక్కసారిగా మార్పుకు రాదు.. కొన్నాళ్ళకు మార్పును బయటపెడుతుంది. కల్తీలో ఉండే మహత్యం అదే… తిన్న వెంటనే ఆరోగ్యవంతుడిపై ప్రభావం చూపలేదు. అలా చూపిస్తే, వెంటనే సమాజం నుండి ఆ కల్తీ సరుకు బహిష్కరింపబడుతుంది. కల్తీ సరుకు మెల్లమెల్లగానే తన ప్రభావం ఆరోగ్యవంతులపై చూపుతుంది.

మోసము, కల్తీ ఎక్కువగా ప్రజాసంబంధము కలిగిన విషయాలలోనే జరుగుతూ ఉంటాయి. అలా ప్రజలందరికీ అవసరమైనది ఆహారం.. ఇక్కడ కల్తీ చేస్తే, కష్టం సంగతి ఎలా ఉన్నా లాభానికి డోకా ఉండదు. కాబట్టి కల్తీ ఆహార పదార్ధములు పెరిగే అవకాశం ఎక్కువగానే సమాజంలో ఉంటుంది.

అటువంటి కల్తీ పదార్ధములను నిగ్రహించవలసినది ప్రభుత్వమే. కేరళలో కల్తీ ఆహార పదార్ధముల విషయంలో కఠినంగా వ్యవహరించిన అనుపమ ఐఏఎస్.. నిజంగా కేరళ ప్రజలకు మేలునే చేశారు. ఆమె వలన కేరళలో ఎక్కువ శాతం సేంద్రియ పంటలు మొదలయ్యాట. ఇలాంటి ఐఏస్ అధికారులు గ్రేట్…

అనుపమ ఐఏస్ లాంటి అధికారులు మనకు ఉంటారు. అయితే అందరి ఆరోగ్యంపై ప్రభావం చూపించే ఆహార పదార్ధముల విషయంలో ఆమె పోరాటం చేసి, కల్తీ ఆహార పదార్ధములను నిగ్రహించడం గొప్ప విషయమే.. దీర్ఘకాలికంగా మనిషి ఆరోగ్యమును హరించే కల్తీని నియంత్రిచడం అంటే, అది గొప్ప ప్రజాసేవ… ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏదో పని చేసుకుని బ్రతకవచ్చును. డబ్బుండీ ఆరోగ్యం కల్తీ పదార్దముల వలన పాడైపోతే, ప్రయోజనం ఏముంటుంది?

తినే ఆహార పదార్ధముల విషయంలో కేరళలోనే అని కాకుండా ఎక్కడ కల్తీ జరిగిన క్షమించరాదు. మనిషి తన స్వలాభం కోసం, తోటివారి ఆరోగ్యమును కల్తీ పదార్ధముల ద్వారా హరించడం శ్రేయష్కరం కాదు…

అనుపమ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ లాంటి అధికారులు కల్తీ విషయంలో రాజీపడకుండా ఉండాలి.