పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన..

పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన పడ్డ మహారాజు. ధర్మరాజుకు మనవడు, ఉత్తర – అభిమన్యుల బిడ్డ. భారతం ప్రారంభం ఈయన పుత్రుడు తలపెట్టిన సర్పయాగంతో పాండవుల గురించి చెప్పబడుతుంది. ఈ పరీక్షత్తు మహారాజు వలననే శ్రీమద్భాభాగవతం ప్రవచించబడింది.

కలియుగ ప్రారంభంలో కంటబడ్డ కలిపురుషుడుని తరిమివేయబోయాడు. అయితే కాలానుసారం కలిని వదిలేశాడు. అటువంటి మహారాజు కలిబారిన పడి, తన మృత్యువును తానే కొని తెచ్చుకుంటాడు. కలి ప్రభావం మొదటిగా గురైంది.. పరీక్షత్తు మహారాజే...

శ్రీకృష్ణుడుచే రక్షింపబడిన పరీక్షత్తు మహారాజు అంత్యకాలంలో ఆదిదేవుని ప్రవచనములు విని తరించాడు. ఈ ప్రవచనములు శుకబ్రహ్మ చేశారు. అదే మనకు భాగవతం.

పరీక్షత్తు మహారాజు పుట్టుకలోనూ పరమాత్మ సందర్శనం… అలాగే గిట్టే ముందు పరమాత్ముని ఆత్మస్వరూపడుగా సందర్శనం చేసిన మహానుభావుడు.

కలియుగ ప్రారంభం గురించి ప్రస్తావించాలంటే, పరీక్షత్తు మహారాజు గురించి చెబుతారు. భాగవతం చెప్పాలంటే పరీక్షత్తు గురించి చెబుతారు. మహభారతం ప్రారంభంలో పాండవుల గురించి చెప్పాల్సినప్పుడు కూడా పరీక్షత్తు గురించి చెబుతారు. పరీక్షత్తు మహారాజు ఈయన జననం, ఈయన శాపగ్రస్తుడు కావడం, మరణ సమయం వివరిస్తూ ఉంటే తెలుగు బుక్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ పై టచ్ చేయండి.

పరీక్షత్తు మహారాజు తొలి కలి బాధితుడు… ధర్మరాజు మనవడు, ధర్మాత్ముడు అయిన పరీక్షత్తు మహారాజులో కలి ప్రవేశించగానే… పరీక్షత్తు మహారాజు బుద్ది భ్రంశం ఎలా అవుతుందో? కర్తవ్యం స్థానంలో అహం ఎలా పెరుగుతుందో? కోపం రావడానికి పెద్దగా కారణాలు ఉండవు. ఇలా మనకు పరీక్షత్తుపై కలి ప్రభావం చూపిన విధానం ప్రవచం వింటే, మంచి విషయాలు తెలుస్తాయి.

ఈ క్రింది ప్రవచనం కలియుగ ప్రారంభంలో కలిప్రవేశం గురించి, ధర్మదేవత వ్యధ చెందడం, పరీక్షత్తు కలిని చెరపట్టడం, కలికి వరాలు ఇవ్వడం. ఆ తర్వాత కలిప్రభావం చేత బ్రాహ్మణ కుమారుని ద్వారా పరీక్షత్తు శాపం పొందడం తదితర భాగవత విషయాలు ఉంటాయి.

https://www.youtube.com/watch?v=Ey7eKAmv1hs&list=PLvLNoPBJjpJ-bkGnt7rHf1lkZtRbAT7zm&index=4
పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన